ETV Bharat / state

ఇంటి నుంచి వెళ్లిపోయిన కుమారుడు - మనోవేదనతో తండ్రి హఠాన్మరణం - Father Dies of Shock Son Leave Home

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 11, 2024, 4:29 PM IST

Updated : Jul 11, 2024, 5:22 PM IST

Dundigal Land Issue Father Died : భూ వివాదంతో కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తనయుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడన్న లేఖ చూసి ఒక్కసారిగా తండ్రి మనోవేదనతో మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్​లోని దుండిగల్​ మున్సిపల్​ పరిధి భౌరంపేట్​లో బుధవారం జరిగింది. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Dundigal Land Issue Father Died
Dundigal Land Issue Father Died (ETV Bharat)

Father Dies of Shock as Son Leaves Home at Dundigal : తనయుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడన్న మనో వేదనతో ఓ తండ్రి తనువు చాలించాడు. ఈ హృదయ విషారక ఘటన హైదరాబాద్​లోని దుండిగల్​ మున్సిపల్​ పరిధి భౌరంపేట్​లో బుధవారం జరిగింది. ఓ కుమారుడు తాను ఇళ్లు వదిలి వెళ్లిపోతున్నానని లేఖ రాసి మంగళవారం ఎటో వెళ్లిపోయాడు. ఆ మాటను విన్న తండ్రి బుధవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడు ఉదయం వరకు బాగానే ఉన్నాడని, కుమారుడిపై బెంగతోనే మరణించాడని గ్రామస్థులు చెబుతున్నారు.

వివరాల్లోకి వెళితే, భౌరంపేట గ్రామానికి చెందిన వంపుగూడెం మాధవ రెడ్డి అనే రైతుకు దొమ్మర పోచంపల్లిలోని సర్వే నంబరు 183, 188లో వంశపారంపర్యంగా వచ్చిన 1.13 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిని ఆనుకొని త్రిపుర ల్యాండ్​ మార్క్ నిర్మాణ సంస్థకు చెందిన స్థలం ఉంది. ఆ రైతు భూమిని విక్రయించాలని నిర్మాణ సంస్థ మాధవరెడ్డిని అడగ్గా అతను నిరాకరించాడు. దీంతో కక్ష కట్టి ఆ భూమిని దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పుడు కూడా జరుగుతున్నాయని ఆరోపణ వచ్చింది.

సీఐకు లేఖ రాసిన మాధవ్​రెడ్డి : ఈ భూ వ్యవహారంతో విసిగిపోయిన రైతు మాధవరెడ్డి దుండిగల్​ పోలీసు స్టేషన్​ సీఐకు మంగళవారం ఓ లేఖను రాసి, అప్పటి నుంచి కనిపించకుండా పోయారు. తన వ్యవసాయ భూమిని కొందరు అక్రమార్కులు దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తూ తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారన్నారు. దీంతో తన కుటుంబం జాగ్రత్త అంటూ, అమ్మ, నాన్న, పిల్లలు నన్ను క్షమించండి. ఇళ్లు వదిలి వెళ్లిపోతున్నానని ఆవేదనతో లేఖలో దుండిగల్​ సీఐకు చెప్పాడు. అనంతరం అక్కడి నుంచి కనిపించకుండా పోయాడు.

త్రిపుర ల్యాండ్​ మార్కు నిర్మాణ సంస్థ యజమాని పసుపులేటి సుధాకర్​, నిజాంపేట కార్పొరేటర్​ మేకల వెంకటేశం, మరికొందరు బీఆర్​ఎస్​ నాయకులు వారి పలుకుబడిని ఉపయోగించి తన భూమి లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని మాధవరెడ్డి ఆరోపించారు. ఈ చర్యలతో తాను విసిగిపోయానని, పోలీసులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని లేఖలో పేర్కొన్నాడు. ఇప్పటికైనా లేఖలో పేర్కొన్న సదరు బాధ్యులపై వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకొని తన భూమిని, కుటుంబాన్ని రక్షించాలని ఆయన కోరాడు.

పోలీసుల కేసు నమోదు : రైతు మాధవరెడ్డి రాసిన లేఖను ఇంట్లో గుర్తించిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, పరిసర ప్రాంతాలతో పాటు బంధువులు, తెలిసిన వారు, స్నేహితుల ఇళ్ల వద్ద వాకబు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు మాధవరెడ్డి రాసిన లేఖతో దుండిగల్​ పోలీసు స్టేషన్​కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దీంతో తనయుడు అదృశ్యమైన విషయాన్ని తట్టుకోలేని మాధవరెడ్డి తండ్రి కృష్ణారెడ్డి బుధవారం మనోవేదనతో కన్ను మూశాడు. కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడన్న మనోవేదనతోనే కృష్ణారెడ్డి మరణించారని గ్రామస్థులు వాపోయారు. భూ వివాదంలో ప్రభుత్వ అధికారుల వైఫల్యం, భూ బకాసురుల దౌర్జన్యమే ఇంతటి విషాదానికి దారి తీసిందని భౌరంపేట రైతులు మండిపడుతున్నారు. వెంటనే ఈ సమస్యపై పరిష్కారం చూపాలని డిమాండ్​ చేశారు.

నల్గొండ జిల్లాలో దారుణం - ఆకతాయిల వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య - Young Woman Suicide For Harassment

సింగపూర్​లో కోదాడ యువకుడు అనుమానాస్పద మృతి - హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు

Last Updated : Jul 11, 2024, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.