ETV Bharat / state

గొర్రెల పంపిణీ కేసులో ఉద్యోగుల పాత్ర బట్టబయలు - బినామీల పేర్లతో నిధుల మళ్లింపు - Sheep Distribution Scam Case

Sheep Distribution Scam Case in Telangana : గొర్రెల పంపిణీ కుంభకోణంలో కొంత మంది ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి క్రమక్రమంగా వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో నిందితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. తాజాగా మరో ఇద్దరు ప్రభుత్వ ఉద్మోగులను అవినీతి నిరోదక శాఖ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించడానికి పశుసంవర్ధక శాఖ అధికారులు సహకరించినట్లు ఆధారాలు సేకరించారు.

Sheep Distribution Scam Case
Sheep Distribution Scam Case
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 15, 2024, 9:55 AM IST

గొర్రెల పంపిణీ కేసులో ఉద్యోగుల పాత్ర బట్టబయలు - బినామీల పేర్లతో నిధుల మళ్లింపు

Sheep Distribution Scam Case in Telangana : గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలకు సంబంధించి ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు పశుసంవర్ధకశాఖకు చెందిన ఇద్దరు అధికారులను అరెస్టు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి దళారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకులు అంజిలప్ప, సహాయ సంచాలకులు కృష్ణయ్యలను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

రైతుల నుంచే గొర్రెలు కొనుగోలు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లి గొర్రెలను సేకరించాలని జీవో జారీ చేసి కొన్ని సూచనలను పొందుపరిచింది. అయినా వాటిని లెక్క చేయని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు గుత్తేదారులతో కలిసి కుమ్మకైనట్టు ఏసీబీ(ACB) దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.

గొర్రెల పంపిణీ నిధుల గోల్​మాల్​లో ఉన్నతాధికారుల ప్రమేయం - రంగంలోకి ఏసీబీ

ప్రైవేటు వ్యక్తుల ఆదేశాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరిపారని ప్రభుత్వ అధికారులు నింపాల్సిన అన్ని దరఖాస్తు ఫారాలను ప్రైవేటు ఉద్యోగుల ద్వారా నింపి బ్యాంకు ఖాతాలకు బినామీల వివరాలను జత చేశారని విచారణలో తేలింది. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా పశువర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ అంజలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య ఉద్దేశపూర్వకంగానే నకిలీ బినామీ వివరాలను కలెక్టర్‌కు పంపారని ఏసీబీ వెల్లడైంది. ప్రభుత్వ ఖజానాకు రూ.2.10 కోట్లు నష్టం జరిగిందని అధికారులు తేల్చారు.

గొర్రెల నిధుల గోల్‌మాల్‌పై ఏసీబీ లోతైన దర్యాప్తు - 2 కోట్ల నిధులకు పైగా దారి మళ్లినట్లు గుర్తింపు

Sheep Distribution Scheme in Telangana : గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్​కు చెందిన రైతుల నుంచి గొర్రెలు కొనుగోలు చేసి వారికి డబ్బును ఇవ్వకుండా మోసం చేస్తున్నారని బాధితులు ఏసీబీ అధికారులకు ఆధారాలతో పాటు వివరాలు అందజేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు, గొర్రెల పంపిణీ కోసం గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు చెందిన 15 మంది రైతుల నుంచి 130 యూనిట్ల గొర్రెలను కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

వారికి రావాల్సిన రూ.2.10కోట్లు నగదు బినామీల పేర్లతో నిందితులు బినామీల పేర్లతో తమ బ్యాంకు అకౌంట్​లోకి బదిలీ చేసుకున్నారని తేలినట్లు చెప్పారు. ప్రధాన నిందితుడు కాంట్రాక్టర్ మోహినిద్దీన్ తమ సిబ్బంది బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయడానికి ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులు సహకరించారని దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు సమాచారం.

గొర్రెల పంపిణీ స్కామ్​ కేసులో విచారణ ముమ్మరం - మరో అధికారి ప్రమేయం గుర్తించిన ఏసీబీ

పశుసంవర్ధక శాఖలో నిధుల గోల్‌మాల్‌ కేసు ఏసీబీకి బదిలీ- ఓఎస్డీ కల్యాణ్​ సహా పలువురిపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.