ETV Bharat / state

తెలంగాణలో 3 రోజుల పాటు వానలు - ఏ ఏ జిల్లాల్లో వర్షాలు ఉన్నాయో తెలుసా?

మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు - పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ - హైదరాబాద్​లో వర్షంతో పలుచోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు

Heavy Rain Warning
Telangana Rainfall Alert (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 14, 2024, 6:31 PM IST

Updated : Oct 14, 2024, 7:53 PM IST

Telangana Rainfall Alert Update : రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. చక్రవాతపు ఆవర్తనం ఒకటి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమైందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.

ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ : ఈ ప్రభావంతో ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మెదక్‌, నిజామాబాద్‌, మహబూబ్‌ నగర్‌, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్​తో పాటు ములుగు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు ఉమ్మడి నిజామాబాద్‌, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌ నగర్​తో పాటు నిర్మల్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

అల్పపీడన ఎఫెక్ట్​ భాగ్యనగరంలో వానలు : మరోవైపు ఏపీలో దక్షిణ కోస్తా జిల్లాలో భారవర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 4 రోజులు అక్కడ భారీ నుంచి కుండపోత వానలు కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం పడుతోంది.

కూకట్‌పల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, బాలానగర్‌, ఖైరతాబాద్‌, హైదర్‌నగర్‌, ఆల్విన్‌ కాలనీ, ప్రగతినగర్‌, పటాన్‌చెరు, మేడ్చల్, కృష్ణాపూర్, గండిమైసమ్మ, మల్లంపేట్, దుండిగల్‌, వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు, బహదూర్‌పల్లి, సూరారం, గుండ్ల పోచంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. దసరా సెలవుల అనంతరం నగరానికి చేరుకుంటున్న ప్రజలు ట్రాఫిక్​లో ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. మరోవైపు రానున్న మూడు రోజులు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం - భారీవర్షాలతో బిక్కుబిక్కుమంటున్న కోస్తా జిల్లాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

Last Updated : Oct 14, 2024, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.