ETV Bharat / state

2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్​ - అదే మోదీ ప్రభుత్వ లక్ష్యం : కిషన్​రెడ్డి - KISHAN REDDY ON MODI GOVT

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2024, 2:13 PM IST

Updated : Sep 17, 2024, 2:46 PM IST

Kishan Reddy On Modi Govt : ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గత పదేళ్ల కాలంలో దేశాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం ఎంతో చేసిందని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ పాలనలో జాతీయ రహదారులు, పోర్టులు, విమానాశ్రయాలు అభివృద్ధి చేశామని వెల్లడించారు. పది వందే భారత్​ రైళ్లలో తెలంగాణకు ఒకటి కేటాయించామన్నారు.

Kishan Reddy On Modi Govt
Kishan Reddy On Modi Govt (ETV Bharat)

Kishan Reddy On Modi Govt : 2047లో భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు పనిచేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ పాలనలో అందరికీ కూడు, గూడు, గుడ్డ కల్పించేందుకు ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక వందరోజుల పాలన పూర్తి చేసుకున్నారని వివరించారు. అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే ఆ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం ఏ పథకానికి ఎంత ఖర్చు చేసిందనే వివరాలను ఆయన వెల్లడించారు.

బీజేపీ పాలనలో మౌలిక వసుతుల అభివృద్ధి : బీజేపీ పాలనలో జాతీయ రహదారులు, పోర్టులు, విమానాశ్రయాల అభివృద్ధి చేశామని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయం, మౌలిక సదుపాయాల కొసం రూ.15లక్షల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. 20వేల కోట్లను వంద రోజుల్లో కిసాన్ సమ్మాన్ నిధి కోసం విడుదల చేశామని తెలిపారు. పంటల కనీస మద్దతు ధర పెంచామన్నారు. మత్స్య శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు.

సెల్​ఫోన్ల ఉత్పత్తిలో భారత్​ రెండో స్థానంలో నిలిచినట్లుగా కిషన్​రెడ్డి వివరించారు. 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సీటీలను ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జహీరాబాద్​లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సీటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రూ.10 లక్షల ముద్రా రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచినట్లుగా వివరించారు. రూ.3లక్షల కోట్ల ప్రాజెక్టులకు మౌలిక సదుపాయాలో రూపకల్పన చేయడం జరిగిందన్నారు.

75వేల మెడికల్​ సీట్లు పెంచబోతున్నాం : తెలంగాణలోనూ ఒక కొత్త రైల్వే లైన్​ను ప్రారంభించామన్న కిషన్​రెడ్డి ఎలక్ట్రిక్ అంబులెన్స్​లను ప్రోత్సహిస్తున్నట్లుగా తెలిపారు. వంద రోజుల్లో పది వందే భారత్ రైళ్లను ప్రారంభించామన్నారు. వాటిలో తెలంగాణకు ఒకటి కేటాయించడం జరిగిందన్నారు. ఆ రైలు నాగాపూర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడుస్తుందన్నారు. కోట్లాది వృద్దులకు ఆయుష్మాన్ భారత్ సదుపాయం కల్పించామని తెలిపారు. ఆరు కోట్ల మంది వృద్ధులు లబ్ధి పొందుతున్నారని వివరించారు. తెలంగాణ నుంచి పది, పన్నెండు లక్షల మంది వృద్దులు లబ్ధి పొందుతున్నారు. మెడికల్ రీసెర్చ్​ను ప్రోత్సహించేందుకు 50వేల కోట్లను కేటాయించడం జరిగిందన్నారు. 75వేల మెడికల్ సీట్లను పెంచబోతున్నామని వెల్లడించారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రతిభను ప్రోత్సహించేందుకు విజ్ఞాన ధార పేరుతో 10వేల 6వందల కోట్లు కేయాయించినట్లు తెలిపారు. నాలుగు కోట్ల మంది యువతకు స్కిల్స్ పైన శిక్షణ ఇవ్వబోతున్నాం.

తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహించకుండా దిగజారుడు రాజకీయాలు : కిషన్ రెడ్డి - Telangana Liberation Day 2024

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు ఇస్తే ఇళ్ల మంజూరుకు కేంద్రం సిద్ధం : కిషన్‌రెడ్డి - KishanReddy Letter To CM Revanth

Last Updated : Sep 17, 2024, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.