ETV Bharat / state

'రావాలి జగన్ కావాలి జగన్ - చంచల్‌గూడ జైల్లో ఖైదీల చిందులు' - ఈ ట్రోల్స్​ వేరే లెవెల్​ భయ్యా!! - TROLLS ON JAGAN IN SOCIAL MEDIA

Trolls on Jagan : సామాజిక మాధ్యమాల వేదికగా వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ మోహన్​ రెడ్డిపై మరోసారి ట్రోలర్లు రెచ్చిపోయారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి, ప్రచారంలో ఆయన శైలి, పాలనా తీరు, గత ఎన్నికల గెలుపు సమయంలో ఆయన వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ మీమ్స్‌ను ఇరగదీశారు.

Trolls on Jagan Reddy in AP
Trolls on Jagan Reddy in AP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 6, 2024, 10:32 AM IST

Updated : Jun 6, 2024, 10:40 AM IST

Trolls on Jagan Reddy in AP : సామాజిక మాధ్యమాల వేదికగా ఏపీలోని వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ మోహన్​ రెడ్డిపై మరోసారి ట్రోలర్లు రెచ్చిపోయారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి, ప్రచారంలో ఆయన శైలి, పాలనా తీరు, గత ఎన్నికల గెలుపు సమయంలో ఆయన వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ మీమ్స్‌ను ఇరగదీశారు. వీడియోలను పోస్ట్‌ చేస్తూ ఓ ఆట ఆడుకున్నారు. మంగళవారం ఫలితాలు వెలువడినప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో పోస్టులతో ఒక్కసారిగా దండెత్తారు. నిన్నమొన్నటి వరకు పోస్టులు పెట్టాలంటే జంకే పరిస్థితిని నుంచి బయటపడి వారి సృజనాత్మకతకు స్వేచ్ఛగా పని పెట్టారు.

దేవుడి స్క్రిప్ట్‌ అంటే ఇదే

కూటమి సాధించిన సీట్లు : 164; వైఎస్సార్సీపీ సాధించిన సీట్లు : 11

అంటే 1+6+4 కలిపితే : 11;

ఇదే కదా దేవుని లీల అంటే

5 ఎగిరి పోయిందే

151 సీట్లలో అటు ఒకటో ఇటు ఒకటో ఎగిరిపోతుందనుకుంటే

మధ్యలో 5 ఎగిరిపోయిందే

ఒక్క ఛాన్స్‌ అని అడిగితే ఒక్క ఛాన్సే ఇచ్చారు

అన్న ఒక్క ఛాన్స్‌ అంటే ఒక్క ఛాన్స్‌ మాత్రమే ఇచ్చారు.

ఏపీ జనాలు నిజంగా నిజాయతీ పరులే

ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్​ - సోషల్​ మీడియాలో వైసీపీ 11 సీట్ల స్టోరీ!! - TROLLS ON YCP DEFEAT IN AP ELECTIONS 2024

అన్నకు బంపర్‌ ఆఫర్‌

అన్నయ్యకు పేటీఎం బ్యాచ్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు.

కూలీ రూ.5 ఇవ్వనందుకు 151లో 5 కట్‌ చేసి 11 చేతికిచ్చారు

జనమే పీకేశారు

'ప్రతిపక్షాలు నా వెంట్రుక కూడా పీకలేరు' అన్నారు

జనం మాత్రం మొత్తం పీకేశారు

గ్రాఫిక్స్‌ ఇక్కడ కుదరనట్టుందే!

సిద్ధం సభకు జనాలు రాకపోయినా గ్రాఫిక్స్‌లో చూపించొచ్చు

కానీ ఓట్లు అదే గ్రాఫిక్స్‌లో వేయించలేరుగా!

సర్లే పడుకో ఇక పడుకో

మీరు ఆంధ్రాను రాజధాని లేని రాష్ట్రంగా చేస్తే

ప్రజలు ప్రతిపక్షమే లేని రాష్ట్రంగా చేశారే

సర్లే పడుకో ఏం ఉందిలే ఇక పడుకో

నేను విన్నాను. నేను చూశాను.

సీఎం పదవికి రాజీనామా

ఇది నేను విన్నాను. నేను చూశాను

ఈ జన్మకు ఇది చాలు అన్నయ్య

ఎన్డీయే కూటమిలో కింగ్​ మేకర్స్​గా చంద్రబాబు, నీతీశ్- రాజకీయంగా ఏపీకి ఎంతో మేలు! - LOKSABHA ELECTION RESULT 2024

మీరు బులుగు రంగు వేస్తే ప్రజలు పసుపు రంగు వేశారు

ఎవరో కట్టిన పంచాయతీ కార్యాలయాలకు, ప్రభుత్వ దవాఖానాలకు బులుగు రంగు పూస్తే...

ప్రజలు ఆంధ్రప్రదేశ్‌ మొత్తానికి పసుపు రంగు వేశారు.

ఎరుపు రంగు బొట్టు పెట్టారు. కమలాలు విరబూయించారు.

జగనూ నీకు కనపడుతోందా? అట్టుంటది మనతోటి.

అప్పుడు దండం - ఇప్పుడు పిండం

అన్న దండం పెడితే తమ్ముడు వైఎస్సార్సీపీకి పిండం పెట్టాడు

దేవుడికేం తెలుస్తుంది జగనన్న

సజ్జల కొడాలి, పేర్ని, జోగి, అనిల్, రోజక్కలను అడుగు తెలుస్తుంది ఎందుకు ఓడిపోయామో!

