ETV Bharat / state

మచిలీపట్నంలో ముక్కోణపు ప్రేమ కథ - సిగలు పట్టుకుని సెగలు పుట్టించిన ప్రియురాళ్లు - Triangle Love Story in Krishna

Triangle Love Story at Machilipatnam : ఓ వ్యక్తి నిర్వాకం స్థానిక ప్రజలను బెంబేలెత్తించింది. ప్రియుడి నిర్వాకంతో ఇద్దరు ప్రియురాళ్లు జనాల మధ్య సిగపట్లు పట్టారు. ఈ క్రమంలో కారుకు మంటలు పెట్టారు. అది కాస్త, జనరేటర్​కు ఎక్కడ అంటుకుంటుందోనని స్థానిక ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. ఈ సిగపట్ల కథేంటో తెలుసుకోవాలంటే కృష్ణాజిల్లా మచిలీపట్నానికి వెళ్లాల్సిందే.

Triangle Love Story at Machilipatnam in Krishna District
Triangle Love Story at Machilipatnam in Krishna District (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2024, 7:32 PM IST

Updated : Sep 19, 2024, 7:53 PM IST

Triangle Love Story at Machilipatnam in Krishna District : ఓ ప్రియుడు, ఇరువురు ప్రియురాళ్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ కృష్ణాజిల్లాలో కలకలం రేపింది. మచిలీపట్నం చిలకలపూడికి చెందిన ఓ యువతిని ఆ నగరానికే చెందిన బిల్డర్ విజయ్ పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించారు. వారు ఇరువురు కొన్నేళ్లుగా సన్నిహితంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె వద్ద నుంచి సుమారు రూ.15 లక్షల విలువ చేసే నగలు, నగదు తీసుకున్నారు. అనంతరం అతను సంవత్సరం నుంచి ఆమెకు కనిపించకుండా మొఖం చాటేశాడు. ఈ విషయంపై ఆమె ఆరా తీయగా ఇటీవలే కారుణ్య నియామకం ద్వారా కలెక్టరేట్​లో ఉద్యోగం పొందిన మరో మహిళతో విజయ్​ పరిచయం పెంచుకున్నాడాని మొదటి ప్రియారాలికి తెలిసింది.

'అదంతా నిజమని నమ్మా - ప్రేమించి మోసపోయా' - 6 పేజీల లేఖ రాసి యువతి ఆత్మహత్య - young woman committed suicide

ఇద్దరు ప్రియురాళ్ల మధ్య ఘర్షణ : విజయ్ వేరే అమ్మాయితో ఉంటున్నట్లు బాధితురాలు నిర్ధారించుకుంది. కలెక్టరేట్ సమీపంలో ఉన్న అపార్ట్​మెంట్​లో ఉద్యోగం చేస్తున్న ఆ మహిళకు తను ఇచ్చిన డబ్బుతోనే ఆ ఇంటిని కొనిచ్చాడని బాధితురాలు భావించింది. ఈ క్రమంలో బాధితురాలు అక్కడకు వెళ్లి ఆ మహిళను నిలదీసింది. ఇరువురు మహిళల మధ్య మాటామాటా పెరిగి గొడవపడుతున్న సమయంలో విజయ్ అక్కడకు వచ్చాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు ఆగ్రహంతో అపార్ట్​మెంట్​ సెల్లార్​లో ఉన్న విజయ్ కారుపై తను తెచ్చిన పెట్రోల్​ని పోసి నిప్పంటించింది. దీంతో సెల్లార్​లో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. సెల్లార్​లో పార్కు చేసి ఉన్న కార్లకు, జనరేటర్​కు నిప్పు వ్యాపిస్తుందోమోనని స్థానికులు భయపడ్డారు.

మచిలీపట్నంలో ముక్కోణపు ప్రేమ కథ - సిగలు పట్టుకుని సెగలు పుట్టించిన ప్రియురాళ్లు (ETV Bharat)

ఈ క్రమంలోనే మండుతున్న కారును బయటకు తోసేశారు. ఈ ఘటనకు సంబంధించి తనపై దాడికి రావడమే కాకుండా కారు తగలబెట్టే ప్రయత్నం చేసిందంటూ ఈ యువతిపై విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మోసం చేశారని, ప్రశ్నించినందుకు దాడి చేశారని, విజయ్, అతని ప్రియురాలి నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధిత యువతి సైతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనకు సంబంధించి పరస్పరం చేసుకున్న ఫిర్యాదులపై కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో ఇరువర్గాల వైపు నుంచి కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసుల తెలిపారు.

వరంగల్‌ జిల్లాలో చెరువులో దూకి ప్రేమజంట ఆత్మహత్య

తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య - తట్టుకోలేక ప్రియుడి బలవన్మరణం

Last Updated : Sep 19, 2024, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.