Ravinder Family Protest at Cantonment Hospital : సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో చెట్టు కూలి మృతి చెందిన రవీందర్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతుని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. కంటోన్మెంట్ ఆసుపత్రి సిబ్బంది, హార్టికల్చర్ విభాగం వైఫల్యం మూలంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తు మృతుని బంధువులు నిరసన తెలుపుతున్నారు. ఆసుపత్రికి వస్తున్న సమయంలో చెట్టు కూలి అకారణంగా మృతి చెందిన రవీందర్ కుటుంబానికి ఆసుపత్రి యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
Tree fell Down Person Died Incident : రవీందర్ కుటుంబ సభ్యులు బంధువులతో పాటు మంగళవారం జరిగిన ప్రమాదంలో గాయపడిన సరళా దేవిని సైతం ఆసుపత్రికి తీసుకొచ్చి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. కంటోన్మెంట్ ఆసుపత్రి యాజమాన్యం, సీఈవో మధుకర్ నాయక్ తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
మాను రూపంలో మృత్యు కాటు - దంపతులపై కూలిన చెట్టు - భర్త మృతి - TREE FALSS ON MAN IN HYDERABAD
అసలు ఏమి జరిగిందంటే : సికింద్రాబాద్ శివారు ప్రాంతంలో తూముకుంటకు చెందిన రవీందర్, సరళాదేవీ దంపతులు నివసిస్తున్నారు. సరళాదేవి బొల్లారంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆమెకు మోకాలి నొప్పి రావడంతో మంగళవారం చికిత్స కోసం కంటోన్మెంట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ మృత్యువు మాను రూపంలో మాటు వేసిందనే విషయం తెలిక స్కూటీపై వైద్యశాల గేటు ముందుకు రాగానే వారిపై చెట్టు విరిగి వారిపై పడింది. ఈ ఘటనలో రవీందర్‌ను బలి తీసుకోగా భార్య సరళాదేవి తీవ్ర గాయపడ్డారు.
Tree Falls on Bike Man Die : సరళాదేవికి చికిత్స అందించిన తరువాత కోలుకోని చనిపోయిన విషయం తెలియక తన భర్త గురించి ఆరా తీశారు. ఈ పరిస్థితిని చూసి బంధువులు, తోటి ఉపాధ్యాయులు సైతం కన్నీటిపర్యంతమయ్యారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బందిని పోలీసులు వివరణ కోరగా రెండు వారాల క్రితమే ఆసుపత్రిలోని ప్రమాదకర వృక్షాలను నరికి వేయించామని వెల్లడించారు.