ETV Bharat / state

CAT​ పరీక్షకు మిగిలింది 3 వారాలే - ఈ స్టడీ ప్లాన్ ​అనుసరిస్తే మంచి స్కోరు పక్కా! - 3 WEEKS STUDY PLAN FOR CAT EXAM

దేశవ్యాప్తంగా 170 నగరాల్లో నవంబర్‌ 24న క్యాట్‌ పరీక్ష - అభ్యర్థులు మంచి స్కోరు సాధించేందుకు తుది సన్నద్ధత చాలా కీలకం - ఈ మూడు వారాల స్టడీ ప్లాన్​ మీకోసమే!

Three Weeks Study Plan For CAT Exam Preparation
Three Weeks Study Plan For CAT Examination (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2024, 7:30 AM IST

3 Weeks Study Plan For CAT Examination : క్యాట్‌ (కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌)- 2024 దేశవ్యాప్తంగా 170 సిటీల్లో నవంబర్‌ 24న జరగబోతోంది. కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే 21 ఐఐఎంలలో దాదాపు 5000 ఎంబీఏ సీట్ల కోసం, ఐఐటీలూ.. టాప్‌ బిజినెస్‌ స్కూల్స్‌లో ఎంబీఏ ఎంట్రెన్స్​ కోసం గ్రాడ్యుయేట్లకు క్యాట్‌ అర్హత తప్పనిసరి. ఎగ్జామ్ టైం దగ్గరపడుతుండటంతో తుది సన్నద్ధత చాలా కీలకం. ఈ కొద్దిరోజుల్లో వ్యూహాత్మకమైన కార్యాచరణను అనుసరిస్తే మంచి స్కోరు పొందవచ్చు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం!

వెర్బల్‌ ఎబిలిటీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ సెక్షన్లో విజయం కోసం రోజూ కనీసం ఒక సెక్షన్‌ మోడల్ టెస్ట్​ రాయాలి. వారానికి కనీసం 20 రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లు ప్రాక్టీస్ చెయ్యాలి. పరీక్ష తేదీలోపు 60 ప్యాసేజ్‌లు, వాటి సమగ్ర విశ్లేషణ చెయ్యాలి. క్యాట్‌లో ఈ సెక్షన్లో ఉన్న మొత్తం 4 ప్యాసేజీలను సమయ నిర్వహణ (టైం మేనేజ్​మెంట్) దృష్ట్యా చెయ్యడం కష్టమే. అందువల్ల ఎవరికి వారు తమకు అనువైన 3 ప్యాసేజీలను ఎంచుకొని, వాటిని ప్రోపర్​గా చెయ్యడమే మంచిది.

డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌లో మంచి స్కోరు సాధించాలంటే, ఫస్ట్​ క్వాంట్‌ (అరిథ్‌మెటిక్‌ + మ్యాథ్స్‌) సబ్జెక్టుపై పట్టు బిగించాలి. రోజూ కాల్‌క్యులేషన్స్, కంపారిజన్స్, లాజికల్‌ డిడక్షన్స్‌ ప్రాక్టీస్ చెయ్యాలి. రోజులో కొన్ని లాజికల్‌ రీజనింగ్‌ ప్రశ్నలు, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ సెట్స్‌ గత ఏడాది ప్రశ్నల సరళితో సాధన చేయడం అవసరం. మొదట్లో ఒక్కో సెట్‌కు ఎక్కువ టైం పడుతుంది. ప్రాథమిక దశలో దీని గురించి ఆలోచించకుండా కచ్చితత్వంపై గురి పెట్టి, తర్వాత దశలో స్పీడ్​ గురించి ఆలోచించాలి.

క్వాంటిటేటివ్‌ ఎబిలిటీలో అధిక భాగం ప్రశ్నలు అరిథ్‌మెటిక్, ఆల్జీబ్రాల నుంచే వస్తున్నాయి. మొదటగా ఈ రెండు చాప్టర్లను కంప్లీట్​ చెయ్యాలి. ఫార్ములాలను (సూత్రాలు) బట్టీ కొట్టకుండా లాజికల్ నాలెడ్జి ఉపయోగించి ప్రశ్నలకు జవాబులు కనుగొనేలా సాధన చెయ్యాలి.

