ETV Bharat / state

మాఘమాస వేళ పెళ్లిళ్ల జోరు - ధరాఘాతంతో బెంబేలు - పెళ్లిళ్ల సీజన్ పెరిగిన ధరలు

Wedding Season Price Hike : పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. మరోవైపు నిత్యావరసరాల ధరలు పెరుగుతున్నాయి. దీంతో పెళ్లి చేయాలనుకునే వారికి ఖర్చు తడిసి మోపెడవుతోంది.

Marriage Seasons In Telangana
Wedding Seasons Households Cost Raised
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2024, 1:09 PM IST

Wedding Season Price Hike : పెళ్లిళ్ల సీజన్ షురూ అయ్యింది. వధూవరులతో పాటు వారి తల్లిదండ్రులు సైతం వివాహాలు ఘనంగా చేయాలని ఆరాటపడుతున్నారు. వీరికి ధరల సెగ సమస్యగా మారుతోంది. అంచనాలకు మించి ఖర్చు చేయాల్సి వస్తోంది. ఫంక్షన్ ​హాళ్లు మొదలు, నిత్యావసర సరకులు సహా అన్ని ధరలూ పెరిగాయి. పేద, మధ్య తరగతి ప్రజలు పెళ్లి పనులు ప్రారంభించాలంటే హడలెత్తిపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్​లో 10 గ్రాముల బంగారం ధర (22 క్యారెట్లు) రూ.58 వేలకు అటు ఇటుగా ఉంది. కిలో వెండి ధర రూ.77 వేలు పలుకుతోంది. వీటికి మేకింగ్ ఛార్జీలు అదనంగా తీసుకుంటారు. వస్త్రాలపై కూడా జీఎస్టీ విధిస్తుండటంతో వాటి ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం పెళ్లికి వధూవరుల దుస్తుల కోసమే రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు.

ఆరు నెలల్లో 42 లక్షల పెళ్లిళ్లు - రూ.5.5లక్షల కోట్ల వ్యాపారం - భారత్​లో అట్లుంటది మరి!

Marriage Seasons In Telangana : భాగ్యనగరంలో కల్యాణ మండపాలకు రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. వాటిల్లో సదుపాయాలు, స్థలం ఇలా అన్ని ఉంటే రేటు పెరుగుతూనే ఉంటుంది. మండపాల యజమానులు తమ వద్దే భోజనాలు, పూల అలంకరణ, లైటింగ్‌ తదితరాలు తీసుకోవాలని షరతులు కూడా పెడుతున్నారు. ఒకప్పుడు కేవలం ఫంక్షన్ హాలు మాత్రమే రెంట్​కు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఇలాంటి షరతులు పెట్టడం వల్ల వారికి ఇబ్బందిగా మారింది. ఒక ప్లేటు శాకాహారం భోజనం ధర రూ.500 నుంచి రూ.2000 వరకు ఉంటుంది. ఎంచుకునే ఆహార పదార్థాలను బట్టి ధరలు ఫిక్స్ చేస్తారు. ప్లేటు మాంసాహారం ధర రూ.1000 నుంచి రూ.2,500 వరకు ఉన్నాయి. కేవలం మండపాలు, భోజనాలకే పెళ్లి ఖర్చుల్లో సుమారు 50 శాతం వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

TSRTC Special Offer: శుభకార్యాల కోసం అద్దెకు తీసుకునే బస్సులపై 10% డిస్కౌంట్

విందు ఏర్పాటుకు అవసరమయ్యే నిత్యావసర సరకుల ధరలు గతేడాదితో పోలిస్తే ఈసారి 30 శాతం పెరిగాయి. కిలో కూరగాయల ధరలు సగటున రూ.40 నుంచి రూ.60 మధ్య ఉంటున్నాయి. కిలో వెల్లుల్లి రూ.400 పలుకుతుంది. ఇదివరకు ఎన్నడూ లేనిరీతిలో 25 కిలోల బియ్యం బస్తాపై రూ.500 వరకు పెరిగింది. కిలో చికెన్‌ ధర రూ.230. కిలో మటన్‌ను రూ.850 వరకు అమ్ముతున్నారు. 19 కిలోల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2,000కు పెరిగింది. పూల ధరలు సైతం పెరిగాయి. ఇలా ప్రతీదీ ధరలు పెరుగుతుండటంతో పేద, మధ్య కుటుంబాలపై పెళ్లి భారం మరింత పెరుగుతోంది.

ఈ మూడు నెలలు జాగ్రత్త.. లేదంటే అంతే!

పెళ్లిళ్ల సీజన్​కు పుత్తడి ధరల సెగ ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.