ETV Bharat / state

వైరల్ వీడియో : పండుగ పూట వీటికి ఏమొచ్చింది భయ్యా - రోడ్డుపై ఇంతలా బీభత్సం సృష్టించాయి

గోవుల కొట్లాటతో చేలరేగిన అలజడి - భయపడి పరుగులు తీసిన స్థానికులు - 20 నిమిషాల పాటు రెండు గోవుల భీభత్సం

METPALLY IN JAGTIAL DISTRCT
TWO COWS CLASH ON ROAD (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

Two Cows Clash on The Road : సాధారణంగా మనం పండుగ రోజు అందరి ఇళ్లలో బంధువులతో నిండిపోయి ఆనందంగా ఉండటం చూస్తుంటాం. అలాగే బంధుమిత్రులతో ఏదైనా విషయంలో వాదోపవాదాలు జరగడం సహజమే. అది కాకుండా మరి కాస్త ఎక్కువై వివాదం చెలరేగితే కొట్టుకోవడమూ జరుగుతుంటుంది. కానీ దీనికి పూర్తిగా భిన్నంగా, రెండు మూగ జీవాలు కొట్లాటకు దిగాయి. వాటికి ఎందుకు కోపమోచ్చిందో, ఎక్కడ గొడవొచ్చిందో తెలియదు కానీ రోడ్డుపై కాసేపు బీభత్సం సృష్టించాయి. దీపావళీ పండుగ చేసుకుంటున్న ప్రజలు, ఒక్కసారిగా గోవుల కొట్లాట చూసి భయాందోళనలకు గురయ్యారు.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో రెండు గోవులు బీభత్సం సృష్టించాయి. పట్టణంలోని కూరగాయల మార్కెట్లో ప్రజలందరూ దీపావళి పండుగ సందడిలో ఉండగా, రెండు గోవులు కొట్లాటతో అలజడి సృష్టించాయి. గోవుల దాడిలో దారి గుండా వెళ్లే ద్విచక్ర వాహనదారులకు గాయాలయ్యాయి. మూడు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. గోవులు కొట్లాడుతున్న సమయంలో అక్కడ ఏం జరుగుతుందో తెలియక అక్కడి వారందరూ పరుగులు పెట్టారు. సుమారు 20 నిమిషాల పాటు రెండు గోవుల కొట్లాట బీభత్సం సృష్టించింది.

20 నిమిషాల పాటు : రెండు గోవుల కొట్లాట రచ్చరచ్చగా మారింది. పట్టణంలోని కూరగాయల మార్కెట్లో ప్రజలందరూ దీపావళి పండుగ సందడిలో ఉండగా, రెండు గోవులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు గానీ ఒకదానిపైకి మరొకటి ఎగబడుతూ కొట్లాటకు దిగాయి. గోవుల కొట్లాటతో కొంత సమయం పాటు అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ క్రమంలోనే దారి గుండా వెళ్లే ఓ ద్విచక్ర వాహనంపై గోవు ఒక్కసారిగా దూసుకు రావడంతో వాహనదారుడు రోడ్డుపై కింద పడిపోయాడు. తలకు దెబ్బతగిలి రక్తస్రావంతో రోడ్డుపై పడి నిస్సహాయ స్థితిలోకి వెళ్లాడు.

తీవ్ర గాయాలతో లేవలేని పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తిని అక్కడి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ గోవుల గొడవలో మూడు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గోవులు కొట్లాడుతున్న సమయంలో అక్కడ ఏం జరుగుతుందో తెలియక అక్కడి వారందరూ భయాందోళనలతో పరుగులు పెట్టారు. సుమారు 20 నిమిషాల పాటు రెండు గోవులు తీవ్రమైన కొట్లాటతో విజృంభించాయి.

'నేను 1 లక్ష గోవులు సమకూరుస్తా - తిరుమలలో సొంత డెయిరీ ఏర్పాటు చేయండి' - RAMACHANDRA YADAV LETTER TO CM

గోవులతో తొక్కించుకున్న భక్తులు- 'అబద్ధాలు చెప్పేవారిపై అలా'​!

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.