Road Accident At Prakasam Naidupalem Highway : ఎంతో ఘనంగా కుమార్తె వివాహం చేసి బంధువులతో సంతోషంగా తిరిగివస్తున్న తల్లిని, బంధువులను మృత్యువు కబళించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్‌తో సహా ముగ్గురు తీవ్రగాయాలుపాలయ్యారు. డ్రైవర్ నిద్రమత్తు వల్ల కారు అదుపుతప్పి బోల్తాపడి ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
Three Were Died Three severely Injured: పోలీసులు తెలిపిన వివరాలు మేరకు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం నాయుడుపాలెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణలోని పాల్వంచలో కుమార్తె వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్‌కు (RIMS) తరలించామని వెల్లడించారు. కాసేపట్లో స్వగ్రామానికి చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.
బుధవారం సాయంత్రం వివాహానికి హజరై తిరిగి పెళ్లి కారులోనే బంధువులు, పెళ్లి కుమార్తె తల్లి అరుణ స్వగ్రామానికి పయనమయ్యారు. ఈరోజు ఉదయం 6.30 -7 గంటల సమయంలో నాయుడుపాలెం జాతీయ రహదారి వద్ద ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. డ్రైవర్ నిద్రమత్తు వల్ల ప్రమాదం జరిగిందని వారు తెలిపారు. ముగ్గురు మహిళలు అక్కడికక్కడే చనిపోవటంతో మిగిలిన ముగ్గురు వినోద్ (డ్రైవర్), వేణు, అభిలాష్ (బాలుడు)లను సహాయక చర్యలు చేపట్టి హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు.
వివాహ వేడుకలు ముగించుకొని కందుకూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మరికొద్ది సేపట్లో స్వగ్రామానికి చేరుకోవాల్సి ఉండగా ప్రమాదం జరగడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతులు అరుణ (పెళ్లి కుమార్తె తల్లి), దివ్య, శ్రావణిలుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పెట్రోల్ బంకు వద్ద కారులో మంటలు - స్థానికుల అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
Nellore Two Lorry Drivers Death: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం భోగ్యంవారిపల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి మినీ లారీ ఢీకొట్టటంతో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. లారీ ఆపి టైర్లలో గాలి చూస్తున్న డ్రైవర్‌ను మినీలారీ వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెద్దలారీ డ్రైవర్, మినీ లారీ డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని జేసీబీ సహాయంతో పోలీసులు బయటకు తీశారు. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లికి వెళ్లి వస్తున్న కారు, ట్రాక్టర్ ఢీ- ముగ్గురు చిన్నారుల సహా 9మంది మృతి