Turmeric Price Hike in Nizamabad Today 2024 : ఇందూరు పసుపు రైతులకు మార్కెట్ కమిటీ శుభవార్త చెప్పింది. క్వింటా పసుపు పంటకు దాదాపు 14వేల పైచీలకు పైగా ధర నిశ్చయించింది. ఫలితంగా కొన్నేళ్లుగా అరకొర ధరలతో కుదేలైన అన్నదాత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏటా పసుపు విస్తీర్ణం తగ్గిస్తూ సాగుకు దూరమవుతున్న తరుణంలో ప్రస్తుత ధరలు పసుపు రైతులకు మళ్లీ జీవం పోస్తున్నాయి. నిజామాబాద్ మార్కెట్లో నిన్న 14 వేల 2 వందల గరిష్ఠ ధర పలికింది. 2011 తర్వాత ఇంత ధర పలకడం ఇదే తొలిసారి అని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
గతానికి భిన్నంగా ఈ సీజన్‌లో పసుపు ధర రోజురోజుకూ ఎగబాకుతోంది. 2011లో క్వింటా పసుపు ఆల్‌టైమ్ రికార్డు(All Time Record) ధర రూ.16,166 పలికింది. ఆ తర్వాత నుంచి ప్రతి ఏటా రూ.6-7 వేల మధ్యనే పసుపు ధరలు పలికాయి. ఈ సీజన్‌లో మాత్రం క్రమంగా ధరలు పుంజుకున్నాయి. గత ఏడాది పదివేల వరకు ధరలు రాగా, ఈ సీజన్‌లో మాత్రం అధిక ధరలు వస్తున్నాయి. క్రమంగా రూ.15 వేలకు దగ్గరగా వచ్చింది.
Record Level Price For Turmeric in Nizamabad 2024 : కేంద్రం పసుపు దిగుమతులను నియంత్రించడంతో క్రమంగా డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఈ సీజన్‌లో ఆ ఫలితాలు కనిపిస్తున్నాయి. 15 వేల ధర ఉంటే గిట్టుబాటు అవుతుందని మొదట్నుంచీ రైతులు చెబుతూ వచ్చారు. గతంలో ఏటా 6 వేలు, 7 వేల మధ్యనే ధరలు పలికేవని. ఈ సీజన్‌లో క్రమంగా ధరలు పుంజుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లలో ఈ ధర రావడం ఇదే తొలిసారని మళ్లీ పసుపు పంటకు జిల్లాలో పూర్వవైభవం వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పసుపు ధరలను ఇలాగే కొనసాగిస్తే జిల్లాలో రానున్నరోజుల్లో పసుపు పంట విస్తీర్ణం మరింత పెరిగే అవకాశముంది.
'మొత్తం 17 పసుపు బ్యాగులు మార్కెట్‌కు తీసుకువచ్చాను. గత సంవత్సరం రూ. 5, 6 వేలు ఉంది. ఈసారి రెండెకరాలు పంట పండించా. ఈ రెండు ఎకరాలకు ధర 10 నుంచి 12 వేల రూపాయలు అంటున్నారు. గిట్టుబాటు ధర ఉంటే దిగుబడి కూడా పెంచుతాం. రెండు మూడు సంవత్సరాల నుంచి ధర తక్కువ ఉండటంతో పంట తగ్గిస్తూ వచ్చాం. ప్రస్తుతం పసుపు ధరలు మంచిగా ఉన్నాయి. దీని వల్ల చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు 20 గుంటల పంట పండించా. తర్వాత ఎకరం పంట వేస్తా. నిన్న పసుపు ధర 10 వేల నుంచి 14 వేల దాకా పలికింది. రైతులందరం చాలా సంతోషంగా ఉన్నాం.'- రైతులు
చదువు కెరీర్‌గా, ఆటలు హాబీగా ఎంచుకుని - అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతోన్న స్ఫూర్తి
యువ ఔత్సాహికుల వినూత్న ఆవిష్కరణలు- అకట్టుకున్న వన్ డిస్ట్రిక్ట్ - వన్ ఎగ్జిబిషన్