ETV Bharat / state

మత్తు పదార్థాల కట్టడిపై సర్కార్ ఫోకస్ - రాష్ట్రంలో 'హుక్కా'ను నిషేధిస్తూ నిర్ణయం - Telangana Govt Ban Hookah Centers

Telangana Government Banned Hookah Centers : తెలంగాణలో హుక్కా కేంద్రాలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 4న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా, అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తద్వారా హుక్కా కేంద్రాల మాటున హైదరాబాద్​లో జరుగుతున్న ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనలో కీలకంగా మారుతోందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

telangana govt ban hookah centers
telangana govt ban hookah centers
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 11, 2024, 8:56 AM IST

Updated : Feb 11, 2024, 9:05 AM IST

రాష్ట్రంలో హుక్కా కేంద్రాలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం

Telangana Government Banned Hookah Centers : తెలంగాణలో డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాంగ్రెస్‌ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మాదకద్రవ్యాల నిరోధక విభాగం-టీఎస్‌న్యాబ్‌కు పూర్తిస్థాయి సంచాలకుడిని నియమించారు. దీంతో పోలీసుశాఖ మత్తు పదార్థాల కట్టడిపై కార్యాచరణను ప్రారంభించింది. ఇందులో భాగంగా పబ్​లు, బార్​లు, హుక్కా కేంద్రాలపై ఫోకస్ పెట్టింది.

Hookah Centers Ban in Telangana : ఈ క్రమంలోనే హైదరాబాద్​లోని హుక్కా పార్లర్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలతో పాటు పొగాకు ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ కేసుల్లో (Drugs Cases in Telangana) పట్టుబడే యువకుల్లో ఎక్కువ మంది హుక్కా కేంద్రాలకు వెళ్లేవారు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే హుక్కా పార్లర్లపై నిషేధం విధించాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్రంలో వాటిపై నిషేధం విధిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.

అల్ఫాజోలం కొకైన్​ కంటే ప్రమాదకరం - అక్రమంగా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు : సందీప్ శాండిల్య

హైదరాబాద్‌లో ఎక్కువగా హుక్కా కేంద్రాలు : రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఎక్కువగా హుక్కా కేంద్రాలు నడుస్తున్నాయి. దాదాపు 500 లకు పైనే నడుస్తున్నాయని పోలీసు అధికారులు అంచనా వేశారు. ఇవికాకుండా పబ్​లు, రెస్టారెంట్లు, హోటళ్లు, ఇళ్లల్లో గుట్టుగా కొనసాగేవి భారీగానే ఉన్నట్లు గుర్తించారు. ఈ కేంద్రాల్లో మద్యం పొగాకు ఉత్పత్తులతో పాటు వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసుల తనిఖీలతో తరచూ వెల్లడవుతోంది.

నిబంధనల ప్రకారం హుక్కా పార్లర్ (Hookah Centers) అనుమతి సమయంలో పేర్కొన్న నిర్దిష్ట గదుల్లోనే నిర్వహించాలి. పొగాకు ఉత్పత్తులు ఉపయోగించడానికి వీల్లేదు. మైనర్లను అనుమతించకూడదు. నిర్ణీత సమయాలు పాటించాల్సి ఉంటుంది. కానీ హైదరాబాద్​లోని మెజార్టీ హుక్కా కేంద్రాల్లో నిబంధనలు ఏవీ పాటించడం లేదు. మైనర్లను అనుమతించడంతో పాటు విదేశీ సిగరెట్లు అమ్మేస్తున్నారు. కాఫీ క్లబ్బులు, రెస్టారెంట్లు, హోటళ్ల పైభాగంలో కొన్ని నడుస్తున్నాయి.

హైదరాబాద్​లో పెరిగిన నేరాలు - డ్రగ్స్, భూదందాలపై ఉక్కుపాదం మోపుతాం : సీపీ శ్రీనివాస్​ రెడ్డి

పోలీసులు తనిఖీలకు వెళ్లినప్పుడు కోర్టు ఆర్డర్ ఉందంటూ సాకులు చెప్పడం, రాజకీయ, ఇతర పలుకుబడితో సర్దిచెప్పడం లాంటివి కొనసాగుతున్నాయి. అసాంఘిక కార్యాకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో గత కొన్నాళ్లుగా దృష్టిసారించిన పోలీసు అధికారులు వీటిపై నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా హుక్కా కేంద్రాలపై తెలంగాణ సర్కార్ నిషేధం విధించింది. తాజా నిర్ణయం మాదకద్రవ్యాల నియంత్రణలో ముందడుగులాంటిదని, భవిష్యత్​లో ఎంతో మేలు చేస్తుందని అధికారులు భావిస్తున్నారు.

డ్రగ్స్​ ఒక్కసారి వినియోగిస్తే బానిసలుగా మారే అవకాశం : సందీప్ శాండిల్య

రాష్ట్రంలో డ్రగ్స్, నకిలీ విత్తనాలు అనే పదాలు వినిపించేందుకు వీల్లేదు - పోలీసులకు సీఎం కీలక ఆదేశాలు

Last Updated : Feb 11, 2024, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.