ETV Bharat / state

రాత్రికి రాత్రే 99 రిజిస్ట్రేషన్లు! - అదీ ఆ శాఖ మంత్రి ఇలాఖాలో - విచారణకు ఆదేశం - WYRA SUB REGISTRAR OFFICE INCIDENT

వైరా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుండానే లావాదేవీలు - సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పొంగులేటి

wyra Sub Registrar Office Incident
wyra Sub Registrar Office Incident (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Updated : 5 hours ago

wyra Sub Registrar Office Incident : ఖమ్మం జిల్లా వైరా సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్​ వేదికగా రాత్రి సమయంలో జరిగిన రిజిస్ట్రేషన్లు స్టాంపులు - రిజిస్ట్రేషన్ల శాఖలో కలకలం రేపుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఈ సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీస్​లో ఒకే రోజు రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) ఆమోదం పొందని స్థిరాస్తి ప్లాట్లకు 99 రిజిస్ట్రేషన్లు చేసినట్లుగా తెలిసింది. ఖమ్మం నగరపాలక సంస్థకు సరిహద్దుగా ఉండేటువంటి వైరా పురపాలక సంఘంతో పాటు కొణిజర్ల మండలం పరిధిలో రియల్ ​ఎస్టేట్​ వెంచర్లు ఉన్నాయి.

వీటిలో కొన్ని లేఅవుట్​ల క్రమబద్ధీకరణ పథకానికి దరఖాస్తు చేసినవి ఉండగా, అనుమతులు ఇంకా రాలేదు. అయినప్పటికీ క్రమబద్ధీకరణ అనుమతులు లేనటువంటి ప్లాట్లకు సబ్‌ రిజిస్ట్రార్‌ ఏకంగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడం చర్చనీయాంశమైంది. ఖమ్మం-వైరా ప్రధాన రహదారిలో రియల్​ ఎస్టేట్​ వ్యాపారానికి మంచి డిమాండ్‌ ఉంది. కొణిజర్ల మండలంలో తనికెళ్ల, అమ్మపాలెం ప్రాంతాల్లోనూ వెంచర్లు వెలిశాయి. వైరా, కొణిజర్ల మండలాల్లో కొన్ని వెంచర్లు సరైన నిబంధనలను పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిబంధనలను ఉల్లంఘించి లావాదేవీలు : అనుమతి లేని లే అవుట్లలోని స్థలాల రిజిస్ట్రేషన్లు చేయకుండా సర్కారు పలు నిబంధనలను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అనుమతి లేకుండా ఉన్నటువంటి లేఅవుట్ల క్రమబద్ధీకరణ కూడా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల అప్లికేషన్లు పరిశీలనలో ఉండగా, ఇప్పటివరకు 4.50 లక్షల దరఖాస్తులను పరిశీలన పూర్తి చేశారు. పట్టణ ప్రణాళికకు అనుగుణంగా ఉన్నవి, డీటీసీపీ, రెరా(రియల్ ఎస్టేట్​ రెగ్యులేటింగ్​ అథారిటీ) తదితర అనుమతులు పొందిన స్థిరాస్తులకు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంటుంది. అయితే వైరా సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్​ అధికారులు మాత్రం నిబంధనలను పక్కనపెట్టి ఎల్‌ఆర్‌ఎస్‌ లేని వాటికి గుట్టుగా రిజిస్ట్రేషన్​ చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

అర్ధరాత్రి జరిగిన రిజిస్ట్రేషన్లు, రూల్స్​ ఉల్లంఘనపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ఆరా తీసిన అనంతరం, వైరా సబ్‌ రిజిస్ట్రార్‌కు ఫోన్‌ చేసి తీవ్రంగా మండిపడినట్లు సమాచారం. మరోవైపు మంత్రి శాఖలో ప్రక్షాళన ప్రారంభించి ఇప్పటికే దిగువ స్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకు ట్రాన్స్​ఫర్ల ప్రక్రియను పూర్తి చేశారు. ఎక్కువ కాలం ఒకే చోట పని చేసిన వారిని వేరే ప్రాంతానికి బదిలీ చేశారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పారదర్శక సేవలు అందించేందుకు ఇటీవల చర్యలను చేపట్టారు. ఈ క్రమంలో ఇలా జరగడంపై మంత్రి పొంగులేటి అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

విచారణ చేపట్టాలని డీఐజీకి ఆదేశాలు : వైరా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రాత్రిపూట జరిగిన రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌ (ల్యాండ్​ రెగ్యులరేషన్​ పథకం) కింద అనుమతులు లేకుండా ఏ విధంగా రిజిస్ట్రేషన్లు చేశారు, ఎలా నిబంధనలు ఉల్లంఘించారు అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని డీఐజీ (డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌)ని శాఖ కార్యదర్శి, కమిషనర్‌ జ్యోతిబుద్ధ ప్రకాశ్‌ ఆదేశాలు జారీ చేశారు.

'మార్చి నెలాఖరులోగా ఎల్​ఆర్​ఎస్​ సమస్యలు పరిష్కరించాలి!'

'రెవెన్యూశాఖలో అవినీతి జరిగితే సహించేది లేదు - ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఓకే'

Last Updated : 5 hours ago
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.