India First Air Train: దేశంలోనే తొలి ఎయిర్ ట్రైన్ త్వరలో అందుబాటులోకి రానుంది. డ్రైవర్ లేకుండానే ఈ రైలు పట్టాలపై ఆటోమేటిక్‌గా ప్రయాణించనుంది. అంతేకాక ఈ రైలులో ప్రయాణికులకు ఉచితంగానే ప్రయాణం కల్పించనున్నారు. ఈ ఎయిర్ ట్రైన్ పట్టాలు ఎక్కితే ప్రయాణికులకు మరింత సులభంగా ప్రయాణం సాగించటం సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా ఏంటీ ఎయిర్ ట్రైన్? దీన్ని ఎక్కడ ప్రారంభించనున్నారు? వంటి వివరాలు మీకోసం.
దీన్ని ఎక్కడ ప్రారంభించనున్నారు?:
- దిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మన దేశంలోనే అత్యంత రద్దీ అయిన ఎయిర్‌పోర్ట్.
- ఏటా 7 కోట్లకుపైగా ప్రయాణికులు ఈ ఎయిర్‌పోర్ట్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.
- వచ్చే 6 నుంచి 8 ఏళ్లలో ప్రయాణికుల సంఖ్య 13 కోట్లకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
- దిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చే వారిలో 25శాతం మంది ప్రయాణికులు టెర్మినల్ 1, టెర్మినల్ 2, టెర్మినల్ 3 మధ్య రాకపోకలు సాగిస్తూ ఉంటారు.
- ఎయిర్‌పోర్టులో విమానం దిగిన ప్రయాణికులు బయటికి వచ్చేందుకు బస్సు సర్వీసులను ఉపయోగించాల్సి ఉంటుంది.
- ప్రయాణికులు ఒక టెర్మినల్ నుంచి మరో టెర్మినల్‌కు వెళ్లేందుకు చాలా ఆలస్యం అవుతోంది.
- ఈ నేపథ్యంలోనే దిల్లీ ఎయిర్‌పోర్టులోని 3 టెర్మినల్స్ మధ్య మొత్తం 7.7 కిలోమీటర్ల పొడవున ఈ ఎయిర్ ట్రైన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- ఎయిర్‌పోర్టులోని 3 టెర్మినళ్ల మధ్య ప్రయాణికుల ప్రయాణం సులభతరం చేసేందుకు రూ.2 వేల కోట్లతో ఈ ఎయిర్ ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
- 2027 నాటికి ఈ ఎయిర్ ట్రైన్‌ను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
- ఈ ఎయిర్ ట్రైన్‌ను ఆటోమేటెడ్ పీపుల్ మూవర్ (APM) అని కూడా పిలుస్తారు.
- ఈ తొలి ఎయిర్ టైన్ ప్రాజెక్టుకు సంబంధించిన బిడ్లను ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో స్వీకరించనున్నారు.
- ఇందులో ప్రాజెక్ట్ దక్కించుకున్న వారికి ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోగా ప్రాసెస్ మొత్తం పూర్తి చేసి పనులు అప్పగించనున్నారు.
ఎయిర్ ట్రైన్ ప్రత్యేకతలు:
Delhi airport: DIAL issues tender for air train for terminal connectivity
— PTI News Alerts (@PTI_NewsAlerts) September 25, 2024
Edited video is available on PTI Videos (https://t.co/L2D7HH309u) #PTINewsAlerts #PTIVideos @PTI_News pic.twitter.com/QqIHzHlEQC
- ఈ ఎయిర్ ట్రైన్ అనేది పరిమిత సంఖ్యలో కంపార్ట్‌మెంట్‌లను కలిగి ఉంటుంది.
- చూడటానికి మెట్రో రైలు మాదిరిగానే ఉండే ఈ ట్రైన్ డ్రైవర్ అవసరం లేకుండానే ట్రాక్‌పై ఆటోమేటిక్‌గా ప్రయాణం చేస్తుంది.
- నిర్ణీత ట్రాక్‌లో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులువుగా, వేగంగా ప్రయాణించేందుకు ఉపయోగపడుతుంది.
- దిల్లీ ఎయిర్‌పోర్టులోని ఇతర టెర్మినళ్లు, పార్కింగ్, క్యాబ్ పికప్ పాయింట్లు, హోటళ్లు మొదలైన వాటిని చేరుకోవడానికి ఈ ఎయిర్ ట్రైన్‌ను నడపనున్నారు.
- ఈ ఎయిర్ ట్రైన్‌లో ఇంటర్నేషనల్ ప్రయాణికులకు ఉచితంగానే ప్రయాణాన్ని అందించనున్నారు.
సూసైడ్ మెషీన్లో ఫస్ట్ డెత్!- పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు - Suicide Capsule
కళ్లు చెదిరే ఫీచర్లతో వివో సరికొత్త ఫోన్ లాంచ్- ధర ఎంతంటే? - Vivo V40e Launched