ETV Bharat / state

విద్యాశాఖ కీలక నిర్ణయం - 10 మంది విద్యార్థులుంటే ఇద్దరు టీచర్లు - 41 దాటితే ముగ్గురు - SGT RATIONALIZATION IN TELANGANA - SGT RATIONALIZATION IN TELANGANA

Second Grade Teachers Rationalization: ప్రభుత్వ ప్రాథమిక విద్యార్థుల విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లను నియమించాలని నిర్ణయించింది.

Second Grade Teachers Regularization in Telangana
Second Grade Teachers Regularization in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 1, 2024, 8:51 AM IST

Second Grade Teachers Regularization in Telangana : ప్రభుత్వ ప్రాథమిక విద్యార్థులకు సంబంధించి ఆ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి ఎంతమంది ఉపాధ్యాయులు అవసరమో అంతమంది టీచర్లనే కేటాయించనుంది. అవసరానికి మించి ఉంటే వారిని బదిలీ చేయనుంది. ఒక పాఠశాలలో 10 మంది విద్యార్థులు దాటితే అక్కడ ఇద్దరు టీచర్లు రానున్నారు. 41 మంది విద్యార్థులు మించితే ముగ్గురు ఉపాధ్యాయులు ఉంటారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్ల బదిలీల సందర్భంగా పాఠశాల విద్యాశాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

2015, 2021 సంవత్సరాల్లో ప్రభుత్వం ఇచ్చిన ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ మార్గదర్శకాల ప్రకారం 19 మంది విద్యార్థులు దాటితేనే ఇద్దరు టీచర్లను నియమించాలి. అయితే ఇప్పుడు అలా కాకుండా విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా 10 మంది పిల్లలకు మించి ఉన్నా ఇద్దరు ఉపాధ్యాయులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలు ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక టీచర్‌ను కేటాయించాలన్న డిమాండ్‌ ఎప్పటినుంచో ఉంది. అలా కేటాయించకున్నా సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో చదువుల పరిస్థితి కొంత మెరుగవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎంత మంది విద్యార్థులకు ఎంత మంది ఉపాధ్యాయులు : విద్యార్థుల సంఖ్య ప్రకారం ఉపాధ్యాయులను హేతుబద్ధీకరించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 2015లో జీవో 17, 2021లో జీవో 25ను తీసుకొచ్చింది. ఆ జీవోల ప్రకారం 19 మంది పిల్లలకు ఒక టీచర్, 20-60 విద్యార్థులకు ఇద్దరు, 91-120కి నలుగురు ఉపాధ్యాయులు, 121-150కి ఐదుగురు, 151-200కి ఆరుగురు, 201-240కి ఏడుగురు, 241-280 మంది విద్యార్థులకు ఎనమిది మంది టీచర్లను కేటాయించారు. 361-400 మంది విద్యార్థులకు ఏకంగా 11 మంది ఉపాధ్యాయులు ఉంటారు. నిజానికి క్షేత్రస్థాయిలో ఇది జరగడం లేదు.

Pratidwani : ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ... సవాళ్లు

రాష్ట్రవ్యాప్తంగా ఎస్జీటీల బదిలీల ప్రక్రియ జరుగుతోంది. తెలంగాణలో 2015లో టీచర్ల హేతుబద్ధీకరణ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను కేటాయించారు. 2021లో కొత్త మార్గదర్శకాలు ఇచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి ఎలా ఉందంటే పిల్లలున్న చోట ఉపాధ్యాయులు లేరు, టీచర్లు ఉన్న చోట పిల్లలు తక్కువగా ఉన్నారు. దీంతో తాజా బదిలీల్లో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఈ సారి ఒక్క విద్యార్థి కూడా లేని బడులకు ఉపాధ్యాయులను కేటాయించలేదు. అలా హేతుబద్ధీకరణ మార్గదర్శకాల ప్రకారం కేటాయింపులు చేశారు.

సీఎం కార్యాలయం జవాబు : కానీ ఉపాధ్యా సంఘాలు మాత్రం గతంలో మాదిరిగానే అన్ని బడుల్లో ఖాళీలన్నింటిని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పిల్లలు అధికంగా ఉన్న చోట కొత్త ఖాళీలను పెంచలేదని ఎస్సీ, ఎస్టీ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జాడి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని సీఎం కార్యాలయం వెల్లడించింది.

టీచర్ల బదిలీలపై ఏప్రిల్ 11 వరకు స్టే పొడిగించిన హైకోర్టు

Part Time Contract Teachers Protest in Hyderabad : తమను క్రమబద్ధీకరించాలంటూ ఉన్నత విద్యామండలి కార్యాలయం ముందు నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.