ETV Bharat / state

నేటి నుంచి ఉమ్మడి జిల్లాల్లో రైతుభరోసా వర్క్‌షాప్‌లు - షెడ్యూల్​ ఇదే! - TELANGANA RYTHU BHAROSA WORKSHOPS - TELANGANA RYTHU BHAROSA WORKSHOPS

Workshops On Rythu Bharosa in Telangana : రైతు భరోసా పథకం విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యశాలలకు మంత్రివర్గ ఉపసంఘం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని సర్కారు ప్రారంభిస్తోంది.

Workshop On Rythu Bharosa
అన్నదాతలకు గుడ్​న్యూస్- నేటి నుంచి ఉమ్మడి జిల్లాల్లో రైతుభరోసా వర్క్‌షాప్‌లు (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 10, 2024, 10:54 AM IST

Workshops On Rythu Bharosa : రైతుభరోసా పథకం అమలుపై అనేక ఊహాగానాలు, రకరకాల ప్రచారాలు సాగుతున్న వేళ నేరుగా రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల సమక్షంలోనే పథకానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ మేరకు రైతు భరోసా పథకం విధి విధానాల రూపకల్పన కోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యశాలకు శ్రీకారం చుట్టింది.

రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ : ఇందులో భాగంగా నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కోసం ప్రత్యేక కార్యశాల నిర్వహించనున్నారు. మొత్తం తొమ్మిది రోజులపాటు ఈ ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ మేరకు తొలి కార్యశాలను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Rythu Bharosa Workshop In Khammam : బుధవారం ఉదయం ప్రత్యేక హెలికాఫ్టర్​లో హైదరాబాద్ నుంచి మంత్రుల బృందం ఖమ్మం చేరుకోనుంది. జిల్లా కలెక్టరేట్​లో రైతు భరోసాపై ప్రత్యేక కార్యశాల నిర్వహించనున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీలోని సభ్యులైన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ కార్యశాలకు హాజరుకానున్నారు.

కాగా ఈ సమావేశానికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికార యంత్రాంగం, రైతులు,రైతు సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ భేటీలో ప్రధానంగా రైతుబంధు విధివిధానాలపై అన్ని వర్గాల వారితో అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇప్పటి వరకు జిల్లాల వారీగా రైతుభరోసాపై ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక కార్యశాలలు నిర్వహించారు.

రైతు భరోసా పథకం ఎన్ని ఎకరాల వరకు వర్తింపజేయాలి? పట్టాదారు రైతులకా? సాగుదారులకా? అన్న అంశాలపై అభిప్రాయాలు సేకరించారు. కౌలు రైతులకు ఇప్పటి వరకు ఈ పథకం వర్తించని నేపథ్యంలో వారికి ఎలాంటి విధి విధానాలు అమలుచేయాలన్న అంశాలపై ప్రభుత్వం నేరుగా ఆయా వర్గాల నుంచే అభిప్రాయలు సేకరించాలని ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రత్యేక వర్క్ షాప్ లు నిర్వహించి అభిప్రాయాలు సేకరించారు.

ఖమ్మంలో తొలి కార్యశాల : ఉభయ జిల్లాల వారీగా రైతు వేదికల్లో రైతునేస్తం కార్యక్రమం ద్వారా కార్యశాల నిర్వహించారు. అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని అన్నదాతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఖమ్మంలో తొలి కార్యశాల నిర్వహించనున్నారు. ఆ తర్వాత వరుసగా ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రివర్గ ఉపసంఘం పర్యటనలు నిర్వహించనున్నారు.

Rythu Bharosa Workshop Schedule : 11న ఆదిలాబాద్, 12న మహబూబ్ నగర్, 15న వరంగల్, 16- మెదక్, 18-నిజామాబాద్, 19- కరీంనగర్, 22- నల్గొండ, 23న రంగారెడ్డి జిల్లాలో కార్యశాలతో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ పూర్తి కానుంది. ఆ తర్వాత అన్ని జిల్లాల నుంచి వచ్చిన అభిప్రాయాల నుంచి మంత్రి వర్గ ఉపసంఘం సమగ్ర వివరాలతో పూర్తి నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించనున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోపే ఈ నివేదిక సమర్పించి శాసనసభ వేదికగా రైతు భరోసాపై సర్కారు విధివిధానాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ ప్రక్రియలో మంత్రులు కూడా భాగస్వాములు కావాలి : భట్టి - Deputy CM Bhatti on Annual Budget

అన్నదాతలకు గుడ్ న్యూస్ - జులై నుంచి రైతు భరోసా అమలు - RYTHU BHAROSA SCHEME FROM JULY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.