ETV Bharat / state

సంగారెడ్డిలో దారుణం - బాలుడిని చంపి, సెల్​ టవర్​ పైకెక్కి ఉరేసుకున్న రౌడీ షీటర్‌ - Rowdy Sheeter Killed 13 years Boy - ROWDY SHEETER KILLED 13 YEARS BOY

Rowdy Sheeter Killed Boy and Committed Suicide in Sangareddy : సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం జోగిపేటలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలుడిని చంపి, నాగరాజు అనే రౌడీషీటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని ఓ దుకాణంలో కేబుల్‌ వైర్లను నాగరాజు చోరీ చేస్తుండగా, చూసి ఆ విషయం యజమానికి చెప్పాడనే అక్కసుతో శేఖర్‌ అనే బాలుడిపై కక్ష గట్టి, చివరకు బాలుడిని హతమార్చి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.

Sangareddy Crime News
Rowdy Sheeter Killed Boy and Committed Suicide
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 21, 2024, 5:07 PM IST

Updated : Apr 21, 2024, 5:18 PM IST

Rowdy Sheeter Killed Boy and Committed Suicide : సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం జోగిపేటలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలుడిని చంపిన నాగరాజు అనే రౌడీషీటర్‌ సెల్‌ టవర్‌ పైకెక్కి, ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జోగిపేట పట్టణంలో ఓ దుకాణంలో నాగరాజు కేబుల్‌ వైర్లు దొంగతనం చేశాడు. ఆ ఘటనను చూసిన శేఖర్ (13), విషయాన్ని దుకాణదారులకు తెలిపాడు. దీంతో నాగరాజును దుకాణదారుడు ప్రశ్నించగా, అక్కడ వాదోపవాదాలు జరిగాయి.

అనంతరం నాగరాజు ప్రకాశ్​ అనే వ్యాపారి వద్దకు వెళ్లి డబ్బులు అడిగాడు. దానికి నిరాకరించిన అతని తలపై కత్తితో దాడి చేశాడు. దొంగతనం గురించి దుకాణదారుడికు సమాచారం ఇచ్చాడన్న కోపంతో శేఖర్​పై కోపంతో ఉన్న నాగరాజు, శనివారం రాత్రి మాట్లాడాలని బాలుడిని పిలిపించాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి ఆ బాలుడిని అతి దారుణంగా కత్తితో నరికి చంపి మృతదేహాన్ని చెరువులో పడేశాడు.

Thief Killed Boy
Rowdy Sheeter Killed Boy and Committed Suicide

విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడు నాగరాజుకు ఫోన్ చేసి స్టేషన్​కు రమ్మన్నారు. బాలుడిని తానే హత్య చేసినట్లు ఆ రౌడీషీటర్​ పోలీసులతో చెప్పాడు. గజ ఈతగాళ్లతో పోలీసులు బాలుడి మృతదేహాన్ని చెరువు నుంచి బయటికి తీశారు. కాగా కుటుంబసభ్యుల ఆందోళనతో నాగరాజు సెల్ టవర్ ఎక్కి హల్​చల్ చేశాడు. కిందకు దించేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరిపైనా కత్తితో దాడి చేశాడు.

బాలుడిని చంపి ఉరేసుకున్న రౌడీ షీటర్‌ : ఉదయం నుంచి సెల్ టవర్ పైనే ఉన్న నిందితుడు నాగరాజును పోలీసులు కిందకు దిగమని చెప్పినా పట్టించుకోలేదు. చివరకు డ్రోన్ల సహాయంతో నాగరాజు పరిస్థితిని పరిశీలించగా, అతని మెడకు కేబుల్ వైర్లు చుట్టుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. బాలుడిని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడు నాగరాజు మృతదేహాన్ని పోలీసులు కిందికి దించారు. శవ పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. నాగరాజుపై గతంలో చాలా కేసులు ఉన్నాయని, దుకాణదారులపై దాడులకు పాల్పడుతూ డబ్బులు తీసుకునేవాడని స్థానికులు చెబుతున్నారు.

తల్లీకూతుళ్లను నరికి చంపిన సైకో కిల్లర్​- ప్రాణభయంతో పరార్​- ఇంతకుముందు కూడా! - Husband Kills Wife And Children

సెల్​ఫోన్​ కోసం నానమ్మను హత్య చేసిన మనవడు - మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చేశాడు

Last Updated : Apr 21, 2024, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.