ETV Bharat / state

రాధాకిషన్ ​రావు రిమాండ్​ పొడిగింపు - కేసు విచారణకు ప్రత్యేక పీపీని నియమించే యోచనలో ప్రభుత్వం - Telangana Phone Tapping Case - TELANGANA PHONE TAPPING CASE

Telangana Phone Tapping Case Update : ఫోన్​ ట్యాపింగ్​ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీసీపీ రాధాకిషన్​రావుకు ఈ నెల 12 వరకు రిమాండ్​ పొడిగిస్తున్నట్లు నాంపల్లి కోర్టు తెలిపింది. మరోవైపు ఈ కేసు వ్యవహారంలో ప్రత్యేక పీపీని నియమించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

Telangana Phone Tapping Case
Telangana Phone Tapping Case Update
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 10, 2024, 11:30 AM IST

Updated : Apr 10, 2024, 12:59 PM IST

Telangana Phone Tapping Case Update : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసు (Phone Tapping Case)లో కీలక నిందితుడైన మాజీ డీసీపీ రాధాకిషన్ ​రావు 7 రోజుల పోలీస్​ కస్టడీ నేటితో ముగిసింది. ఈ మేరకు ఆయనను కోర్టులో హాజరుపరచగా, ఈ నెల 12 వరకు రిమాండ్​ పొడిగిస్తూ నాంపల్లి కోర్టు తీర్పును ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన న్యాయస్థానంలో స్వయంగా వాదనలు వినిపించుకున్నారు.

జైలులోని లైబ్రరీకి వెళ్లేందుకు తనను అనుమతించడం లేదని న్యాయస్థానానికి మాజీ డీసీపీ రాధాకిషన్​ రావు తెలిపారు. అలాగే జైలు సూపరింటెండెంట్​ను కలవనీయడం లేదని ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన ఫిర్యాదుపై కోర్టు పోలీసులను పిలిచి ప్రశ్నించింది. రాధాకిషన్​రావుకు లైబ్రరీకి వెళ్లేందుకు, సూపరింటెండెంట్​ను కలిసేందుకు అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం పోలీసులు ఆయనను చంచల్​గూడ జైలుకు తరలించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు - ఆ నేతల ప్రమేయం ఉన్నట్లు సమాచారం!

ప్రత్యేక పీపీని నియమించే యోచన ప్రభుత్వం : ఇదిలా ఉండగా ఫోన్​ ట్యాపింగ్​ కేసు విచారణకు ప్రత్యేక పీపీ (Special PP Appoint)ని నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నెల రోజులుగా ఫోన్​ ట్యాపింగ్​ కేసును పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే రాధాకిషన్ ​రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ ​రావులను అరెస్ట్ చేశారు. ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఆధారాల సేకరణపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ విషయాలు అన్నీ పరిగణనలోకి తీసుకోవడంతో పాటు హై ప్రొఫైల్​ కేసు కావడంతో ప్రత్యేక పీపీని నియమించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత మందికి నోటీసులిచ్చే యోచన : కోర్టుకు తీసుకుని వెళ్లడానికి ముందు మాజీ డీసీపీ రాధాకిషన్​ రావును గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. విచారణలో భాగంగా పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. రాధాకిషన్​ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. వారం రోజులుగా పోలీసు కస్టడీలో ఉన్న రాధాకిషన్​ రావు చెప్పిన కీలక విషయాలను పోలీసులు వాంగ్మూలంలో రికార్డు చేసినట్లు సమాచారం.

హార్డ్​ డిస్కుల ధ్వంసం తెచ్చిన తంట - దశాబ్దాల నుంచి సేకరించిన డేటా మొత్తం మాయం

హార్డ్​ డిస్క్​లు ధ్వంసం చేసి మూసీ నదిలో పడేసి - ఫోన్​ ట్యాపింగ్​ కేసులో మరో ట్విస్ట్​!

Last Updated : Apr 10, 2024, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.