Amazon acquires MX Player: భారత్‌లో ఎంటర్టైన్మెంట్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌ను మరింత విస్తరించే దిశగా అమెజాన్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దేశీయ ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఎంఎక్స్ ప్లేయర్‌ను కొనుగోలు చేసింది. దీన్ని తమ ప్రకటనలతో కూడిన ఓటీటీ సేవలందించి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మినీటీవీలో విలీనం చేసి అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్‌గా తీసుకొచ్చినట్లు అమెజాన్ వెల్లడించింది. అమెజాన్ దీన్ని తమ ప్రకటనలతో కూడిన ఓటీటీ సేవలను స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మినీటీవీలో విలీనం చేసి 'అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్'గా తీసుకొచ్చినట్లు వెల్లడించింది. అయితే ఎంతకు కొనుగోలు చేశారనే వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులకు ఫ్రీగా ప్రీమియం కంటెంట్‌ను అందించనున్నట్లు అమెజాన్ ఈ సందర్భంగా తెలిపింది.
ఉచితంగా ఎంఎక్స్ ప్లేయర్ సర్వీసులు:
- ఎంఎక్స్ ప్లేయర్ సేవలను యాప్, అమెజాన్.ఇన్ షాపింగ్ యాప్, ప్రైమ్ వీడియో, ఫైర్ టీవీ కనెక్ట్‌డ్ టీవీల్లో వీక్షించొచ్చని అమెజాన్ తెలిపింది.
- అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ విలీనం ఆటోమేటిక్‌గా జరిగిపోతుందని, ఇందుకోసం యాప్‌ని రీ ఇన్‌స్టాల్ గానీ, అప్‌గ్రేడ్ గానీ చేయాల్సిన అవసరం ఏమీ లేదని పేర్కొంది.
- మున్ముందు కూడా ఎంఎక్స్‌ప్లేయర్ సేవలు ఫ్రీగానే కొనసాగుతాయని తెలిపింది.
- మరింత మందికి ఎంఎక్స్ ప్లేయర్‌ను చేరువ చేయనున్నట్లు అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ హెడ్ కరణ్ బేడీ తెలిపారు.
- అమెజాన్‌కు ఇది వరకే సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్‌వీడియో ఉన్న విషయం తెలిసిందే.
జొమాటో సీఈఓకు చేదు అనుభవం- మాల్ లిఫ్ట్‌లోకి అనుమతించని స్టాఫ్