మొదటి వారం : బేసిక్స్‌ రివిజన్‌

ఈ వారం క్వాంటిటేటివ్‌ ఎబిలిటీలో అరిథ్‌మెటిక్, ఆల్జీబ్రా, నంబర్‌ సిస్టమ్‌ వంటి చాఫ్టర్లలోని బేసిక్స్, ఫార్ములాలు, భావనలు కంప్లీట్ చెయ్యాలి. అలాగే డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌లో కూడా బేసిక్స్‌ రివిజన్‌ను సాధ్యమైనంత త్వరగా ముగించాలి. రోజూ 30- 40 క్యాట్‌ నమూనా ప్రశ్నలు ప్రాక్టీస్ చేసి, పొరపాట్లు ఎక్కడ చేస్తున్నామో గమనించాలి. కచ్చితత్వాన్ని ముందుగా పెంచుకోవాలి. మూడు రకాలైన ప్రశ్నల్లో (సులభం- మధ్యరకం- కష్టతరమైనవి) రోజూ సాధన చెయ్యాలి. వారాంతంలో పని తీరును రివ్యూ చేసుకోవాలి. ఈ వారంలో సవాలుగా మారిన ప్రశ్నలపై మరొక్కసారి ఫోకస్​ పెట్టాలి. మొదటి వారంలో వెర్బల్‌ ఎబిలిటీ- రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ని కూడా మరవకుండా రోజుకు ఒక సెక్షన్‌ మోడల్ టెస్ట్‌ రాయాల్సిందే.

రెండో వారం : మధ్యరకం నుంచి..

ఈ వారం మధ్యరకం నుంచి కష్టతరమైన ప్రశ్నలను ట్రై చేయాలి. క్యాట్‌ గత ఏడాది ప్రశ్నలను పట్టుపట్టాలి. మూడు సబ్జెక్టుల్లో ఆన్‌లైన్‌ సెక్షన్‌ టెస్టులు రాసి, అనాలసిస్ చేసుకోవాలి. ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్పీడ్ పెంచడానికి తమకు తగ్గట్టు వ్యూహాలను ఆలోచించాలి. షార్ట్‌ కట్స్‌తో ప్రాబ్లమ్స్‌ను సాధ్యమైనంతవరకు పరిష్కరించాలి.

మూడో వారం: అడ్వాన్స్‌డ్‌ స్థాయి

అడ్వాన్స్‌డ్‌/ కష్టతరమైన ప్రశ్నలపై ఫోకస్ పెట్టాలి. రోజూ 20 క్యాట్‌ ఆధారిత కష్టతర ప్రశ్నలను మూడు సెక్షన్లలో ప్రాక్టీస్ చెయ్యాలి. పూర్తి నిడివి మాక్‌ టెస్టులు (ఆన్‌లైన్‌) రాసి, అభ్యర్థి పని తీరు మెరుగుపరచుకోవాలి. ఎక్కడ వీక్​గా ఉన్నామో తెలుసుకొని, దాన్ని అధిగమించాలి. అన్నీ కష్టతరమైన ప్రశ్నలే కాకుండా మిడిల్​ టైప్​ ప్రశ్నలు కూడా చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.

ఒకసారి అన్ని సబ్జెక్టుల్లోని ముఖ్య భావనలు, ఫార్ములాలు, మెథడ్స్‌ అన్నీ క్విక్‌ ఫాస్ట్​ రివిజన్‌ చెయ్యాలి. ఈ టైంకు చాలా మాక్‌ టెస్టులు రాసి ఉంటారు. విద్యార్థులు తమ బలాలను దృష్టిలో పెట్టుకొని, స్థిరమైన పరీక్షకు అప్రోచ్‌కు రావాలి. దాన్నే మెయిన్‌ పరీక్షలో అనుసరించాలి. మరీ ముఖ్యంగా ఈ చివరి వారంలో కొత్త ప్రయోగాలు చెయ్యకూడదు.

పోస్ట్ ​గ్రాడ్యుయేషన్​తో పాటు బీఈడీ చదవొచ్చా? - కెరియర్​ నిపుణుల సలహా ఇదే!

పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే హార్డ్​ వర్క్​ కాదు బ్రో - ఇలా "స్మార్ట్ వర్క్" చేయాలి! - Exams Preparation Tips

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.