ETV Bharat / state

గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం - హైదరాబాద్, జగిత్యాలలో అంతర్రాష్ట్ర ముఠాల అరెస్టు - GANJA SMUGGLING GANGS BUSTED IN TG - GANJA SMUGGLING GANGS BUSTED IN TG

Ganja Gang Arrested in Hyderabad : అంతరాష్ట్ర గంజాయి ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి ఎన్నో కేసులు వెలుగు చూస్తున్నాయి. కాస్త అనుమానం వస్తే చాలు రంగంలోకి దిగి ఒక్కొక్క విషయాన్ని వెలికితీస్తున్నారు. దీని కోసం పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి స్మగ్లింగ్ జరిగే ప్రదేశాల్లోకి ప్రవేశించి మరీ అన్వేషిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌- రాజేంద్రనగర్‌ ఓఆర్ఆర్ వద్ద గంజాయిని తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు.

SMUGGLING GANG ARREST
SMUGGLING GANG ARREST in rajendranagar (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2024, 12:43 PM IST

Ganja Gang Arrested in Hyderabad : హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ ఓఆర్ఆర్ వద్ద మంగళవారం రోజున గంజాయి తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 89 లక్షల 90 వేల విలువ గల 254 కిలోల గంజాయితో పాటు 2 కార్లు, 7 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని అరకులో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ మీదుగా యూపీకి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు సచిన్‌సింగ్‌ తో పాటు నదీమ్‌, సక్లైన్‌, సలీం, ప్రశాంత్‌ వీరంతా యూపీ, ముంబయికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటను గురించి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ "5 ఏళ్లుగా ఏపీ టు యూపీకి ఈ మత్తు దందా సాగుతున్నట్లు తేలింది. ముందు ఒక పైలెట్ వాహనం పెట్టి దారి సాఫీగా ఉందనుకుంటేనే వెనుక నుంచి గాంజా ఉన్న కారు ముందుకు వెళ్తుంది. ప్రధాన నిందితుడు సచిన్ సింగ్ వద్ద ఒక పిస్టల్ తో పాటు బుల్లెట్లు ఉన్నాయి. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నాం. నిందితుల్ని అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఎలాంటి కాల్పులు జరగలేదు." అని తెలిపారు.

Ganja Gang Arrested in Jagtial : మరోవైపు గంజాయి తరలిస్తున్న మరో ముఠాను జగిత్యాల పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా సరిహద్దు నుంచి గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు పూడురు వద్ద మంగళవారం రోజున ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 12 కిలోల గంజాయి, సెల్‌ఫోన్లు, రెండు భైకులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

ఈ ఘటనపై జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ , " భారీ స్థాయిలో గంజాయి తరలిస్తున్న ఐదుగురితో కూడిన ముఠాను పట్టుకుని అరెస్టు చేశాం. ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం రాగానే కొడిమ్యాల పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే పూడూరు వద్ద పాగా వేసి గంజాయి ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి 12 కేజీల గంజాయి, సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లను సీజ్ చేశాం. నిందితులు పూడూరు గ్రామానికి చెందిన సాయికుమార్‌, సాయి తేజ, అరుణ్‌తోపాటు సమీప గ్రామానికి చెందిన సాకేత్, రాజు కుమార్‌గా గుర్తించాం." అని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.