Road Accident in Guthi Anantapur Distirct : మరో పది రోజుల్లో పెళ్లి ఉందని కుటుంబం అంతా వస్త్రాలు కొనుగోలు చేసేందుకు ఏపీలోని అనంతపురం జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. వారికి నచ్చిన బట్టలు తీసుకుని కారులో తిరిగి వారి ఊరు వస్తున్న క్రమంలో ఊహించని ఘటన జరిగింది. అనంతపురం జిల్లాలో జాతీయ రహదారి దగ్గరకు వచ్చినప్పుడు ఎదురుగా వెళ్తున్న లారీని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. కారు నడుపుతున్న వ్యక్తి నిద్ర మత్తులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
పోలీసుల కథనం ప్రకారం అనంతపురంలోని రాణినగర్‌కు చెందిన ఏడుగురు హైదరాబాద్ నుంచి అనంతపురం జిల్లాకు కారులో బయలుదేరారు. గుత్తికి 4 కిలోమీటర్ల దూరంలో రాయల్ దాబా వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. మరో ఇద్దరు గుత్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
రోడ్డు ప్రమాదంలో దంపతులు, కుమారుడు మృతి - Road Accident
Car Accident at Anantapur in AP : రోడ్డు ప్రమాదంలో అల్లీ సాహెబ్ (58), షేక్ సురోజ్‌బాషా(28) మహ్మద్ అయాన్(6), అమాన్(4), రెహనాబేగం(40) మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. షేక్ సురోజ్ బాషా వివాహం ఈ నెల 27న జరగనుంది. పెళ్లి వస్త్రాల కొనుగోలు కోసం హైదరాబాద్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనపై గుత్తి సీఐ వెంకట్రామిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
విలేఖరి ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ : సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన ఏపీలోని వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో జరిగింది. జమ్మలమడుగు వైపు నుంచి ముద్దనూరు వైపు వెళ్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో రైల్వే గేటును ధ్వంసం చేసుకుంటూ ఓ విలేకరి ఇంట్లోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్రేన్ సహాయంతో లారీని బయటకు తీసేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేదు. లారీని బయటికి తీసుకొస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.
టైర్ పేలి ట్రక్కును ఢీకొన్న కారు- 8మంది మృతి- మరో ప్రమాదంలో ఆరుగురు మరణం - Road Accident