Sai Lenin Record By Securing 5 Government Jobs : ప్రస్తుత పరిస్థితిలో సర్కార్ ఉద్యోగం సాధించడమే కష్టం అవుతున్న తరుణంలో, సింగరేణి కార్మికుని బిడ్డ పట్టుదలతో చదివి ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఆ క్వాలిఫికేషన్‌తో వచ్చే ఉద్యోగ పరీక్షలన్నీ రాశాడు. ఏ పరీక్షను లైట్‌గా తీసుకోకుండా, సెల్‌ఫోన్ సామాజిక మాధ్యమాల జోలికి వెళ్లకుండా పట్టుదలతో రేయింబవళ్లు చదవడమే తన విజయ రహస్యం అంటున్నాడు సాయిలెనిన్. తనకు అయిదు ఉద్యోగాలొచ్చినా అందులో మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగంలో చేరి రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కల్పిస్తానంటున్నాడు ఈ కుర్రాడు.
Interview with IFS first ranker: సామాజిక మాధ్యమాలకు దూరం.. ఫలితంగా ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్..!
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడు గాదే సమ్మయ్య కుమారుడు గాదే సాయి లెనిన్ వరసగా అయిదు సర్కారు ఉద్యోగాలు సాధించి రికార్డ్ సృష్టించారు. చిన్ననాటి నుంచే చదువు పట్ల పట్టుదలతో చదువుకున్న లెనిన్ 2022 సింగరేణి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 పరీక్ష రాశాడు. ఇటీవల నియామక ఉత్తర్వులు జారీ కావడంతో సింగరేణి ఉద్యోగంలో చేరాడు.
"నేను బీటెక్ పూర్తి చేసిన తర్వాత పోటీ పరీక్షల కోసం కోచింగ్ తీసుకున్నాను. నేను రోజు 12 గంటలు చదివేవాడిని. 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలలోను అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌లకు పరీక్షలు రాయగా వాటిలో సైతం అర్హత సాధించాను. నేను మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. " -సాయిలెనిన్
Young Man Sai Lenin Achieved Five Govt Jobs : అయితే ఉద్యోగం వచ్చిందని తన ప్రయాణాన్ని ఆపలేదు సాయిలెనిన్. 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలలోను అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌లకు పరీక్షలు రాయగా వాటిలో సైతం అర్హత సాధించాడు. వీటితోపాటు గ్రూప్-4లో 1491 ర్యాంకు వచ్చింది. పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టు కోసం పరీక్ష రాసిన సాయి లెనిన్ అత్యధిక మార్కులు సాధించడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వ్యక్తమౌతోంది.
రామగుండం సింగరేణి సంస్థ అర్జీ-3 ఏరియాలోని ఓపెన్ కాస్ట్-1 వన్‌లో గాదే సమ్మయ్య ఎలక్ట్రికల్ ఫోర్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతని కుమారుడు సాయి లెనిన్ గోదావరిఖనిలో పదో తరగతి వరకు విద్యను అభ్యసించాడు. ఇంటర్ హైదరాబాద్‌లోను, బీటెక్ వరంగల్‌లో పూర్తి చేసిన లెనిన్, గేట్ ద్వారా హైదరాబాద్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశాడు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అసిస్టెంట్ వెహికల్ ఇన్స్ పెక్టర్, పాలిటెక్నిక్ లెక్చరర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, గ్రూప్-4 పరీక్షలను వదలలేదు.
దీంతో పాటు సింగరేణి సంస్థ నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ పరీక్షల్లో సైతం విజయం సాధించి ప్రస్తుతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియా కైరిగూడ ఓపెన్ కాస్ట్ గనిలో పనిచేస్తున్నారు. ఒకేసారి అయిదు ఉద్యోగాలు సాధించినా తాను మాత్రం మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్‌గా ఉద్యగంలో చేరతానని లెనిన్ చెబుతున్నారు మరోవైపు ఒకేసారి ఐదు కొలువులు సాధించిన సాయి లెనిన్‌ను కాలనీవాసులు ఘనంగా సన్మానించారు.
AI Technology: ఆవిష్కరణల హేళ.. 'ఏఐ'తో భళా.. అద్భుతాలు సాధిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులు