RTC Md Sajjanar Appreciates Conductor And Bus Driver : బస్సులో గుండె నొప్పితో బాధపడుతున్న ఓ విద్యార్థికి సకాలంలో వైద్య సాయం అందించి ఉదారత చాటుకున్న తమ సిబ్బందిని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. బుధవారం హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో నిర్మల్ జిల్లా భైంసా డిపోకు చెందిన కండక్టర్ జి.గంగాధర్, బస్సు డ్రైవర్ బి.గంగాధర్‌లను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఉన్నతాధికారులతో కలిసి సన్మానించి, నగదు బహుమతులు అందజేశారు.
బస్సులో గుండె నొప్పితో బాధపడుతున్న విద్యార్థికి సకాలంలో వైద్య సాయం అందించి ఉదారత చాటుకున్న తమ సిబ్బందిని #TGSRTC యాజమాన్యం అభినందించింది.
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) September 11, 2024
బైంసా డిపోనకు చెందిన కండక్టర్ జి.గంగాధర్, అద్దె బస్సు డ్రైవర్ బి.గంగాధర్‌ను హైదరాబాద్ బస్ భవన్ లో బుధవారం ఉన్నతాధికారులతో… pic.twitter.com/2fYaGz4VA9
ఈ నెల 9న భైంసా నుంచి నిర్మల్‌కు బస్సు వెళ్తుండగా దిలావర్‌పూర్ వద్దకు రాగానే బస్సులో ప్రయాణిస్తున్న 12 ఏళ్ల విద్యార్థి కిరణ్‌కు గుండె నొప్పి వచ్చింది. దీంతో ఒక్కసారిగా బస్సులో కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ జి.గంగాధర్ అప్రమత్తమై డ్రైవర్‌కు చెప్పి బస్సును పక్కకు ఆపారు. డ్రైవర్ బి.గంగాధర్‌తో కలిసి ప్రాథమిక చికిత్స అందించారు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో వెంటనే కిరణ్‌ను బస్సులోనే సమీపంలో ఉన్న నర్సాపూర్ పీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు కిరణ్‌కు చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు.
సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడం వల్ల కిరణ్‌కు ప్రాణాప్రాయం తప్పిందని అక్కడి వైద్యులు తెలిపారు. సమయస్పూర్తితో వ్యవహరించి 12 ఏళ్ల విద్యార్థి ప్రాణాలను కాపాడిన డ్రైవర్ బి.గంగాధర్, కండక్టర్ బి.గంగాధర్‌లను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అభినందించారు. ఆపద సమయంలో సేవాతర్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం గొప్ప విషయమని అన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తుండటం అభినందనీయమని ఎండీ సజ్జన్నార్ ప్రశంసించారు.
ప్రజలందరూ అవయవదాతలుగా మారాల్సిన అవసరం ఉంది : వీసీ సజ్జనార్ - VC Sajjanar on Organ Donation