TG EAMCET 2024 Counselling Schedule Dates Change : రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది. ఈ నెల 27 నుంచి ప్రారంభం కావాల్సిన షెడ్యూల్ను వాయిదా వేసింది. మూడు విడతలుగా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ జరగనుంది. జులై 4 నుంచి ఇంజినీరింగ్ తొలి విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. జులై 6 నుంచి 13 వరకు తొలి విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నారు. అలాగే జులై 8 నుంచి 15 వరకు తొలి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జులై 19న ఇంజినీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు జరగనుంది.
జులై 26 నుంచి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్, జులై 27న రెండో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నారు. జులై 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. జులై 31న రెండో విడత సీట్ల కేటాయింపు, ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఆగస్టు 9న సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరగనుంది. ఆగస్టు 9, 10 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఆగస్టు 13న సీట్ల కేటాయింపు చేయనున్నారు. ఆగస్టు 21 నుంచి కన్వీనర్ కోట ఇంటర్నల్ స్లైడింగ్కి అవకాశం ఇచ్చారు.