ETV Bharat / state

గుంతల రోడ్లకు గుడ్​ బై - తెలంగాణలో ఇక పల్లెపల్లెనా తారు రోడ్లు - TAR ROAD CONSTRUCTION IN TELANGANA

రాష్ట్రంలోని అన్ని పంచాయతీ శాఖ పరిధిలో తారు రోడ్లు - ప్రతిపాదనను ఆమోదించిన మంత్రివర్గం - రూ.12 వేల కోట్లతో పనులు

Telangana Government Decided To Build Tar Roads
Telangana Government Decided To Build Tar Roads (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2024, 1:08 PM IST

Telangana Government Decided To Build Tar Roads : తెలంగాణలో గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది. వచ్చే నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఊరికి తారు రోడ్డు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతానికి మట్టి, కంకర రోడ్లు ఉన్నచోట వాటి స్థానంలో నగరాల్లో, పట్టణాల్లో మాదిరిగా పటిష్ఠమైన తారు రోడ్డు నిర్మించనున్నారు. వచ్చే నాలుగేళ్లో రూ.12 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 17,300 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది.

30టన్నుల సామర్థ్యం : పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో మొత్తం 68,539 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. అందులో 30,493.72 కిలో మీటర్ల మట్టి రోడ్లు, 7,752.10 కి.మీ కంకర, 26,146.83 కి.మీ బీటీ రోడ్లు, 4,146.63 కిలీ మీటర్ల సిమెంట్‌ కాంక్రీటు ఉన్నాయి. ప్రస్తుతం పంచాయతీరాజ్‌ రోడ్లను 10 టన్నుల వాహన సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజా రవాణాతో పాటు సరకులు, సామగ్రి సరఫరా వాహనాలు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. గ్రామాల్లో 25 నుంచి 30 మెట్రిక్ టన్నుల బరువు వాహనాలు నడుస్తున్నాయి. అధిక సామర్థ్యంతో కూడిన వాహనాల రాకపోకలతో పంచాయతీ రోడ్లు దెబ్బతింటున్నాయి. మరమ్మతులు చేసినా మళ్లీ గుంతలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై 30 టన్నుల సామర్థ్యంతో రోడ్లు నిర్మించనున్నట్లు నిర్ణయించారు.

రోడ్లు, ఆస్పత్రి భవనాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి - Minister Komatireddy on Road Works

గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో పంచాయతీరాజ్ రహదారుల నిర్వహణ, పునరుద్ధరణ అంతంత మాత్రంగానే జరిగింది. నిధులు తక్కువగా కేటాయించడం, సకాలంలో చెల్లించకపోవడం, బిల్లులు మంజూరు చేయకపోవడం తదితర కారణాలతో చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబరు మధ్య కురిసిన భారీ వర్షాలకు జిల్లాల్లో చాలాచోట్ల గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

నివేదిక ప్రకారం నిర్మాణం : రహదారులకు వాటిల్లిన నష్టాల అంచనాలు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా అన్ని గ్రామాలకు పటిష్ఠమైన తారురోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి గ్రామపంచాయతీకి తారు రోడ్డు నిర్మించి వాటిని సరీమ గ్రామాలకు, మండల కేంద్రానికి అనుసంధానం చేయాలని యోచిస్తున్నారు. రాబోయే నాలుగేళ్లలో రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణకు రూ.12,000 కోట్లు మంత్రివర్గంలో ప్రతిపాదించగా ఆమోదం పొందింది.

రహదారుల నిర్మాణానికి ఆటంకాలేమీ ఎదురుకాకుండా తర్వతిగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానం చేపడతారు. నిర్మాణానికి ముందుకొచ్చే సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటారు. దానికయ్యే నిధులను ప్రభుత్వం చెల్లిస్తుంది. వాటి నిర్మాహణను పదేళ్లపాటు నిర్మాణ సంస్థలకు అప్పగించాలని యోచిస్తోంది.

అధ్వాన్నంగా ఇందూరు రోడ్ల దుస్థితి - ఇకనైనా మారదా పరిస్థితి

నత్తనడకన రోడ్డు విస్తరణ పనులు - ట్రాఫిక్​తో ఇబ్బంది పడుతున్న ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.