ETV Bharat / state

తెలంగాణ ఏర్పాటుకు ఈ స్థూపమే కారణం : అమరవీరుల స్థూపం రూపశిల్పి - Telangana Martyrs Stupa Sculptor - TELANGANA MARTYRS STUPA SCULPTOR

Telangana Martyrs Stupa Sculptor : ఎక్కా యాదగిరి రావు అంటే ఈ తరానికి పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ అమరవీరుల స్థూపం రూపశిల్పి అంటే ఎవరైనా వెంటనే గుర్తుపడతారు. తెలంగాణ ఉద్యమ చరిత్రకు నిలువుటద్దంలా నిలిస్తోంది ఈ స్థూపం. ఎంతో మంది అమరవీరుల బలిదానాలను చరిత్ర నుదిటిపై నిలిపినవాడాయన. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయన గత అనుభవాలను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

Telangana Martyrs Stupa Sculptor
Telangana Martyrs Stupa Sculptor (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 2, 2024, 5:43 PM IST

అందుకే అమరవీరుల స్థూపంపై బుల్లెట్​ గుర్తులు : రూపశిల్పి ఎక్కా యాదగిరి (ETV Bharat)

Telangana Martyrs Stupa Sculptor : రాష్ట్ర అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూప రూపశిల్పి ఎక్కా యాదగిరి రావు. తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమానికి నిలువెత్తు సాక్షం ఆయన. తెలంగాణ ఆకాంక్ష కోసం తన ప్రాణమిత్రుడు అసువులు బాసినా గుండెనిబ్బరంతో అమరుల బలిదానాలను తెలంగాణ చరిత్ర నుదిటిపై సాక్ష్యంగా నిలిపిన వాడు.

పాలమూరు మూలాలున్న ఆ 'మట్టి మనిషి' అంచెలంచెలుగా పద్మశ్రీ వరకు ఎదిగారు. మరుగున పడ్డ చరిత్రను యాదికి తెచ్చుకుంటూ 1969 ఉద్యమ ఘటనల్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఆయన తన అనుభవాలను వివరించారు. అసువులు బాసిన అమరుల జ్ఞాపకానికి చిహ్నంగా ఈ స్థూపాన్ని ఏర్పాటు చేసినట్లు యాదగిరి పేర్కొన్నారు. తాము చేసిన కృషిని, అమరుల త్యాగాలను ప్రభుత్వాలు గుర్తించకపోవడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

"గన్ పార్క్​లోని అమరవీరుల స్థూపం ఉన్నందుకే ఉద్యమకారుల చరిత్ర ఉంది. తెలంగాణ ఏర్పాటుకు ఈ స్థూపమే కారణం. ఇప్పుడు అమరవీరుల స్థూపాన్ని చూస్తుంటే నాకు కన్నీళ్లు ఆగడం లేదు. తెలంగాణ ఉద్యమంలో గన్​పార్క్ దద్దరిల్లింది. అమరులతో రాజకీయాలేంటో అర్థం కావడం లేదు. ఈ మెమోరియల్​ను ప్రారంభించకపోవడం, దాన్ని ఏర్పాటు చేసినోళ్లను పట్టించుకోకపోవడం దారుణం."- ఎక్కా యాదగిరి రావు, అమరవీరుల స్థూపం రూపకర్త

ఈ స్థూపాన్ని ఎప్పుడో ప్రారంభిస్తారని ఎంతోకాలంగా ఎదురు చూశానని, కానీ తన ఆశ నెరవేరలేదని ఎక్కా యాదగిరి రావు అవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన మొదట్లో పాలకులను వెళ్లి కలిస్తే, స్థూపం ప్రారంభించిన తర్వాత దాని నిర్మాణానికి చేసిన ఖర్చు చెల్లిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. 1974లో స్థూపం నిర్మాణానికి రూ.4 లక్షలు ఖర్చు చేస్తే, కేవలం రూ.50 వేలు మాత్రం చెల్లించారని వెల్లడించారు. మిగతావి ఇప్పటికీ ఇవ్వలేదని, డబ్బుల గురించి తాను ఆలోచించడం లేదని, స్థూపం ప్రారంభించడం లేదనే బాధే తనకు ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపాన్ని చేర్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి - Revanth Reddy Tributes To martyrs

'జయ జయహే తెలంగాణ' కొత్త సాంగ్​ ఇదే - లిరిక్స్​ వింటే గూస్​బంప్సే - Jaya Jayahe Telangana Song

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.