ETV Bharat / state

అదనపు టీఎంసీ పనులకు ఏ అధికారంతో సిఫార్సు చేశారు - 'మేడిగడ్డ'పై మాజీ ఈఎన్సీకి విజిలెన్స్‌ ప్రశ్నల వర్షం - Kaleshwaram Project Inquiry Updates

Vigilance Inquiry Speed up on Kaleshwaram Project : కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ కుంగడంపై విజిలెన్స్‌ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మేడిగడ్డపై మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లుపై విజిలెన్స్‌ ప్రశ్నల వర్షం కురిపించింది. అదనపు టీఎంసీ పనులకు ఎలా, ఏ అధికారంతో సిఫార్సు చేశారని ప్రశ్నించగా, రికార్డులు చూసి వివరాలు చెబుతానని సమాధానం ఇచ్చారు. అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు తర్వాత సమాధానం చెబుతానని తెలిపినట్లు సమాచారం. ఈ నెల 8న మరోసారి విచారణకు రావాలని మాజీ ఈఎన్‌సీ వెంకటేశ్వర్లుకి విజిలెన్స్‌ అధికారులు చెప్పారు.

Vigilance Reports on Medigadda
Vigilance Inquiry Speed up on Kaleshwaram Project
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 2, 2024, 7:17 AM IST

Updated : Apr 2, 2024, 8:45 AM IST

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విజిలెన్స్‌ ముమ్మర దర్యాప్తు - ఈ నెల 8న మరోసారి విచారణకు రావాలని మాజీ ఈఎన్‌సీకి పిలుపు!

Vigilance Inquiry Speed up on Kaleshwaram Project : కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక - డీపీఆర్‌ అంచనాలో అదనపు టీఎంసీకి ఆస్కారం లేకపోయినా, సివిల్‌ పనులకు అంచనాలు తయారు చేసినట్లు ప్రాజెక్టు మాజీ ఇంజినీర్‌ ఇన్‌చీఫ్‌ వెంకటేశ్వర్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు వెల్లడించారు. ఏ అధికారంతో ఆ విధంగా సిఫార్సు చేశారని ప్రశ్నించగా, ప్రస్తుతం సమాధానం ఇవ్వలేనని, రికార్డులు పరిశీలించి తర్వాత చెప్తానని పేర్కొన్నట్లు తెలిసింది.

సవరించిన అంచనాను ప్రభుత్వానికి పంపి, డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ ప్రారంభమైందని గుత్తేదారుకు బ్యాంకు గ్యారంటీలు వెనక్కి ఇవ్వాలంటూ ఎలా సిఫార్సుచేశారని ప్రశ్నించగా, ఎస్‌ఈ నివేదిక ఆధారంగా ఉన్నతస్థాయి కమిటీకి(High level committee) పంపానని చెప్పినట్లు తెలిసింది. పలు నిర్ణయాలకు కిందిస్థాయి ఇంజినీర్ల నివేదికలే ఆధారమని పేర్కొన్నారని అనేక అంశాలకు తర్వాత సమాధానం ఇస్తానని చెప్పినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

Vigilance investigation on Medigadda Project : కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, నిర్మాణంలో భాగస్వాములైన ఇంజినీర్లను విచారిస్తోంది. కీలకంగా వ్యవహరించిన మాజీ ఈఎన్‌సీ వెంకటేశ్వర్లును ప్రశ్నించగా మిగిలిన ఇంజినీర్లను త్వరలోనే విచారించనుంది. వెంకటేశ్వర్లుకు 30కి పైగా ప్రశ్నలు సంధించింది. ఒప్పందంమేరకు మేడిగడ్డ ప్రారంభంతో పని పూర్తైనట్లు భావిస్తున్నారా అని విజిలెన్స్‌ అధికారులు ప్రశ్నించగా, లేదని ఈఎన్‌సీ సమాధానమిచ్చారు.

డ్రాయింగ్​లో ఒకలా, కట్టింది మరోలా - 'మేడిగడ్డ' అంతా లోపాలమయం

ప్రాణహిత-చేవెళ్ల పునరాకృతి ద్వారా కాళేశ్వరం ఎత్తిపోతల చేపట్టడానికి సంబంధించిన సమాచారాన్ని అధికారులు అడిగినట్లు తెలిసింది. ఈ నెల 8న మరోసారి విచారణకు రావాలని పిలిచినట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి పరిశీలించి తనిఖీనోట్స్‌ ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించగా, తనిఖీ చేసినట్లు చెప్పారు.

