ETV Bharat / state

తెలంగాణకు పన్నుల వాటా రూ.26,216 కోట్లు - పేదల ఇళ్ల నిర్మాణానికి బాసట - TELANGANA TAX SHARE IN UNION BUDGET

Telangana Tax Share in Union Budget 2024 : రాష్ట్రానికి కేంద్రం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరానికి పన్నుల వాటా కింద రూ.26,216 కోట్లు రానున్నాయి. గతేడాది కంటే ఈసారి పన్నుల వాటా రూ.3,000 కోట్లు అధికంగా వచ్చాయి. గతేడాది బడ్జెట్​లో రూ.23,216 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏ పథకాల్లో ఎంత మొత్తం వస్తుందో చూద్దాం.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 24, 2024, 7:37 AM IST

Telangana Share Tax in Union Budget 2024
Telangana Share Tax in Union Budget 2024 (ETV Bharat)

Union Budget 2024 Allocations for Telangana : కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పద్దుల లెక్కను మంగళవారం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్​లో తెలంగాణకు ఆశించిన మేరకు నిధులు కేటాయింపు జరగలేదు. ఈసారి మాత్రం తెలంగాణకు పన్నుల వాటా రూపంలో గతేడాది ప్రవేశపెట్టిన పద్దులో కంటే ఈసారి కాస్త ఊరట నిచ్చారనే చెప్పాలి. ఎందుకంటే ఈ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.26,216 కోట్లు అందనుండగా, అదే గతేడాది రూ.23,216 కోట్లు వచ్చాయి. అంటే అదనంగా రూ.3,000 కోట్లు రాష్ట్రానికి దక్కనున్నాయి. దీంతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2,273 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి రానున్నాయి. అయితే ఈ 15వ ఆర్థిక సంఘం నిధుల్లోనే గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.1,477 కోట్లు అందనుండగా, పట్టణ స్థానిక సంస్థలకు రూ.796 కోట్లు రానున్నాయి.

కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి రానున్న నిధులు :

స్మార్ట్​ సిటీ ప్రాజెక్టుకు నిధులు : బడ్జెట్​లో దేశంలోని మరో ఏడాదిపాటు స్మార్ట్​ సిటీల ప్రాజెక్టును కేంద్రం కొనసాగించేందుకు అంగీకరించింది. దీంతో పాటు అదనంగా రూ.2,236 కోట్లను పద్దులో కేటాయింపులు చేసింది. ఇది రాష్ట్రంలోని వరంగల్​, కరీంనగర్ లాంటి స్మార్ట్​ సిటీలకు లబ్ధిని చేకూర్చనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్మార్ట్​సిటీ ప్రాజెక్టును కొనసాగించాలని కోరింది. దీనికి అనుగుణంగానే బడ్జెట్​లో ఇందుకు సంబంధించిన నిధులు కేటాయింపుతో ఈ రెండు నగరాల్లో పెండింగ్​ పనులు పూర్తి కావడానికి దారులు తెరుచుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎంతో కొంత నిధులు రావచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

అమృత్‌ పథకానికి నిధుల పెంపు : పట్టణాల అభివృద్ధికి కేంద్రం అమృత్​ పథకాన్ని తీసుకువచ్చింది. దీనికి ప్రతి బడ్జెట్​లోనూ కేటాయింపులు చేస్తూ వచ్చారు. అయితే ఈసారి కూడా నిధుల కేటాయింపును కేంద్రం పెంచింది. గతేడాది రూ.4,222 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్​లో రూ.6,931 కోట్లు కేటాయింపులు చేశారు. ఈ పెంపు రాష్ట్రంలోని అమృత పట్టణాల్లో పెండింగ్​లో ఉన్న పనులు పూర్తికావడానికి ఎంతో దోహదపడుతుంది.

