ETV Bharat / technology

'హువావే మేట్ 70' సిరీస్ వచ్చేస్తున్నాయోచ్!- రిలీజ్ ఎప్పుడంటే? - HUAWEI MATE 70 SERIES LAUNCH

అదిరే ఫీచర్లతో 'హువావే మేట్ 70' సిరీస్- టైమ్​లైన్ ప్రకటించిన కంపెనీ

HUAWEI
HUAWEI (IANS)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 18, 2024, 1:05 PM IST

Updated : Nov 18, 2024, 3:19 PM IST

HUAWEI Mate 70 Series Launch: మార్కెట్లోకి మరికొద్ది రోజుల్లో హువావే నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్స్ రాబోతున్నాయి. చైనాకు చెందిన ఈ సంస్థ ఎట్టకేలకూ తన 'మేట్ 70' సిరీస్ రిలీజ్ డేట్​ను రివీల్​ చేసింది. తన 'హువావే మేట్ బ్రాండ్' ఈవెంట్​లో వీటిని పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కంపెనీ ఈరోజు 'మేట్ 70' సిరీస్ మొబైల్స్​ ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది.

'మేట్ 70', 'మేట్ 70 ప్రో' మొబైల్స్​ను 12GB వరకు RAM, 1TB స్టోరేజీతో తీసుకురానుంది. ఈ మొబైల్స్​​ను అబ్సిడియన్ బ్లాక్, స్నో వైట్, స్పర్స్ గ్రీన్, హేసింత్ పర్పుల్‌ వంటి నాలుగు కలర్ ఆప్షన్స్​లో కంపెనీ తీసుకురానుంది. ఇక 'మేట్ 70 ప్రో ప్లస్' మొబైల్​ను ఇంక్ బ్లాక్, ఫెదర్ వైట్, గోల్డ్ విత్ సిల్వర్, బ్లూ కలర్‌ ఆప్షన్స్​లో 16GB+1TB వెర్షన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ సిరీస్​లో 'మేట్​ 70 RS' కూడా ఉంటుంది.

'మేట్ 70 ప్రో' మొబైల్​ 6.88- అంగుళాల క్వాడ్- కర్వ్డ్ స్క్రీన్​తో రానుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్​తో వస్తుంది. అంతేకాక ToF 3D ఫేస్ రికగ్నిషన్ సపోర్ట్​తో ఎంట్రీ ఇవ్వనుంది. కంపెనీ ఎక్కువ మోడల్స్​ను ఈ క్వాడ్- కర్వ్డ్ స్క్రీన్​తోనే తీసుకురానుంది. అయితే స్టాండర్డ్ మోడల్​ను మాత్రం ఫ్లాట్ స్క్రీన్​తోనే కంటిన్యూ చేయనుంది.

కంపెనీ తన 'హువావే మేట్ 70' టీజర్ ఇమేజ్ రిలీజ్ చేసింది. దాని వెనుక డిజైన్‌ను వెల్లడించింది. ఈ మొబైల్​ నాలుగు లెన్స్​లతో కూడిన భారీ కెమెరా బంప్‌ను కలిగి ఉంది. ప్రీవియస్ మోడల్స్​తో పోలిస్తే దీని కొత్త బ్యాక్ టెక్చర్ మరింత​ అప్​డేటెడ్​గా ఉంది.

ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్‌లతో ఫ్రంట్ కెమెరా కూడా ఇందులో ఉంది. ఇది లాంగ్ షార్ట్స్​ను తీసేందుకు వేరియబుల్ ఎపర్చరు టెక్నాలజీ, పెరిస్కోప్ టెలిఫోటోతో కూడిన ఆప్టిమైజ్ చేసిన XMAGE బ్యాక్​ కెమెరాను కలిగి ఉంది. దీని బ్యాటరీ లార్జ్ కెపాసిటీతో వస్తుందని తెలుస్తోంది. అయితే దీని బ్యాటరీ సామర్థ్యం ఎంత ఉందో క్లియర్​గా సమాచారం లేదు. ఈ మొబైల్​ లేటెస్ట్​ HarmonyOS వెర్షన్​పై రన్​ అవుతుంది.

అన్ని మేట్ 70 సిరీస్ మొబైల్స్ డస్ట్‌ప్రూఫ్, వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌లతో వస్తాయని తెలుస్తోంది. 'హువావే మేట్ 60' సిరీస్‌లా కాకుండా కంపెనీ తన 'హువావే మేట్ 70' సిరీస్ కోసం లాంచ్ ఈవెంట్​ను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2024 నవంబర్ 26వ తేదీన ఈ 'హువావే మేట్ బ్రాండ్' ఈవెంట్​ డేట్​ ఫిక్స్ చేసినట్లు కంపెనీ ప్రకటించింది.

దిమ్మతిరిగే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్!- లీక్స్ వచ్చేశాయ్!

అబ్బబ్బా ఏమి డిమాండ్- సేల్స్​లో దుమ్ములేపుతున్న టయోటా!

Last Updated : Nov 18, 2024, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.