అమ్మకు, అమ్మికి ఎరుక

ఎందుకు ఓడిపోయామో తెలిసేది దేవుడికాదు మామయ్య

అమ్మకు, అమ్మికి ఎరుక

సజ్జలకు, మంత్రులకు ఎరుక

గాయమైన రాష్ట్రానికి పసుపు రాసిన ప్రజలు

వైజాగ్‌లో రూముల్ని ఖాళీ చేయాలా వద్దా మామా

జరిగిందేదో జరిగిపోయింది.

వైజాగ్‌లో మనోళ్లు బుక్‌ చేసుకున్న రూముల్ని ఖాళీ చేయాలా వద్దా చెప్పు మామా

ఉన్న 11 మందితోనైనా ప్రమాణ స్వీకారం చేద్దాం

9వ తేదీ వరకు వెయిట్‌ చేయమంటావా?

ఇక శుక్రవారమంటే దడపుట్టడమే

నాడు నాకు అసెంబ్లీ ఉంది కోర్టుకు రాలేను

నేడు నాకు కోర్టు ఉంది అసెంబ్లీకి రాలేను

ఈ సారి గెలిస్తే 5 రాజధానుల్ని చేయాల్సిందే

మూడు అచ్చి రాలేదు మామ

ఇప్పుడు మనకు సీట్లు ఇచ్చింది 5 జిల్లాల్లోనే

కాబట్టి 2029లో గెలిస్తే ఈ సారి 5 రాజధానుల్ని చేయాల్సిందే

అన్న వస్తున్నాడంటున్న చంచల్‌గూడ ఖైదీలు.

అన్న వస్తున్నాడు. అన్న వస్తున్నాడు.

ఎక్కడికి అనుకుంటున్నారా? మీ ఇంటికి కాదు. చంచల్‌ గూడ జైలుకి

దీన్నే ట్రోలర్లు అస్త్రంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో ఆటాడుకుంటున్నారు

'రావాలి జగన్‌ కావాలి జగన్‌' అంటూ చంచల్‌ గూడ ఖైదీలు జైల్లో చిందులేస్తూ పాడుకుంటున్న వీడియోను పోస్టు చేస్తున్నారు

బాహుబలిలో మాదిరిగా 'మనతో ఉండటానికి వస్తున్నాడురా పండగ చేసుకోవాలి రా' అంటూ చిందులేస్తున్నారు.

ముద్రగడకు కూడా ఇలానే నామకరణం చేస్తారేమో!

పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌ గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు ముద్రగడ

ఇప్పుడు అదే శపథాన్ని గుర్తుచేస్తున్నారు ట్రోలర్లు.

దీనికి ఎన్నికల ప్రచారంలో జగన్‌ ఓ పాపను ఎత్తుకుని ముద్దు చేస్తు నామకరణం చేసే వీడియోను ఉపయోగించుకుంటున్నారు

ఆ వీడియోని పోస్టు చేస్తూ ముద్రగడకు కూడా ఇలాగే నామకరణం చేస్తారేమో అని ఎద్దేవా చేస్తున్నారు.

  • ఆడుదాం ఆంధ్రకు ఎన్నికైన 11 మంది వైఎస్సార్సీపీ ఆటగాళ్లకు ధన్యవాదాలు
  • 10, 11 తరగతులు చదివేటోళ్లతో దొంగ ఓట్లు వేయించాం సార్‌. కూటమి వాళ్ల ఓట్లు కూడా తీయించాం. అలా ఎలా ఓడిపోతాం సార్‌.
  • ఐటీశాఖ మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్‌్ ఓడిపోవడంతో నువ్వేం టెన్షన్‌ పడకు మావ ఇద్దరం కలిసి కోళ్ల ఫామ్‌ పెడదామని ఎద్దేవా చేస్తున్నారు.
  • జల్సా సినిమాలో పవన్‌కల్యాణ్, ప్రకాశ్‌రాజ్‌ మధ్య సంభాషణను తీసుకుని మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండని సరదాగా అన్నానురా మేం సీరియస్‌గా తీసుకున్నాం అని ప్రజలు అన్నట్లు మార్చారు.

ఐపీఎల్‌కు నయా టీం వచ్చేసింది

ఆడుదాం ఆంధ్ర. ఆడుదాం ఆంధ్ర అంటుంటే ఏంటో అనుకున్నా

ముందే 11 మందిని సిద్ధం చేసుకున్నారన్నమాట!

వచ్చే ఐపీఎల్‌కి నయా ఆంధ్ర టీం రెడీ అయినట్టే

ఇన్నాళ్లూ విన్నాం ఇప్పుడు చూస్తున్నాం

తోబుట్టువుల కన్నీళ్లు ఇంటికి అరిష్ఠమంటారు పెద్దలు

ఇన్నాళ్లూ ఈ మాటను విన్నాం

ఇప్పుడు చూస్తున్నాం

నీకు అర్థమయ్యిందా అన్నయ్యా!

ఇదిగో ఇప్పుడు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది

స్త్రీలను నిండు సభలో అగౌరవపరిస్తే రాజ్యాలే కూలాయని చదువుకున్నాం విన్నాం

ఇప్పుడు కళ్లారా చూశాం

నీకు అర్థమయ్యిందా అన్నయ్యా

కడపలో ఐదు స్థానాల్లో టీడీపీ ఆధిక్యం - గతంలో కంటే జగన్‌కు తగ్గిన మెజారిటీ - Kadapa Election Results 2024

Last Updated : Jun 6, 2024, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.