ETV Bharat / technology

ఈ 5 టిప్స్ పాటిస్తే - మీ వాట్సాప్ అకౌంట్ ఫుల్​​ సేఫ్! - WhatsApp Account Security Tips

5 Tips To Secure Your WhatsApp Account : మీరు వాట్సాప్ యూజర్లా? అయితే ఇది మీ కోసమే. సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్న నేటి కాలంలో, మీ వాట్సాప్​ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈ ఆర్టికల్​లో మీ వాట్సాప్​ అకౌంట్​ను సెక్యూర్​గా ఉంచుకునేందుకు కావాల్సిన టాప్​-5 టిప్స్ గురించి తెలుసుకుందాం.

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 3:26 PM IST

security tips for whatsapp
whatsapp security tips and tricks (Getty Images)

5 Tips To Secure Your WhatsApp Account : నేడు వాట్సాప్ వాడని వారంటూ లేరంటే అది అతిశయోక్తి కాదు. చాలా సులువుగా పర్సనల్ చాట్​లు చేయడానికి, ఇతరులతో కమ్యునికేట్ కావడానికి వీలుగా ఉండడమే ఇందుకు కారణం. అయితే సైబర్ దాడులు పెరుగుతున్న నేటి కాలంలో, మీ వాట్సాప్​ అకౌంట్​ను సేఫ్​గా ఉంచుకోవడం చాలా అవసరం. అందుకే ఈ ఆర్టికల్​లో మీ వాట్సాప్​ ఖాతాను సురక్షితంగా ఉంచుకునేందుకు అవసరమైన 5 టిప్స్​ గురించి తెలుసుకుందాం.

1. టూ-స్టెప్​ వెరిఫికేషన్​ మస్ట్!
మీ వాట్సాప్ అకౌంట్​కు కచ్చితంగా 'రెండు అంచెల ధ్రువీకరణ' (టూ-స్టెప్ వెరిఫికేషన్)ను ఎనేబుల్ చేసుకోవాలి. అలాగే దానికి పటిష్టమైన 6-అంకెల పిన్ (PIN)ను పెట్టుకోవాలి. ఆ పిన్ ఎవరూ ఊహించలేని విధంగా, చాలా పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి. మీరు ఏదైనా కొత్త డివైజ్​లో, లేదా వేరేవాళ్ల డివైజ్​లో వాట్సాప్​ ఉపయోగించినప్పుడు, ఎస్​ఎంఎస్​ ద్వారా వెరిఫికేషన్ కోడ్​ వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే మీ ఖాతా సురక్షితంగా ఉంటుంది.

2. ఫింగర్​ప్రింట్​/ ఫేస్​ ఐడీ లాక్​
మీ వాట్సాప్ చాట్​ ఎవరూ చూడకుండా ఉండాలంటే, మీ ఫింగర్​ప్రింట్​/ ఫేస్​ ఐడీ లాక్​ను ఎప్పుడూ యాక్టివ్​గా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల, ఇతరులు ఎవ్వరూ మీ అనుమతి లేకుండా, మీ వాట్సాప్​ చాట్​ను చూడలేరు.

3. కంట్రోల్​లో ఉంచుకోండి!
మీ వాట్సాప్​ ప్రొఫైల్​ ఫొటో, స్టేటస్, లాస్ట్ సీన్ స్టేటస్​లను ఎవరెవరు చూడాలో మీరే నిర్ణయించుకోవాలి. మీ కాంటాక్ట్స్​లో లేనివారు, అపరిచితులు మీ పర్సనల్ విషయాలు చూడకుండా మీరే స్వయంగా సెట్టింగ్స్​ చేసుకోవాలి. ఇందుకోసం వాట్సాప్​ ప్రైవసీ సెట్టింగ్స్​లోకి వెళ్లి, తగు మార్పులు చేసుకోవాలి.

4. ఫిషింగ్ లింక్స్​పై క్లిక్ చేయవద్దు!
వాట్సాప్​లో చాలా లింక్స్​ వస్తుంటాయి. వాటిలో ఫిషింగ్ లింక్స్ కూడా ఉంటాయి. వాటిపై క్లిక్ చేస్తే, మీ డేటా మొత్తం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే వాట్సాప్​కు వచ్చే అనుమానాస్పద లింక్​లను ఓపెన్ చేయకూడదు. తెలియని నంబర్ల నుంచి వచ్చే లింక్​లపై, అత్యవసరం అంటూ వచ్చే అభ్యర్థనలపై, నమ్మశక్యం కానీ ఆఫర్ల పేరుతో వచ్చే లింక్​లపై క్లిక్ చేయకూడదు. ఇలాంటి వాటిపై వెంటనే వాట్సాప్​నకు రిపోర్ట్ చేయాలి.

5. లింక్డ్​ డివైజ్​లను సమీక్షించాల్సిందే!
మీ వాట్సాప్ ఖాతా ఏయే డివైజ్​ల్లో యాక్టివ్​గా ఉందో ట్రాక్​ చేయడం చాలా ముఖ్యం. వాస్తవానికి వాట్సాప్​లోనే మీరు ఏయే డివైజ్​ల్లో లాగిన్ అయి ఉన్నారో, ఆ జాబితా కనిపిస్తుంది. ఒక వేళ ఆ జాబితాలో మీకు తెలియని డివైజ్​లు ఉన్నా, లేదా అనధికారికంగా ఎవరైనా మీ వాట్సాప్​ను వాడుతున్నట్లు గమనించినా, వెంటనే దాని నుంచి లాగ్​అవుట్​ కావాలి. ముఖ్యంగా పబ్లిక్ కంప్యూటర్లలో వాట్సాప్ వాడుతున్న వాళ్లు, ఈ టిప్ పాటించి, తమ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవాలి.

మీ గూగుల్ 'యాక్టివిటీ'ని​ డిలీట్​ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How to Delete Google Search History

ఫోన్​ అడిక్షన్​తో బాధపడుతున్నారా? ఈ సింపుల్​ చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టండి! - How To Overcome Phone Addiction

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.