Seemantham Celebration To Cat In Khammam : మహిళకు సీమంతం జరిగే సమయంలో ఆమెకు చాలా ఆనందంగా ఉంటుంది. స్త్రీ మాతృత్వపు మాధుర్యాన్ని పొందే కొద్ది నెలల ముందు జరిగే ఈ వేడుకలో అందరూ వచ్చి ఆశీర్వదిస్తే ఆమెకు ఆ ఆనందమే వేరు. ఇలాగే ఖమ్మం జిల్లాలో ఓ ఇంట్లో సీమంతం ఘనంగా జరిగింది. దీంట్లో వింతేముంది అనుకోకండి. సీమంతం చేసింది ఎవరికో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వారు తమ ఇంట్లో పెంపుడు పిల్లికి సీమంతం చేశారు.
పిల్లికి సీమంతం : ఖమ్మం జిల్లా మధిర సీపీఎస్ రోడ్లోని అల్లూరి నాగభూషణం, పద్మావతి దంపతులు ఒక పెంపుడు పిల్లిని పెంచుకుంటున్నారు. ఆ పిల్లి పేరు సాషా. అయితే ఆ పిల్లి కడుపుతో ఉండగా, దాని మీద ఉన్న అభిమానంతో దానికి సీమంతం వేడుక చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన బంధుమిత్రులు పిల్లిని అందంగా తయారు చేసి, గాజులు తొడిగి సాంప్రదాయంగా సీమంతం జరిపించారు. ఇరుగు పొరుగు వారు పండ్లు, ఫలహారాలు ఇచ్చారు. పిల్లికి సీమంతం జరిపించడం చాలా ఆనందంగా ఉందని దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పెంపుడు కుక్కకు సీమంతం.. బంధుమిత్రులతో కలిసి ఘనంగా..
Seemantham Performed for Cow in Annamayya District: కుమార్తెలా ఆవు.. సీమంతం చేసి సంబరం