Two Youths Killed Friend in Drunkenness in Ghatkesar : మద్యం మత్తులో తోటి సహోద్యోగిని బలవంతంగా ఈతకొలనులో నెట్టగా మృతి చెందిన ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మదాపూర్‌లో ఓ ఐటీ సంస్థలో శ్రీకాంత్ టీం లీడర్‌గా పని చేస్తున్నారు. సోమవారం అతని పుట్టిరోజు. దీంతో అతను తన టీమ్ మెంబర్స్‌కు పార్టీ ఇవ్వాలి అనుకున్నాడు.
అనుకున్నట్టుగానే ఘట్కేసర్ మండలంల ఘనపూర్‌లోని ఓ గెస్ట్ హైస్ బుక్ చేసి అందులో పార్టీ ఏర్పాట్లు చేశాడు. ప్లాన్ ప్రకారం అతడి టీమ్ మేట్స్‌ను పార్టీకి ఆహ్వానించాడు. ఆదివారం సాయంత్రం 7గంటల ప్రాంతంలో 13మంది మహిళా ఉద్యోగులతో పాటు మొత్తం 20మంది వచ్చారు. అక్కడ మద్యం సేవించారు. రాత్రి 12గంటల తర్వాత కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు. అనంతరం ఆడుతూ పాడుతూ బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
ఈత రాదని వేడుకున్నా వినకుండా : ఈ క్రమంలో అజయ్ తేజ అనే వ్యక్తిని అతని స్నేహితులు రంజిత్ రెడ్డి, సాయికుమార్ ఈత కొలనులోకి నెట్టేందుకు ప్రయత్నించారు. అందుకు అజయ్ తేజ తనకు ఈత రాదని వేడుకున్నాడు. అయినా వాళ్లిద్దరు వినలేదు. మద్యం మత్తులో అజయ్తేజ ఎంత ప్రాధేయపడ్డా వినిపించుకోలేదు. అతని మాటలు లెక్కచేయకుండా స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈతరాని అజయ్ తేజ మృతి చెందాడు. 45 నిమిషాల తర్వాత వారందరు పూల్ వద్దకు రాగా అపస్మారక స్థితిలో ఉన్న అజయ్చూసి కంగారు పడి వెంటనే జీడిమెట్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా మృతి : అతన్ని పరీక్షించిన డాక్టర్లు మృతి చెందాడని ధ్రువీకరించారు. సోమవారం తెలల్లవారుజాము 3గంటల సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలికి చేరురుని మృతిదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి మేనమామ కిశోర్‌కుమార్ ఫిర్యాదు మేరకు స్నేహితులు రంజిత్ రెడ్డి, సాయికుమార్, శ్రీకాంత్, గెస్ట్‌హౌస్ నిర్వాహకుడు వెంకటేశ్‌లపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
స్నేహితుడితో గొడవ.. కిడ్నాప్ చేసి మర్డర్.. శరీరాన్ని కాల్చి బూడిదను నదిలో..