ప్రధానమంత్రి ఆవాస్​ యోజన నిధులు పెంపు : పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రధానమంత్రి ఆవాస్​ యోజన పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ బడ్జెట్​లో మాత్రం నిధుల కేటాయింపును పెంచింది. ఈ ఏడాది రూ.23,613 కోట్లను కేంద్రం కేటాయించింది. ఈ కేటాయింపులతో రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి ఎంతోగానే ఉపయోగం కానున్నాయి. రాష్ట్రానికి ఎంతో కొంత మేర నిధులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

'బడ్జెట్​లో విపక్ష రాష్ట్రాలపై వివక్ష' - పార్లమెంట్‌లో నిరసనకు ఇండియా కూటమి రె'ఢీ'

మారుమూల ప్రాంతాలకు రోడ్లు : ప్రధానమంత్రి గ్రామ్​సడక్​ యోజనకు ఈసారి బడ్జెట్​లో కేటాయింపులు దక్కాయి. రూ.18,894 కోట్లను గ్రామాల్లో రోడ్లు వేయడానికి కేంద్రం ఇవ్వనుంది. దీంతో రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో రోడ్ల వసతి మెరుగయ్యేందుకు ఇది ఎంతగానే ఉపయుక్తంగా ఉండనుంది.

రాష్ట్రంలో ఐటీఐ అప్​గ్రెడేషన్​కు అవకాశం : ఈసారి కేంద్రం బడ్జెట్​లో ఐటీఐల అప్​గ్రెడేషన్​కు రూ.645 కోట్లు కేటాయింపులు చేసింది. దీంతో రాష్ట్రంలోని ఐటీఐల అప్​గ్రేడెషన్​కు అవకాశం రానుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐల ఆధునీకరణకు నడుంబిగించింది.

థీమ్​ బేస్ట్​ టూరిస్ట్​ సర్క్యూట్​లకు నిధులు : ఈ కేంద్ర బడ్జెట్​లో రూ.1,715 కోట్లను థీమ్​ బేస్ట్​ టూరిస్ట్​ సర్క్యూట్​లకు కేటాయించారు. ఇది రాష్ట్రంలోని థీమ్​ బేస్ట్​ టూరిస్ట్​ సర్క్యూట్​ల ద్వారా పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తుంది.

ఏకలవ్య పాఠశాలలకు భారీగా నిధులు కేటాయింపు : ఈసారి కేంద్ర బడ్జెట్​లో ఏకలవ్య పాఠశాలలకు కేటాయింపులు భారీగానే చేశారు. గతేడాది రూ.1,815 కోట్లు కేటాయింపులు చేయగా ఈసారి రూ.4,660 కోట్లకు పెంచారు. అయితే రాష్ట్రంలో 23 ఏకలవ్య గురుకుల పాఠశాలలు ఉండగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. దీంతో శాశ్వత భవనాల నిర్మాణం వంటివి ముందుకు సాగనున్నాయి.

జాతీయ ఆరోగ్య మిషన్​ నిధులు యథాతథం : జాతీయ ఆరోగ్య మిషన్​కు కేటాయింపులు గతేడాదితో పోలిస్తే యథాతథంగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో దోమల ద్వారా వ్యాపించే వ్యాధులతో పాటు టీబీ, కుష్ఠు వ్యాధుల నివారణ కార్యక్రమాలకు రాష్ట్రానికి అండగా నిలిచేందుకు కేంద్రం కేటాయింపులు చేసింది. ఆ కేటాయింపులు రూ.38 కోట్ల నుంచి రూ.141 కోట్లకు పెంచారు.

ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌లో కన్నా అధికం : కేంద్ర పన్నుల్లో తెలంగాణకు ఈసారి రూ.26,216 కోట్ల వాటా రానుంది. ఇది ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్​ ఎకౌంట్​ బడ్జెట్​లో చూపిన లెక్కల కంటే రూ.577 కోట్లు అధికం. ఈ క్రమంలో ఆదాయపన్ను కింద రూ.9,066.56 కోట్లు, కార్పొరేట్​ పన్ను రూపంలో రూ.7,872.25 కోట్లు, సెంట్రల్​ జీఎస్టీ కింద రూ.7,832.19 కోట్లు, కస్టమ్స్​ కింద రూ.1,157.45 కోట్లు, ఎక్సైజ్​ డ్యూటీ కింద రూ.243.98 కోట్లు, సర్వీస్​ ట్యాక్స్​ కింద రూ.86 లక్షలు, ఇతర పన్నులు, సుంకాలు కింద రూ.43.09 కోట్ల వాటా రాష్ట్రానికి లభించనుంది.

ఇది వికసిత్​ భారత్​ బడ్జెట్​ కాదు - కుర్చీ బచావో బడ్జెట్ : సీఎం రేవంత్‌ రెడ్డి - CM Revanth On Central Budget Funds

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.