ETV Bharat / state

రైతు ఇంట్లో వీఆర్​ఏ చోరీ - సర్కార్ ఉద్యోగిని దొంగను చేసిన ఆన్​లైన్ గేమ్స్ - VRA STOLE 2 LAKHS FROM FARMER

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 30, 2024, 1:41 PM IST

VRA Theft For Online Games in Sangareddy : ఆన్​లైన్​ గేమ్​లకు బానిసైన ఓ ప్రభుత్వ ఉద్యోగి రైతు ఇంట్లో చొరబడి రూ.2.10 లక్షలను చోరీ చేసిన ఘటన కలకలం రేపింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.

Theft For Online Games
Theft For Online Games (ETV Bharat)

Theft For Online Games : ఆన్​లైన్​ గేమ్​లకు బానిసైన ఓ వ్యక్తి చివరకు దొంగగా మారాడు. ఓ వైపు వీఆర్​ఏగా విధులు నిర్వర్తిస్తూనే అధిక డబ్బులు సంపాదించాలనే ఆశతో ఆన్​లైన్​ గేమ్​లకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే ఎవరూ లేని సమయం చూసి ఓ రైతు ఇంటి తాళం పగులగొట్టి రూ.2.10 లక్షల నగదుతో పాటు రెండున్నర తులాల బంగారాన్ని తస్కరించాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : రేగోడు మండల పరిధిలోని ముక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే త్వరగా అధిక డబ్బులు సంపాదించాలన్న ఆశతో ఆన్​లైన్​ బెట్టింగ్​ గేమ్​లకు అలవాటు పడ్డాడు. కుటుంబ సభ్యులు వద్దని వారించినా వినిపించుకోలేదు.

కుటుంబ సభ్యులకు తెలియకుండా కొంతమేర అప్పు చేశాడు. అప్పు తీర్చడానికి చోరీ చేయడాన్ని మార్గంగా ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 22న తన సొంత గ్రామంలో ఎన్.సంగప్ప అనే రైతు ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి తాళం పగలగొట్టి 2 లక్షల పదివేల రూపాయల నగదు, రెండున్నర తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

బాధితుడు సంగప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో జ్ఞానేశ్వర్ చోరీకి పాల్పడినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి మెదక్ కోర్టుకు రిమాండ్​కు తరలించినట్లు వివరించారు. చోరీకి గురైన నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని కోర్టుకు సమర్పించినట్లు వివరించారు.

"బాధిత రైతు తన అవసరం కోసం డబ్బును ఇతరుల వద్ద అప్పు తెచ్చి, బీరువాలో ఉంచి వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి బీరువాలో డబ్బు, బంగారం చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టాం. అదే గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్​ అనే వ్యక్తి ఈ చోరీకి పాల్పడ్డట్లుగా గుర్తించాం. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించాం"- రేణుక, సర్కిల్​ ఇన్​స్పెక్టర్​

ఆన్​లైన్​ గేమ్స్​కు బానిస అవుతున్న ప్రజలు - ఆడేందుకు అడ్డదారులు

ఆన్​లైన్ గేమ్స్ కోసం ఇంట్లో నగలు చోరీ - దొంగలు ఎత్తుకెళ్లారని కట్టుకథ - చివరి ట్విస్ట్ మాత్రం అదుర్స్! - Online Games Crime

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.