ETV Bharat / state

ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్​ - సోషల్​ మీడియాలో వైసీపీ 11 సీట్ల స్టోరీ!! - TROLLS ON YCP DEFEAT IN AP ELECTIONS 2024

Trolls on YS Jagan AP Politics 2024 : ఏపీలో ఘోర పరాజయం తర్వాత వైఎస్సార్సీపీ నేతలు తట్టాబుట్టా సర్దుకుని కొంతమంది విదేశాలు, చాలా మంది కారాగారానికి వెళ్లడానికి సిద్ధం కావాలంటూ పోస్టులు పెట్టారు మీమర్లు. ‘ఇన్ని రోజులూ కామెడీ చేస్తూ మమ్మల్ని సంతోషపరిచిన ‘కోడిగుడ్డు మంత్రి’, ‘ట్విన్‌ సిటీస్‌ ఎంపీ’, ‘సంబురాల రాంబాబు’ లాంటి నేతలకు కృతజ్ఞతలు ఇక సెలవు’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు సామాజిక మాధ్యమాల్లో మీమర్లు.

AP Politics Trolls on YS Jagan
AP Politics Trolls on YS Jagan (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 5, 2024, 1:02 PM IST

Updated : Jun 5, 2024, 1:26 PM IST

YS Jagan God Script AP Politics Trolls : ఏపీ రాజకీయం రసవత్తంగా సాగింది. 'దేవుడి స్క్రిప్ట్' 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయగర్వంతో అసెంబ్లీ వేదికగా జగన్ ప్రాచుర్యంలోకి తెచ్చిన పదం ఇది. తెలుగుదేశం పార్టీకి వచ్చిన 23సీట్లపై ఎగతాళి చేస్తూ చాంతాడంత స్క్రిప్టే ఆనాడు చదివి వినిపించారు. 2024లో వైఎస్సార్సీపీకి వచ్చిన సీట్లపై మరో దేవుడి స్క్రిప్ట్ అంటూ నెటిజన్లు విసురుతున్న సెటైర్లు సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్​పై ర్యాగింగ్ మాములుగా లేదు.

అధికార అహంతో నాడు విర్రవీగిన ఫలితానికి మరో దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇదంటూ ఓ ఆట అడ్డుకుంటున్నారు సోషల్​మీడియా సోదరులు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి తిరుగులేని విజయకేతనం ఎగురవేశాక సామాజిక మాధ్యమాల్లో వైఎస్సార్సీపీపై ట్రోల్స్‌ బాగా పెరిగాయి. ప్రచారంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఇచ్చిన ‘హలో ఏపీ బై బై వైసీపీ’ నినాదం ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఫలితాల తరువాత కూడా దాన్ని విపరీతంగా గుర్తు చేసుకున్నారు. ఈ నినాదం ఎన్నికల్లో కూటమి గెలవడానికి దోహదపడిందని చర్చించుకుంటున్నారు.

మేము ఎన్డీఏ కూటమితోనే ఉన్నాం - చంద్రబాబు క్లారిటీ - CHANDRABABU PRESS MEET TODAY

వైస్సార్సీపీ నాయకులు విర్రవీగుతూ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల్ని, ప్రస్తుత ఫలితాలను పోల్చుతూ ఓ రేంజిలో నెటిజన్లు ఆడుకున్నారు. ఎన్డీయే గెలిచిన అంకెలను చూపిస్తూ వాటి కింద పలు సభల్లో జగన్‌ ప్రదర్శించిన విచిత్రమైన హావభావాలతో వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు. సోమవారం వరకు ‘అధికారం మాదే వైనాట్‌ 175’ అంటూ అతిశయోక్తులకు పోయిన జగన్‌ బృందం ఇప్పుడు ముఖం చెల్లక ట్రోలర్ల దెబ్బకు మూగబోయింది. వారి సామాజిక మాధ్యమాల ఖాతాలను బ్లాక్‌ చేసుకున్నారు. వైఎస్సార్సీపీ ఘోర పరాజయాన్ని సూచిస్తూ పలువురు యువకులు ఆ పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌ను ద్విచక్రవాహనాలకు కట్టి ఊరంతా ఈడ్చుకెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

వైఎస్సార్సీపీ అసెంబ్లీ, పార్లమెంట్​ సీట్లపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్​​ ఇలా ఉన్నాయి.

  • కూటమికి వచ్చింది 164. 1+6+4 =11 వైఎస్సార్సీపీకి వచ్చిన సీట్లు
  • 2019లో వైఎస్సార్సీపీకి వచ్చింది 151 అసెంబ్లీ సీట్లు 2024 లో మధ్యలో 5ఎగిరిపోయి 11 అసెంబ్లీ సీట్లు మిగిలాయి
  • 2024లో వైఎస్సార్సీపీకి అసెంబ్లీ పార్లమెంట్ కలిపి వచ్చిన సీట్ల సంఖ్య 15. 151లో ఇక్కడ చివరి 1ఎగిరి పోయింది ఇప్పుడు .
  • 2019లో వైఎస్సార్సీపీకి వచ్చిన పార్లమెంట్ స్ధానాలు 22. 2+2=4 వైఎస్సార్సీపీ 2024లో వచ్చిన పార్లమెంట్ స్థానాలు
  • 2019లో నలుగురు తెలుగుదేశం ఎమ్మెల్యేలను వైఎస్సార్సీపీ తీసుకుంటే 4వ తేదీన ప్రజలు అంత మంది ఎంపీలను మాత్రమే మిగిల్చారు. ఇక్కడ పోలింగ్ జరిగిన 13వ తేదీ కూడా చూస్తే 1+3= కూడా నాలుగే అంటూ గుర్తు చేస్తున్నారు మీమర్లు.

టీడీపీ 135 - జనసేన 21 - బీజేపీ - 8 - ఏపీలో 164 సీట్లతో కూటమి సునామీ - AP Election Results 2024

Last Updated : Jun 5, 2024, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.