AB PM JAY Yojana: ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM JAY) అనేది సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు నాణ్యమైన ఆరోగ్య భద్రతను అందించేందుకు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఈ పథకం కింద అర్హత కలిగిన కుటుంబం ఆసుపత్రిలో సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్సను పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలు మీకోసం.
Check Eligibility:
- ఈ పథకం సామాజిక-ఆర్థిక కుల గణన (SECC) 2011కి వర్తిస్తుంది.
- ఈ పథకానికి అప్లై చేసేందుకు అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
- హోమ్ పేజీలో https://pmjay.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించిన తర్వాత ఎలిజిబిలిటీ బటన్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీ ఆధార్‌కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ లేదా SECC పేరును ఎంటర్ చేయాలి.
- వివరాలను సబ్మిట్ చేసిన తర్వాత మీకు OTP వస్తుంది.
- ఈ స్కీమ్‌కు మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు అందులో కన్పిస్తాయి.
Required Documents: ఈ పథకానికి మీరు అర్హత కలిగి ఉంటే అప్లికేషన్ కోసం అవసరమైన పత్రాలు ఉన్నాయో లేదా చూసుకోవటం ముఖ్యం.
- Aadhaar Card: ఐడెంటిఫికేషన్, వెరిఫికేషన్ కోసం ఆధార్ కార్డ్ ఉండాలి.
- Ration Card: మీ ఫ్యామిలీ డిటెయిల్స్ సబ్మిట్ చేసేందుకు రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరికీ ఈ పథకం వర్తిస్తుంది.
- Other ID Proof: ఒకవేళ మీ వద్ద ఆధార్ కార్డు అందుబాటులో లేకుంటే ఓటర్ ID, PAN కార్డ్ లేదా పాస్‌పోర్ట్ ఫొటో వంటి ప్రభుత్వ ID ప్రూఫ్స్‌ను ఉపయోగించొచ్చు.
అప్లై చేసుకోవటం ఎలా?:
- ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కలిగిన లబ్ధిదారులు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించాలి.
- ఈ కేంద్రాలలో శిక్షణ పొందిన సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో మీకు సహాయం చేస్తారు.
- PM-JAY పోర్టల్‌లో అందుబాటులో ఉన్న అధికారిక CSC లొకేటర్‌ని సందర్శించడం ద్వారా మీకు సమీపంలో ఉన్న CSC సెంటర్‌ను గుర్తించొచ్చు.
- CSCలో ఆపరేటర్ మీ ఎలిజిబిలిటీని వెరిఫై చేస్తారు.
- ఆపై అప్లికేషన్‌ను ఫిల్ చేయటంలో మీకు సహాయం చేస్తారు.
Check Your Application:
- AB PM-JAY అప్లికేషన్‌ను పూరించిన తర్వాత వ్యక్తిగత వివరాలతో సహా అన్ని వివరాలు సరిగ్గా ఎంటర్ చేశారో లేదో మరోసారి చెక్ చేసుకోండి.
- మీ పేరు ఆధార్ లేదా రేషన్ కార్డులో ఉన్నట్లుగానే ఉండాలి. జీవిత భాగస్వామి, పిల్లలు, కుటుంబ వివరాలు, మీ నివాస చిరునామా కూడా సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి.
- వీటన్నింటినీ మీరు క్లియర్‌గా చెక్ చేసుకున్నాక ఆపరేటర్ మీ తరపున అప్లికేషన్‌ను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేస్తారు.
Get AB PMJAY e-Card:
- మీ అప్లికేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ చేశాక మీ వివరాలన్నీ వెరిఫై చేస్తారు.
- అన్నీ వివరాలు సరిగా ఉంటే ఆ తర్వాత CSC ఆపరేటర్ మీకు ఆయుష్మాన్ భారత్ ఇ-కార్డ్ ఇస్తారు.
- దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఈ కార్డ్ మీ హెల్త్ కార్డ్‌గా పనిచేస్తుంది.
- ఈ కార్డు ద్వారా ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స పొందొచ్చు.
- ఈ స్కీమ్ కింద ప్రయోజనాలను పొందేందుకు ఈ కార్డ్ ఆసుపత్రిలో అవసరం అవుతుంది. కాబట్టి ఈ కార్డ్‌ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి.
Find Hospital:
- మీరు ఆయుష్మాన్ భారత్ ఇ-కార్డ్‌ని పొందిన తర్వాత ఏదైనా ప్యానలైజ్డ్ హాస్పిటల్‌లో ఉచిత చికిత్స పొందొచ్చు.
- పథకం కింద ప్యానెల్‌లో చేర్చిన హాస్పిటల్స్ లిస్ట్ PM-JAY వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
- మీ సమీప ఆసుపత్రిని గుర్తించేందుకు అధికారిక వెబ్‌సైట్ హాస్పిటల్ ఫైండర్ https://hospitals.pmjay.gov.in/ ను సందర్శించండి.
- అందులో మీ లొకేషన్ అంటే మీ రాష్ట్రం, జిల్లాను ఎంచుకోండి.
- ఇప్పుడు మీకు సమీపంలో ఉన్న ఆస్పత్రుల జాబితా కన్పిస్తుంది. ఇక్కడ AB PM-JAY కార్డ్‌ని ఉపయోగించి ఉచితంగా చికిత్స పొందొచ్చు.
ఎలక్ట్రిక్ వాహనాల కోసం కేంద్రం కొత్త స్కీమ్- రూ. 10,900 కోట్లు కేటాయింపు - PM E Drive Scheme