TET Result and DSC Exams Postponed in Andhra Pradesh : ఏపీ టెట్ ఫలితాల విడుదల, డీఎస్సీ పరీక్షల నిర్వహణపై కేంద్రం ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలతో(AP TET Result) పాటు డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించకపోగా పలు దఫాల అదిగో డీఎస్సీ ఇదిగో డీఎస్సీ అంటూ ఊరిస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఎన్నికల ముందు అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వకుండా ఒకేసారి టెట్, డీఎస్సీలకు నోటిఫికేషన్ ఇచ్చింది.
టెట్, డీఎస్సీ మధ్య తగినంత సమయం లేదని అభ్యర్థులు ఏపీ హైకోర్టును ఆశ్రయించగా రెండింటి మధ్య కనీసం నాలుగు వారాల గడువు ఉండాలని ధర్మాసనం ఆదేశించింది. ఈరోజు నుంచి వచ్చే నెల 30 వరకు డీఎస్సీ పరీక్షల(DSc Exam Postponed) నిర్వహణకు ఏపీ విద్యాశాఖ అధికారులు రీ షెడ్యూల్ చేశారు. ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో టెట్ ఫలితాల విడుదలకు, డీఎస్సీ నిర్వాహణకు ఈసీ అనుమతిని కోరుతూ అధికారులు ఈసీకి లేఖ రాశారు. కోడ్ ముగిసేవరకు టెట్ ఫలితాలతో పాటు డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఏపీలో జాబ్ క్యాలెండర్‌ను మడతెట్టేసిన 'జగన్ మామ' - నిరుద్యోగులకు చుక్కలే
AP High Court Comments on Volunteers : ఏపీలోని వాలంటీర్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఈసీ అన్ని నగదు పంపిణీ పథకాల నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలని స్పష్టం చేసింది. వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించవద్దని సీఈవోను ఈసీఐ ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
కోడ్ ముగిసేవరకు వాలంటీర్ల ట్యాబ్, మెుబైల్‌ను కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. నగదు పంపిణీ పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులను వాడుకోవాలని సూచించింది. నగదు పంపిణీలో వాలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని హైకోర్టులో సీఎఫ్‌డీ వేసిన పిటిషన్‌తో పాటు ఆ సంస్థ ఫిర్యాదును కూడా పరిగణనలోకి తీసుకున్నామని ఈసీ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఈసీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది.
వచ్చే ఎన్నికల్లో జగన్ ఏం చేసినా గెలవడు - ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు
టీఎస్ టెట్ నోటిఫికేషన్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల - జులై 17 నుంచి డీఎస్సీ ఎగ్జామ్స్