Supreme Court Orders Restored Forest Land in Warangal : 39 సంవత్సరాల తర్వాత భూపాలపల్లి జిల్లాలోని అటవీ శాఖ భూమికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. 106.34 ఎకరాల భూమి రాష్ట్ర అటవీ శాఖదే అని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. భూపాలపల్లి పట్టణంలోని కొంపల్లి గ్రామ శివారులో సర్వేనెంబర్ 171లో సర్వేలో ఉన్న 106.34 ఎకరాల అటవీ భూమి భూమిపై మహ్మద్ అబ్దుల్ ఖాసిం అనే వ్యక్తి హక్కును కోరుతూ 1985లో వరంగల్ జిల్లా కోర్టులో కేసు వేశారు. 1994లో అటవీ శాఖకు అనుకూలంగా తీర్పు వెలువడగా, సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.
2018లో హైకోర్టు అటవీశాఖకు అనుకూలంగానే తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుపై మహ్మద్ అబ్దుల్ ఖాసిం రివ్యూ పిటిషన్‌ను హైకోర్ట్ లో దాఖలు చేయగా మార్చి 2021లో హైకోర్టు సదరు 106 ఎకరాల అటవీ భూమి మహ్మద్ అబ్దుల్ ఖాసింకు చెందుతుందని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుపై అటవీశాఖ 2021 మే లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవు పిటిషన్‌ను దాఖలు చేసింది. ఫిబ్రవరి 2024లో దీనిపై పై వాదనలు విన్న ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం106 ఎకరాల భూమి అటవీశాఖ దేనని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది. అంతేకాకుండా ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా అఫిడవిట్లను దాఖలు చేసిన అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకొనవలసిందిగా ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన సందర్భంగా అటవీశాఖ భూములు అటవీశాఖకే చెందుతాయని ఆ శాఖ తరఫున న్యాయవాదులు వాదించగా, రెవెన్యూ శాఖ మాత్రం 106 ఎకరాలపై ప్రైవేటు వ్యక్తికే హక్కులు కలవని అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికే చెందిన రెండు ప్రభుత్వ శాఖలు విభిన్న వాదనలు వినిపించడంతో, సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒకే వాదనను దాఖలు చేయవలసిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గత ఏడాది అక్టోబర్‌లో ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ దాఖలు చేసిన అఫిడవిట్లో సదరు 106 ఎకరాల అటవీ భూమిగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడంతో, సుప్రీంకోర్ 106 ఎకరాల అటవీ భూమిగా గుర్తిస్తూ తీర్పును వెలువరించింది.
హైదర్‌నగర్ భూముల కేసులో రాష్ట్రానికి సుప్రీం సూచన
ఈ కేసులో ప్రభుత్వాధికారులు స్పష్టమైన విధానం తీసుకోకుండా వ్యవహరించినందుకు రాష్ట్ర సర్కార్‌తో పాటు, ప్రతివాదులకూ రూ.5 లక్షల చొప్పున జరిమాన విధిస్తున్నట్లు వెల్లడించింది. సూట్లో పేర్కొన్న ఆస్తి అటవీభూమేనని స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భిన్న విధానాలు అనుసరించిందని న్యాయస్థాయం తెలిపింది. అంతిమంగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో ఆ తప్పును సరిదిద్దుకొంది అని వ్యాఖ్యానించింది. అందుకో ప్రతివాదితోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి జరిమాన విధిస్తున్నామని పేర్కొంది. ఆ మొత్తాన్ని రెండు నెలలలోపు జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థకు చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది.
కలెక్టర్ ఆస్తులు జప్తునకు కోర్టు ఆదేశం.. 40 ఏళ్లుగా న్యాయ పోరాటం