ETV Bharat / state

ఇది కోర్టును తక్కువ చేసి చూడటంతో పాటు మోసం చేయడమే : హైకోర్టు - HIGH COURT FIRE ON REVENUE OFFICERS

మధ్యంతర ఉత్తర్వులుండగా పట్టాదారు పేరును మార్చడం చట్టవిరుద్ధమన్న హైకోర్టు - చట్టప్రక్రియను దుర్వినియోగం చేశారని రూ.5 లక్షల జరిమానా

NARSINGI LAND CASE
HIGH COURT FIRE ON REVENUE OFFICERS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 8, 2024, 1:53 PM IST

Narsingi Land Issue Case : రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం నార్సింగిలో రూ.200 కోట్ల విలువైన రెండెకరాల భూమిపై హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. ఆ భూమి మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ధరణి పోర్టల్​లో పట్టాదారు పేరును మార్చడం చట్టవిరుద్ధమని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య కోర్టు అధికారాన్ని తక్కువ చేసి చూడటమే కాకుండా మోసం చేయడమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. రెవెన్యూ అధికారుల సాయంతో నార్సింగిలోని సర్వే నెం 310/14/1లో పట్టాదారుగా ఉన్న ఏషియన్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును తొలగించి ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును నమోదు చేసి పాస్​బుక్ జారీ చేయడాన్ని తప్పుబట్టింది.

ఆగ్రహించిన ధర్మాసనం : రెవెన్యూ అధికారుల అండదండలతో ధరణి పోర్టల్​లో పేరు మార్చుకోవడంతో పాటు కోర్టుకు వాస్తవాలు వెల్లడించని ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధి కరుణాకర్​పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవాలను తొక్కి పెట్టడం చట్టప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్​కు రూ.5 లక్షల జరిమానా విధించింది. 1908లో నార్సింగిలో కొనుగోలు చేసిన 2 ఎకరాల భూమి పట్టాదారుగా తమ పేరును తొలగించి ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్ పేరుతో గండిపేట తహసీల్దార్ పట్టా పాస్​బుక్​ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ ఏసియన్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున శత్రుగన్ అగర్వాల్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఎలాటి నోటీసు ఇవ్వలేదు : ఈ భూమికి సంబంధించి యధాతథాస్థితి కొనసాగించాలంటూ 2014లో ఇదే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ తమకెలాంటి నోటీసు ఇవ్వకుండా పిటిషనర్ పేరును తొలగించి ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్ పేరును పట్టాదారుగా చేర్చుతూ తహసీల్దార్ 2023 అక్టోబరు 13న ఉత్తర్వులు జారీ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. పట్టాదారు పాస్​బుక్ కూడా జారీ అయ్యిందన్నారు. దీనిపై 2014లో ఇదే హైకోర్టులో పిటిషన్ వేయగా ధర్మాసనం యదాతథస్థితి కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

కానీ రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై 2014 నాటి ఆర్డీఓ ఉత్తర్వుల ఆధారంగా ధరణి పోర్టల్​లో పేరును మార్చారని తెలిపారు. ప్రతివాది అయిన ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్ కౌంటరు దాఖలు చేస్తూ హైకోర్టులో వివాదం ఉన్న పిటిషన్​లో మధ్యంతర ఉత్తర్వులను పొడగిస్తూ ఏలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని చెప్పారు. పిటిషనర్​కు నోటీసులు ఇచ్చే మ్యుటేషన్ చేయించుకున్నామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను, రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి ఏషియన్ ట్యూబ్స్ పేరుతో ఉన్న మ్యుటేషన్​ను రద్దు చేస్తూ అదనపు కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్ తొక్కి పెట్టడాన్ని తప్పుబట్టారు.

ధరణి పోర్టల్​లో పునరుద్ధరించండి : అంతేగాకుండా ఈ కంపెనీ డైరెక్టర్​గా ఉన్న శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్​లో ప్రస్తుతం ప్రతినిధిగా చెబుతున్న కరుణాకర్ ప్రతివాదిగా ఉండటం ఆశ్చర్యకరమన్నారు. యధాతథస్థితి కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులుండగా వాటికి విరుద్ధంగా తీస్తుకున్న చర్యలన్నీ చట్టవ్యతిరేకమైనవని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలన్నీ రెవెన్యూ అధికారుల సహకారం లేకుండా జరిగాయని చెప్పలేమని కోర్టు అభిప్రాయపడింది. 2014 నాటి కోర్టు ఉత్తర్వుల ప్రకారం పిటిషనర్ పేరును ధరణి పోర్టల్​లో పునరుద్ధరించాలని న్యాయమూర్తి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. చట్టవిరుద్ధంగా మ్యుటేషన్ ప్రక్రియలో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.

పట్నం నరేందర్​ రెడ్డికి చుక్కెదురు - ఆ క్వాష్ పిటిషన్​ను కొట్టేసిన హైకోర్టు

మల్లయ్య మృతదేహాన్ని గురువారం వరకు భద్రపరచండి : హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.