Telangana Cabinet Meeting 2024 : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరగనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీలో రైతు రుణమాఫీతో పాటు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ప్రధానంగా రైతు రుణమాఫీపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కిసాన్ సమ్మాన్ నిధి అర్హతలనే ప్రాతిపదికగా తీసుకోవడం సహా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
Telangana Ministers Decisions Cabinet Meeting : రైతు భరోసా, రైతు బీమా, పంటల బీమాకు కూడా కిసాన్ సమ్మాన్ నిధి అర్హతలను ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటన్నింటిపై కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు ముగిసినందున ఇప్పటివరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు సొంతమైంది. దీనివల్ల హైదరాబాద్లోని ఏపీ ఆస్తులతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు మంత్రులు చర్చించనున్నారని సమాచారం. లోక్సభ ఎన్నికల దృష్ట్యా తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ప్రస్తుతం పూర్తి బడ్జెట్ పద్దులపై కసరత్తు చేస్తోంది. ఈ అంశాలు కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ - కేబినెట్లోకి ఆ నలుగురు? - Telangana Cabinet Expansion
వ్యవసాయ రుణమాఫీయే ప్రధాన అజెండా - 21న తెలంగాణ కేబినెట్ సమావేశం - TS Cabinet Meeting 2024