Young Men Lure Girls into Prostitution in Name of Love : తెలిసీ తెలియని వయస్సు. ఏది మంచో ఏది చెడో కనిపెట్టలేని ఆమాయకత్వం. ఎవరు ఆప్యాయంగా పలకరించినా, వారిని ఆత్మీయులుగా భావిస్తారు. వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్నారు యువకులు, మధ్య వయస్కులు. మాయమాటలు చెప్పి ఊహల్లోకి తీసుకువెళ్తారు. ప్రేమ, పెళ్లి అంటూ వంచిస్తున్నారు. వారు తీసుకొచ్చిన నగలు, డబ్బు కాజేస్తున్న ప్రబుద్ధులు, ఆపై వ్యభిచార ఊబిలోకి నెట్టేస్తున్నారు. ఈ తరహా కేసులు నగరంలో రోజురోజుకూ పెరుగుతున్నాయని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.
పోక్సో కేసుల్లో ఎక్కువ ప్రేమ మోసాలే : హైదరాబాద్‌లో ఏటా సుమారు 400కు పైగా పోక్సో కేసులు నమోదు అవుతున్నాయి. అయితే 80 శాతం కేసుల్లో నిందితులు బాలికలను మభ్య పెట్టి లోబరుచుకున్నవారే ఉంటున్నారట. ఈ సంవత్సరం 8నెలల వ్యవధిలో 500కు పైగా పోక్సో కేసులు నమోదయ్యాయి. వీరిలో 279మంది బాధితులు ప్రేమికులు, స్నేహితుల కోసం ఇల్లొదిలి వెళ్లినవారు కావడంతో పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. నగరంలోని 71 పోలీస్ స్టేషన్లో ఈ తరహా ఫిర్యాదులు సగటున రోజులు 1-2 వస్తుంటాయని తెలిసింది.
పక్కింట్లో ఉన్న బాలికపై 4 నెలలుగా అత్యాచారం - నిందితుడిపై పోక్సో కేసు నమోదు - Rape on Minor Girl
- ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని (16) ఆటోడ్రైవర్‌తో (35) ప్రేమలో పడింది. అతని కోసం ఇళ్లు విడిచి పోయింది. కొన్ని రోజులు అయ్యాక వ్యభిచార ముఠాకు విక్రయించేందుకు సిద్ధమయ్యాడు ఆటోడ్రైవర్. ప్రమాదం పసిగట్టిన బాధితురాలు అతని దగ్గర నుంచి తప్పించుకుని బయటపడింది. ఆ ఆటోడ్రైవర్ ఇప్పటికే ముగ్గురు విద్యార్థినులను మోసగించినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.
- వారిది ఉన్నత కుటుంబం. ఉన్నది ఒక్కతే కూమార్తే (15). తల్లిదండ్రులు చాలా గారాబం చేశారు. పదో తరగతి వయసులో ఉన్నప్పుడే ముగ్గురితో ప్రేమలో పడి మూడుసార్లు ఇల్లు వదిలి వెళ్లిపోయింది. పోయిన ప్రతిసారి ఇంటికి తీసుకువచ్చి పద్ధతి మార్చుకోమంటూ బతిమాలారు. అలా వెళ్లినపప్పుడల్లా ఆ బాలికను ఎలా దారికి తీసుకురావాలో అర్థం కావడం లేదని పోలీసు అధికారి తెలిపారు.
"వయసులో హార్మోన్ల మార్పు, ఆకర్షణ వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న విషయాన్ని తల్లిదండ్రులు పిల్లలకు వివరించాలి. ప్రేమవలలో చిక్కి మోసపోయిన పిల్లలను శత్రువులుగా చూడకుండా సాధారణ జీవనం వైపు అడుగులు వేసేలా తోడ్పాటు అందించాలి. వారి దృష్టి మరల్చేందుకు వారితో స్నేహ పూర్వకంగా ఉండాలి." - డాక్టర్ గీత, చిన్నారుల కౌన్సెలింగ్ నిపుణురాలు
టీనేజ్ పిల్లలు ఇలా చేయడానికి కారణాలు :
- తాను చిన్నపిల్లని కాదని సొంత నిర్ణయాలు తీసుకోగలననే అభిప్రాయం
- పరిణతిలేని వయసు
- తల్లిదండ్రుల పర్యవేక్షణలోపం
- కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు
- కుటుంబ సభ్యులకంటే బాగా చూసుకుంటాడనే నమ్మకం
- హార్మోన్ల ప్రభావం, లైంగిక అంశాలపై ఆసక్తి.
- ప్రలోభాలకు గురికావటం
మైనర్ బాలికపై అత్యాచారం చేసిన సీఐ - అదుపులోకి తీసుకున్న పోలీసులు - POCSO Case Filed On CI
విద్యార్థినులపై లైంగిక వేధింపులు - ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎంపై పోక్సో కేసు