ETV Bharat / state

ఒంటరి జంటలను వేధించిన నిందితులకు ఎస్ఐ సపోర్ట్ - వేటు వేసిన ఉన్నతాధికారులు - SI neglecting to catch the thieves - SI NEGLECTING TO CATCH THE THIEVES

SI neglecting to catch the thieves in Uppal: ఉప్పల్​లో రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్న గ్యాంగ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి సహకరించిన ఉప్పల్ ఎస్ఐపై అధికారులు వేటువేశారు. ఎస్ఐ శంకర్​ను డీసీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు. ఉప్పల్ పరిధిలో దొంగతనానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమైనందున ఎస్ఐపై చర్యలకు ఉపక్రమించినట్లు సీఐ తెలిపారు.

uppal SI Shankar
uppal SI Shankar (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 22, 2024, 5:32 PM IST

SI neglecting to catch the thieves in Uppal: చోరీ కేసులో దొంగలకు వకాల్తా పుచ్చుకున్న ఎస్ఐపై అధికారులు వేటు వేశారు. విధుల్లో నిర్లక్షం వహించినందుకు ఎస్​ఐని డీసీపీ ఆఫీస్​కు అటాచ్ చేసిన ఘటన రాచకొండ ఏరియాలోని ఉప్పల్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఉప్పల్ సీఐ తెలిపిన ప్రకారం... ఉప్పల్ బగాయత్​లో పోకిరీల ఆగడాలు రోజురోజుకు శృతి మించిపోతున్నాయి. రాత్రి వేళ బగాయత్​లోకి వచ్చే జంటలను పోకిరీలు బెదిరిస్తున్నారు. వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ జంట బగాయత్​కు రాగా, వారిని పోకిరీలు బెంరించారు. వారి వద్ద నుంచి సుమారు మూడు లక్షల రూపాయలు వసూలు చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.
మేడ్చల్‌లో జ్యువెలరీ దోపిడీ కేసును చేధించిన పోలీసులు - ఇద్దరి అరెస్ట్ - jewellery shop robbery case

తమకు జరిగిన మోసంపై ఆ జంట పోలీసులను సంప్రదించింది. తమను బెదిరించి కొందరు వ్యక్తులు డబ్బులు వసులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాల్సిన ఎస్ఐ చోరీ చేసిన వ్యక్తులకు కొమ్ముకాశాడు. పోకిరీలతో చేతులు కలిపిన ఎస్ఐ, కంప్రమైజ్ కావాలని ఫిర్యాదుదారులకే సూచించాడు. దీంతో తమకు న్యాయం జరగడం లేదంటూ ఆ జంట ఉన్నతాధిధికారులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై వారు విచారణకు ఆదేశిచారు.

విచారించిన పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసులో ఐదుగురి నిందితులను అరెస్ట్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ శంకర్​ను డీసీపీ ఆఫీస్​కు అటాచ్ చేశారు. ఈ నెల 19న ఐదుగురు నిందితులు అమర్, మారుతీ, ఉదయ్, రామ్ చరణ్​లను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించామని సీఐ తెలిపారు.

వేర్వేరు కేసుల్లో సైబర్‌ నేరగాళ్ల అరెస్టు - విచారణలో విస్తుపోయే విషయాలు - cyber trading fraud accused arrest

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.