అందుకు సంబంధించిన వివరాలను తర్వాత ఇస్తానని తెలిపారు. పనిలో సౌలభ్యం కోసం సీకెంట్‌ పైల్స్‌ అనుమతించాలని గుత్తేదారు కోరగా సీడీఓ చీఫ్‌ ఇంజినీర్‌కు పంపే ముందు ఫీల్డ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏమైనా చేశారా అని అధికారులు ప్రశ్నించగా, ఆర్ధికభారంపై విశ్లేషించినట్లు వెంకటేశ్వర్లు చెప్పారు. ఐతే అందుకు సంబంధించిన వివరాలను మాత్రం తర్వాత సమర్పిస్తానని తెలిపారు.

Vigilance Officers Inspect to Irrigation ENC : అప్పటి సీఎం ప్రాజెక్టును పరిశీలించినపుడు ఆదేశించారని బ్యారేజీ ఎగువన, దిగువన సీసీ బ్లాకుల సైజులో మార్పు చేశారని. కొత్త సైజు సీసీ బ్లాకులకు సిఫార్సు చేసే ముందు దీన్ని బలపరిచేలా మోడల్‌ స్టడీస్‌ టెక్నికల్ స్టడీస్‌ చేశారా అని అధికారులు అడగ్గా అందుకోసం ఎలాంటి మోడల్‌ స్టడీస్‌ చేయలేదని వివరించారు. ఆమోదించిన డ్రాయింగులకు అనేక సార్లు సవరణలు సిఫార్సు చేశారు.

ఈ సిఫార్సులు చేసే ముందు కొన్నింటికి ఆర్థికంగా అధ్యయనం, కొన్నింటికి మోడల్‌ స్టడీస్‌ అవసరం. కానీ అలాంటివి లేకుండా సిఫార్సు చేయడం వల్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం(Project Construction Cost) పెరగడానికి కారణమైంది కదా అని ప్రశ్నించగా ఆమోదించిన ప్రతి డ్రాయింగు సవరణకు మోడల్‌ స్టడీస్‌ చేయాల్సిన అవసరం లేదని వెంకటేశ్వర్వలు తెలిపారు. 2020 ఫిబ్రవరి 20న మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని రూ.3,260 కోట్ల నుంచి రూ.4,613 కోట్లకు పెంచి సవరించిన అంచనాను ప్రభుత్వానికి పంపారు.

దాటవేత ధోరణి సరికాదు - ఇంజినీర్లపై ఎన్డీఎస్‌ఏ బృందం సీరియస్ - ndsa Committee on barrage designs

Vigilance Reports on Medigadda Project : ప్రభుత్వం సవరించిన అంచనాకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర ప్రత్యుత్తరాల్లో డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ 2020 ఫిబ్రవరి 29న ప్రారంభమైందన్నారు. సవరించిన అంచనాకు సిఫార్సు చేసి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ ప్రారంభమైందని ఎలా చెప్పారని విజిలెన్స్‌ అధికారులు ఈఎన్‌సీని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ రాసిన లేఖలో 2020 ఫిబ్రవరి 29 నుంచి డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ ప్రారంభమైందన్నారు. దాన్నే తాను రాష్ట్ర స్థాయి స్టాండింగ్‌ కమిటీకి పంపినట్లు చెప్పారు.

2019 సెప్టెంబరు 9న చాలావరకు పని పూర్తైనట్లు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పేర్కొన్న దానిపై ఎస్‌ఈ కౌంటర్‌ సంతకం చేసిన సర్టిఫికెట్‌పై అవగాహన లేదని వెంకటేశ్వర్లు చెప్పారు. 2021 మార్చి 15న పని పూర్తయిందని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పేర్కొన్న దానిపై ఎస్‌ఈ కౌంటర్‌ సంతకం చేసిన సర్టిఫికెట్‌ గురించి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ తమ కార్యాలయానికి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాకు కుంగిన తర్వాతనే ఆ సమాచారం తెలిసిందని వెంకటేశ్వర్లు తెలిపారు.

ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ జారీ చేసింది పని పూర్తయినట్లుగా ఇచ్చిన సర్టిఫికేట్‌ కాదు. అనుభవానికి సంబంధించినది మాత్రమేనని అధికారుల ముందు పేర్కొన్నారు. పని పూర్తి కాకుండానే బ్యాంక్‌ గ్యారంటీ విడుదల చేయాలని ఎలా సిఫార్సు చేశారని అడగ్గా సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ సిఫార్సు మేరకే స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ ముందు ప్రతిపాదనలు పెట్టినట్లు వెంకటేశ్వర్లు చెప్పారు.

మేడిగడ్డపై మరింత లోతుగా విజిలెన్స్ విచారణ - మెజర్​మెంట్​ బుక్​ నిర్వాకంపై ప్రత్యేక దృష్టి

కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంపై ఎన్‌డీఎస్‌ఏ అధ్యయనం - సీకెంట్‌ పైల్‌ పద్ధతికే మొగ్గు ఎందుకు? - NDSA Committee On Kaleshwaram

Last Updated : Apr 2, 2024, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.