ETV Bharat / state

కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారని ప్రచారం - పీసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు - TPCC CHIEF REACT ON KONDA SUREKHA

కేబినెట్ నుంచి కొండా సురేఖను తప్పించడం లేదన్న పీసీసీ చీఫ్ - త్వరలో బీఆర్​ఎస్ నుంచి మరిన్ని చేరకలని ప్రకటన

TPCC Chief React On Konda Surekha Issue
TPCC Chief React On Konda Surekha Issue (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2024, 7:11 PM IST

TPCC Chief React On Konda Surekha Issue : మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారని ప్రత్యర్ధులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని ఆరోజే ఆ ఇష్యూ ముగిసిందన్నారు. ఈ విషయంపై హైకమాండ్ కూడా ఎటువంటి వివరణ అడగలేదని వివరించారు. గాంధీ భవన్​లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ పలు అంశాలను ప్రస్తావించారు.

మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతారా? : సురేఖ, సీతక్కలు బలమైన మహిళా నాయకులు అయినందువల్లే సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారని పీసీసీ చీఫ్ ఆరోపించారు. సోషల్ మీడియాను బీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు. విపక్షంలో ఉన్నప్పుడు తాము తమ పార్టీ గొంతు మాత్రమే వినిపించామని వివరించారు. కానీ బీఆర్​ఎస్ మాత్రం ఫోటోలు మార్ఫింగ్ చేసి కొండా సురేఖపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలా పోస్ట్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు.

నెలలోపు పీసీసీ కార్యవర్గం : బీసీల విషయంలో పార్టీ సానుకూలంగానే ఉందన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీల పక్షాన మాట్లాడారని,・అప్పుడే పార్టీ లైన్ తప్పారని అనడానికి లేదన్నారు. ఎంఐఎంతో స్నేహం వేరు, శాంతిభద్రతల అంశం వేరని స్పష్టం చేశారు. ఫిరోజ్ ఖాన్ వ్యవహారంలో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎంని కోరినట్లు తెలిపారు. తప్పు మా వాళ్లు చేసినా, వేరే వాళ్లు చేసినా చట్టప్రకారమే చర్యలు ఉంటాయని వివరించారు. దసరా లోపు నామినేటెడ్ పోస్టులు ప్రకటిద్దామని అనుకున్నామని, అయితే హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల వల్ల సాధ్యం కాలేదన్నారు. నెల లోపు పీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నట్లు వెల్లడించారు.

బీజేపీ, బీఆర్​ఎస్​ రెండు ఒకటేనని చెప్పడానికి లిక్కర్ కేసులో కవితకు బెయిల్ రావడమేనని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అదే కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాకు బెయిల్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీఆర్​ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉండడంతోనే ఇరువురు కలిసి తమ పార్టీని ఎదుర్కోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారని ఆరోపించారు.

త్వరలో మరిన్ని చేరికలు : కాంగ్రెస్​పై ప్రేమతోనే పలువురు బీఆర్ఎస్ నేతలు తమ పార్టీలోకి వస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు తెలిపారు. త్వరలో మరికొన్ని చేరికలు ఉంటాయని ప్రకటించారు. కొన్నిచోట్ల కొంత ఇబ్బంది ఎదురవుతోందని అందుకే ఇప్పటివరకు చేరికలకు బ్రేక్ వేశామన్నారు. భావితరాల భవిష్యత్ కోసమే హైడ్రా, మూసీ అభివృద్ధి అని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. మూసీ అభివృద్ధికి లక్షా యాభై వేల కోట్లు ఖర్చవుతాయని తామెక్కడా చెప్పలేదన్నారు.

మంత్రి సురేఖ అంశానికి సినీ ప్రముఖులు ఇక్కడితో ముగింపు పలకాలి : మహేశ్ కుమార్ గౌడ్ - TPCC Cheif Request Cine Industry

సోషల్​ మీడియాతో ప్రతిపక్షాల వ్యతిరేక ప్రచారాలను తిప్పికొట్టాలి : మహేశ్​కుమార్ గౌడ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.