Special Trains To Sabarimala From Telangana And Andhra Pradesh : శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు శుభవార్త. భక్తుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే పలు నడుపుతున్న దక్షిమ మధ్య రైల్వే తాజాగా జనవరిలో ప్రత్యేకంగా 34 అదనపు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. మౌలాలి టూ కొట్టాయం, హైదారాబాద్ నుంచి కొట్టాయం, కాచిగూడ నుంచి కొట్టాయం, కొట్టాయం టూ సికింద్రాబాద్, మౌలాలి నుంచి కొల్లం మధ్య జనవరి నుంచి ఫిబ్రవరి 1వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
శబరిమలలో నయా రూల్- ఇక అవన్నీ బ్యాన్- భక్తులు ఇది తెలుసుకోవాల్సిందే!
- హైదరాబాద్ - కొట్టాయం - సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు (07065/07066) బేగంపేట, వికారాబాద్, తాండూరు నుంచి సేలం, లింగంపల్లి, శంకర్‌పల్లి, సులేహల్లి, యాద్గిర్, కృష్ణ, రాయ్‌చూరు, మంత్రాలయం నుంచి ఆదోని, గుంతకల్, గుత్తి, యర్రగుంట్ల, కడప మీదుగా రాజంపేట, రేణిగుంట మీదుగా ఈరోడ్ కాట్పాడి, జోలర్‌పెట్టై, సేలం, , తిరుప్పుర్ నుంచి కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిశ్శూర్, అలువ చేరుకుని ఎర్నాకుళం టౌన్ స్టేషన్ల మీదుగా మంగళ, బుధవారాల్లో మొత్తంగా ఎనిమిది సార్లు నడవనున్నాయి.
- మౌలాలి-కొట్టాయం - సికింద్రాబాద్ (07167/07168) ప్రత్యేక రైళ్లు చర్లపల్లి, నల్గొండ నుంచి మిర్యాలగూడ, నడికుడి మీదుగా పిడుగురాళ్ల, సత్తెనపల్లి నుంచి గుంటూరు వెళ్లి అక్కడి నుంచి తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరుకు చేరుకుని అక్కడి నుంచి గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్‌పెట్టై, సేలం నుంచి ఈరోడ్, తిరుప్పుర్, కోయంబత్తూర్ మీదుగా వెళ్లి పాలక్కడ్, త్రిశ్శూర్, ఎర్నాకుళం, ఎట్టుమానూర్, అలువ స్టేషన్ల మీదుగా శుక్ర, శనివారాల్లో సర్వీసులందించనున్నాయి.
- మౌలాలి-కొట్టాయం - సికింద్రాబాద్ (07167/07168) ప్రత్యేక రైళ్లు చర్లపల్లి నుంచి నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి మీదుగా వెళ్లి గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పుర్, కోయంబత్తూర్ నుంచి పాలక్కడ్, త్రిశ్శూర్, అలువ, ఎర్నాకుళంకు చేరుకుని ఎట్టుమానూర్ స్టేషన్ల మీదుగా శుక్ర, శనివారాల్లో రైళ్లు సర్వీసు అందించనున్నాయి.
- కాచిగూడ -కొట్టాయం- కాచిగూడ (071/07170) ప్రత్యేక రైళ్లు మల్కాజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా కాట్పాడి, జోలర్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పుర్, కోయంబత్తూరు, పాలక్కడ్ నుంచి త్రిశ్శూరు, అలవు, ఎర్నాకుళం, ఎట్టుమానూర్ స్టేషన్ల మీదుగా ఆది, సోమ వారాల్లో రాకపోకలు సాగించనున్నాయి..
- మౌలాలి-కొల్లం- మౌలాలి (07170/07172) ప్రత్యేక రైళ్లు భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట చేరుకుని అక్కడి నుంచి జోలార్‌పెట్టై, కాట్పాడి, సేలం అలవు, ఎర్నాకుళం, ఎట్టుమానూర్‌కు చేరుకుని అక్కడి నుంచి అందులోనే కొట్టాయం, చెంగనస్సేరి, తిరువల్ల, , ఈరోడ్, తిరుప్పుర్, పొడన్నూరు నుంచి పాలక్కాడ్, త్రిశ్శూరు, చెంగన్నూర్, కాయంకుళం స్టేషన్ల మీదుగా శని, సోమవారాల్లో రాకపోకలు కొనసాగించనుంది. ఈ రైళ్లలో ఏసీ బోగీలతో పాటు స్లీపర్, జనరల్ కోచ్‌లు సైతం ఉంటాయని ద.మ.రైల్వే సీపీఆర్వో శ్రీధర్ వివరించారు.
శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్ - సులభ దర్శనం కోసం నయా పోర్టల్
భక్తులకు అలర్ట్ - రైళ్లలో ఇలా చేస్తే మూడేళ్ల జైలుశిక్ష, జరిమానా