ETV Bharat / state

పాఠ్య పుస్తకాల్లో ‘జయ జయహే తెలంగాణ' - విద్యాశాఖ ఆదేశాలు

పాఠశాల పాఠ్య పుస్తకాల్లో రాష్ట్ర గేయం జయ జయహే తెలంగాణ - వచ్చే విద్యా సంవత్సరానికి(2025-26) ఒకటి నుంచి పదో తరగతి పాఠ్య పుస్తకాల్లో ముద్రణ

School Books in Telangana
Telangana Anthem In School Books (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 7 minutes ago

Telangana Anthem In School Books : తెలంగాణ ప్రభుత్వం ప్రచురించే పాఠశాల పాఠ్య పుస్తకాల్లో ఈసారి రాష్ట్ర గేయాన్ని చేర్చనున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి(2025-26) ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రక్రియ మొదలైంది. ఈమేరకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాల విభాగానికి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం కవి అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర గేయాన్ని పాఠ్య పుస్తకాల్లో చేరుస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి చెప్పారు. ప్రస్తుతం పుస్తకాల్లో జనగణమన, వందేమాతరం, ప్రతిజ్ఞలను ముద్రిస్తున్నారు. ఇకపై వాటి సరసన రాష్ట్ర గేయం కూడా ముద్రించాలనుకుంటున్నారు. తెలుగు, సాంఘిక శాస్త్రం లాంటి కొన్ని సబ్జెక్టుల పుస్తకాల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ముద్రించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈసారికి పాత సిలబస్‌తోనే : ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగేళ్ల క్రితమే ఆంగ్ల మాధ్యమాన్ని సమాంతరంగా ప్రవేశపెట్టారు. స్కూలు విద్యార్థులు ఇబ్బంది పడకూడదని తెలుగు-ఆంగ్లం, హిందీ-ఆంగ్లం, ఉర్దూ-ఆంగ్లం ఇలా రెండేసి భాషల్లో పుస్తకాలను ముద్రిస్తున్నారు. పిల్లలకు పుస్తకాల బరువు బాగా పెరుగుతుందని తెలిసి భాషేతర పుస్తకాలను రెండు భాగాలుగా చేసి విద్యార్థులకు అందిస్తున్నారు.

వచ్చే విద్యా సంవత్సరం(2025-26) కూడా పుస్తకాలను ద్విభాషల్లోనే ముద్రించనున్నారు. పాత సిలబస్ ఉంటుంది. 2026-27 విద్యా సంవత్సరం మాత్రం సిలబస్‌ మారుతుందని నరసింహారెడ్డి తెలిపారు. ఈసారి పుస్తకాల్లో తప్పులు లేకుండా సరఫరా చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల నుంచి విద్యావేత్తల నుంచి సూచనలు, సలహాలు తీసుకోనున్నట్లు తెలిపారు. పుస్తకాల బరువు వల్ల పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని గమనించి పుస్తకాలను ముద్రిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రచయిత అందెశ్రీ రాసిన గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరం సమకూర్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చనున్నారు.

తెలంగాణ రాష్ట్ర గీతానికి ప్రభుత్వం ఆమోదం - జూన్​ 2న జాతికి అంకితం : సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth review on TG Anthem

'జయ జయహే తెలంగాణ' కొత్త సాంగ్​ ఇదే - లిరిక్స్​ వింటే గూస్​బంప్సే - Jaya Jayahe Telangana Song

Last Updated : 7 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.