RS Praveen letter to CM Revanth Reddy on Teachers Board : తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక మండలి (టీఆర్‌ఈఐ-ఆర్‌బీ) ఉద్యోగ నియామకాల్లో సరైన విధానం పాటించి, అవరోహణ క్రమంలో(Desending Order) ఉద్యోగాలు భర్తీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు "ఎక్స్" వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు నియామకాలు కొందరికి మోదం, మరికొందరికి ఖేదం మిగిలిస్తుందని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
గత ఏడాది గురుకుల బోర్డు డిగ్రీ లెక్చరర్, పీజీటీ(PGT), టీజీటీ లాంటి అనేక ఉద్యోగ నియామకాలకు వరుస నోటిఫికేషన్లు జారీ చేయడంతో అర్హత కలిగిన వేలాది మంది నిరుద్యోగులు అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని పరీక్షలు రాశారని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బోర్డు వెల్లడించిన అన్ని ఫలితాల్లో ఒకే అభ్యర్ధి, ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు.
RS Praveen kumar Demand to Fulfill Teachers Jobs : ఒకే అభ్యర్థి వివిధ ఉద్యోగాలకు ఎంపిక కావడం వల్ల ఎక్కువ ఉద్యోగాలు సాధించి వ్యక్తి ఏదో ఒక ఉద్యోగాన్ని ఎంచుకొని మిగతా వాటిని వదిలేయడం జరుగుతుందని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రస్తావించారు. ఫలితంగా ఆ అభ్యర్ధి వదిలి వెళ్లిన ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉండిపోవడం వల్ల తర్వాత మెరిట్ లిస్టులో(Merit List) ఉన్న అభ్యర్ధులకు తీరని నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
బోర్డు తక్షణమే జనరల్ ర్యాంకింగ్ ప్రకటించి, అవరోహణ క్రమంలో ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. మరోవైపు, ఉద్యోగాలు ఖాళీగా మిగలకుండా ఉండాలంటే అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా రెండో జాబితా విడుదల చేసి ఖాళీలు లేకుండా ప్రకటించిన అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
'టీఆర్‌ఈఐ-ఆర్‌బీ ప్రకటించిన ఉద్యోగ నియామకాలను అవరోహణ క్రమంలో లేకపోవడం వల్ల సుమారు 1,500 ఉద్యోగాలు ఖాళీగా మిగిలిపోయే అవకాశం ఉంది. దీని వల్ల అహర్నిశలు కష్టపడి చదివినా నిరుద్యోగులకు అన్యాయం తీరని జరుగుతున్నది. తక్షణమే టీఆర్‌ఈఐ-ఆర్‌బీ స్పందించి గురుకుల ఉద్యోగాల నియామకంలో ఖాళీలు లేకుండా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలి.'- ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు.
తెలంగాణలో ప్రభుత్వ కొలువుల జాతర షురూ - ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ ఫోకస్
గోదావరిఖని యువకుడి అద్బుత విజయం- ఒకేసారి 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సాయిలెనిన్