ETV Bharat / state

రాష్ట్రంలో ఆహార శుద్ధి రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి - ఔత్సాహికులకు ప్రోత్సాహం - Government Focus Food Processing

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 5, 2024, 8:02 AM IST

Telangana Government Focus on Food Processing : రాష్ట్రంలో ఆహార శుద్ధి రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 14 రంగాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్ ఒకటిగా గుర్తించిన నేపథ్యంలో యువత, మహిళలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తుంది. తాజాగా హైదరాబాద్‌లో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సదస్సు జరిగింది. రాష్ట్రంలో టీ-ఫుడ్ ప్రాసెసింగ్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత, కేంద్రం అమలు చేస్తున్న పీఎంకేఎస్​వై పథకం, పీఎంఎఫ్​ఎం పథకం వంటి పథకాలపై అవగాహన కల్పిస్తూ స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తోంది.

Food Processing Units in State
Telangana Government Focus Food Processing
ఆహారశుద్ధి రంగంపై సర్కార్​ దృష్టి - ఔత్సాహికులకు ప్రోత్సాహం

Telangana Government Focus on Food Processing : రాష్ట్రంలో ఆహారశుద్ధి రంగం అభివృద్ధిపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు కేంద్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోంది. 14 రంగాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఒకటిగా గుర్తింపు పొందిన నేపథ్యంలో యూనిట్ల స్థాపన కోసం ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఔత్సాహికులను ప్రోత్సహిస్తుంది. తాజాగా హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అపెడా(APEDA), ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆహార శుద్ధి ప్రోత్సాహంపై సదస్సు జరిగింది. యూనిట్ల స్థాపన, చేయూత, బ్యాంకింగ్ రుణ సదుపాయాలపై విస్తృతంగా చర్చించారు.

Food Processing Units in State : రాష్ట్రం నుంచి నాబార్డ్(NABARD) సాయంతో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా మామిడి, చిరుధాన్యాలు, మునగ పొడి, ఇతర ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేయడానికి అవకాశాలు ఉన్నాయని అపెడా తెలుగు రాష్ట్రాల ఇన్​ఛార్జి ఆర్‌పీ నాయుడు అన్నారు. వ్యవసాయ ఆహార ఉత్పత్తి యూనిట్ల విస్తరణకు ప్రభుత్వం ఇస్తున్న మద్దతు వల్ల ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2014 నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ రంగం స్థిర మూల ధనం 6,864 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి, 80 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించింది. బియ్యాన్ని విభిన్న ఉత్పత్తులుగా మార్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది.

యూనిట్ల స్థాపనకు 35 శాతం రాయితీ : వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు, విస్తరించేందుకు జాతీయ ఫుడ్ ప్రాసెసింగ్ మిషన్‌తో ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ భాగస్వామిగా ఉంది. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల వ్యవస్థీకరణ పథకం - పీఎంఎఫ్‌ఎంఈ(PMFME) కింద అసంఘటిత ఆహార ఉత్పత్తి తయారీ నాణ్యత ప్రమాణాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సంయుక్తంగా నిర్వహిస్తున్న బృహత్తర పథకం ఇది. ఈ పథకం కింద వ్యవసాయ అనుబంధంగా ఎఫ్‌పీఓలు, ఎస్‌హెచ్‌జీలు(SHG), సహకార సంఘాలకు, ప్రైవేటు లిమిటెడ్ సంస్థలు, వ్యక్తితగతంగా మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు 35 శాతం రాయితీపై 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం లభిస్తుంది.

సాధారణ మౌలిక సదుపాయల కల్పన కోసం ప్రాజెక్టు వ్యయంతో 35 శాతం రాయితీపై 3 నుంచి 10 కోట్ల రూపాయల రుణం అందిస్తున్న దృష్ట్యా, ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున క్లస్టర్లు నిర్మించేందుకు, తెలంగాణ(Telangana) ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటయ్యాయి. 14 ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఉన్నాయి. దీని లక్ష్యం 10 వేల ఎకరాల వరకు విస్తరించడం. భవిష్యత్తులో మరింత మంది ఈ రంగంలో అడుగుపెట్టబోతున్న తరుణంలో మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది.

'అపెడా నుంచి అగ్రికల్చర్​ ప్రొడక్ట్స్​ ఎగుమతి​ చేసుకోవచ్చు. ఏదైనా సరే అపెడాలో రిజిస్ట్రేషన్​ చేసుకుని తీసుకోవచ్చు. అలాగే తెలంగాణ నుంచి మామిడి, ఇతర ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవచ్చు.'- ఆర్‌.పి.నాయుడు, ఇన్​ఛార్జి, అపెడా తెలుగు రాష్ట్రాలు.

Food Processing Industries in Telangana : ఊరూరా ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.