ETV Bharat / state

జనసంద్రంగా మేడారం జాతర - భక్తులతో కిటకిటలాడుతున్న వనదేవతల గద్దెలు - Medaram Jatara 2024

Rush at Medaram Jatara 2024 : మేడారంలో ముందస్తు మొక్కుల చెల్లింపులు కొనసాగుతున్నాయి. సమ్మక్క, సారలమ్మ ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారుతున్నాయి. వన దేవతల గద్దెలు భక్తజనంతో కిటికటలాడుతున్నాయి. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహా జాతరకు సమయం దగ్గర పడుతుండడంతో, అధికారులు ఏర్పాట్లు పూర్తిచేయడంపై దృష్టి సారించారు. ఆర్టీసీ 6000ల బస్సులను నడపనుంది.

Medaram Jatara 2024
Medaram Jatara 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2024, 9:15 AM IST

భక్తులతో కిటకిటలాడుతున్న వనదేవతల గద్దెలు

Rush at Medaram Jatara 2024 : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర (Medaram Jatara) ప్రసిద్దిగాంచింది. ఈ మహాజాతరకు తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తారు. వచ్చే నెలలో మహాజాతర జరగనుంది. ఇప్పట్నుంచే నుంచే మేడారంలో భక్తుల తాకిడి మొదలైంది. సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు.

Medaram Jatara 2024 : తొలుత సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లే ముందు భక్తులు గట్టమ్మతల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం మేడారం బాట పడుతున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, పసుపు, కుంకమలు, గాజులు, చీర సారె వనదేవతలకు (Sammakka Saralamma Jatara 2024) సమర్పిస్తున్నారు. బంగారాన్ని కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

జనసాగరంగా మేడారం జాతర - రెండు రోజుల్లో లక్షకు పైగా భక్తులు

మేడారంలోని జంపన్నవాగు, చిలకలగుట్ట, నార్లపూర్ తదితర ప్రాంతాల్లోని చెట్ల కింద విడిది చేస్తున్నారు. అనూహ్యంగా పెరిగిన భక్తులతో మేడారంలోని ప్రధాన దారులన్నీ వాహనాలతో కిక్కిరిసి పోయాయి. ఆలయ పరిసరాలు అమ్మవార్ల నామస్మరణతో మార్మోగాయి. రోజూ లక్షమందికిపైగా అమ్మవారిని దర్శించుకుంటున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు.

కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి (State Election Commissioner Parthasarathi) దర్శించుకున్నారు. ఏటా ఇక్కడికి వస్తామని తెలిపారు. వనదేవతల దర్శనానికి ముందు గట్టమ్మ అమ్మవారిని దర్శించుకుంటామని చెప్పారు. కుటుంబ సభ్యులతో సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటామని పేర్కొన్నారు. ఇక్కడికి రావడం సంతోషంగా అనిపిస్తుందని పార్థసారథి వివరించారు.

జాతరకు నెల రోజుల ముందే మేడారంలో భక్తుల రద్దీ

"సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నాం. ఇక్కడికి రావడం చాలా ప్రశాంతగా అనిపించింది. కుటుంబ సభ్యులతో సహా వచ్చాం. మేము కోరిన కోరికలను అమ్మవార్లు తీరుస్తున్నారు. మాకు అన్ని విధాల బాగుంది. అందుకే ప్రతి జాతరకు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటాం. ఆలయాన్ని చాలా బాగా అభివృద్ధి చేశారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. జాతర సమయంలో మరోసారి వస్తాం. " - భక్తులు

సకాలంలో పనులను పూర్తి చేస్తాం : మేడారం జాతర పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించింది. ఈ సారి పనులకు గుత్తేదారులు తక్కువగా టెండర్లు వేశారు. పనులు నెమ్మదించాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్లకు సూచిస్తున్నారు. నాణ్యతలో రాజీ పడకుండా సకాలంలో అన్నింటిని పూర్తి చేస్తామని ఐటీడీఏ పీవో అంకిత్ తెలిపారు.

Medaram Jatara Arrangements 2024 : జాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మేడారం మాహాజాతరకు ఆర్టీసీ ఈసారి 6,000ల బస్సులు నడపాలని నిర్ణయించింది. గత జాతరకు 3500 బస్సులను నడిపామని అధికారులు తెలిపారు. ఈ సారి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వాటికి అదనంగా మరో 2500ల బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వివరించారు.

మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కోసం కృషి : సీతక్క

Medaram: సమ్మక్క-సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారు.. ఎప్పటినుంచంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.