Telangana TET Exam 2024 : రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జరగనుంది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 20 వరకు టెట్‌కు దరఖాస్తులు స్వీకరించగా, పేపర్ 1కి 99,958 మంది, పేపర్ 2కి 1,86,428 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు పేపర్లు కలిపి టెట్ పరీక్షకు 2,86,386 మంది దరఖాస్తు చేసుకున్నట్టు టెట్ కన్వీనర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి టెట్ ఎక్జామ్ ప్రారంభం కానున్నట్టు ప్రకటించారు.
రేపటి నుంచి జూన్ 6వ తేదీ వరకు టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ పరీక్షలు కొనసాగనున్నాయి. రోజు 2 సెషన్ల చొప్పున ఉదయం 9 నుంచి 11.30 వరకు మధ్యాహ్నం 2 నుంచి 4.30 నిమిషాల వరకు టెట్ నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 80 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. ఇందులో అత్యధికంగా మేడ్చల్ 25, రంగారెడ్డిలో 17 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు టీఎస్ టెట్ కన్వీనర్ ప్రకటించారు. ఇప్పటికే ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రకటనలో పేర్కొన్నారు.
TS TET Exam Procedure : ఈ టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1, 150 మార్కులకు పేపర్-2 నిర్వహించనున్నారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలకు 30 మార్కుల చొప్పున కేటాయించారు. ఇక పేపర్-2లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు- 30 మార్కులు పొందిపరచగా, నాలుగో విభాగానికి 60 ప్రశ్నలకు 60 మార్కులు కేటాయించారు. ఎక్జామ్‌లో అర్హత మార్కులను 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు.
TS TET – 2024 Exam Schedule :
క్రమ సంఖ్య | పేపర్/సబ్జెక్ట్ | పరీక్ష తేదీ | సెషన్ |
01 | పేపర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ | 20-05-2024 | 1 |
02 | పేపర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ | 20-05-2024 | 2 |
03 | పేపర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ | 21-05-2024 | 1 |
04 | పేపర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ | 21-05-2024 | 2 |
05 | పేపర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ | 22-05-2024 | 1 |
06 | పేపర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ | 22-05-2024 | 2 |
07 | పేపర్-2 సోషల్ స్టడీస్(మైనర్ మీడియం) | 24-05-2024 | 1 |
08 | పేపర్-2 సోషల్ స్టడీస్ | 24-05-2024 | 2 |
09 | పేపర్-2 సోషల్ స్టడీస్ | 28-05-2024 | 1 |
10 | పేపర్-2 సోషల్ స్టడీస్ | 28-05-2024 | 2 |
11 | పేపర్-2 సోషల్ స్టడీస్ | 29-05-2024 | 1 |
12 | పేపర్-2 సోషల్ స్టడీస్ | 29-05-2024 | 2 |
13 | పేపర్-1 | 30-05-2024 | 1 |
14 | పేపర్-1 | 30-05-2024 | 2 |
15 | పేపర్-1 | 31-05-2024 | 1 |
16 | పేపర్-1 | 31-05-2024 | 2 |
17 | పేపర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (మైనర్ మీడియం) | 01-06-2024 | 1 |
18 | పేపర్-1(మైనర్ మీడియం) | 01-06-2024 | 2 |
19 | పేపర్-1 | 02-06-2024 | 1 |
20 | పేపర్-1 | 02-06-2024 | 2 |
దోస్త్ నోటిఫికేషన్ విడుదల - పూర్తి షెడ్యూల్ ఇదే - DOST notification 2024