ETV Bharat / state

గురుకుల పాఠశాలలో 12 మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు - మళ్లీ అదే జిల్లాలోనే - Rat Bite to Students in Medak - RAT BITE TO STUDENTS IN MEDAK

Rat Bite to Students in Medak : ఉమ్మడి మెదక్​ జిల్లాలోని గురుకుల పాఠశాల బాలికలను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామాయంపేట సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో 12 మందిని ఎలుకలు కరిచాయి. వెంటనే సదరు బాధిత అమ్మాయిలను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rat Bite to School Students in Medak
Rat Bite to Students in Medak (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 11, 2024, 5:38 PM IST

Rat Bite to School Students in Medak : ఉమ్మడి మెదక్​ జిల్లాలోని సుల్తాన్ పూర్ జేఎన్​టీయూలో చట్నీ పాత్రలో ఎలుక, రామాయంపేట ఆదర్శ పాఠశాల వసతి గృహంలోని అల్పాహారంలో బల్లి పడిన సంఘటనలు మరువకముందే మళ్లీ ఇదే తరహా ఉదంతం వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లాలోని రామాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులను ఎలకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పాఠశాలలోని 12 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి.

తొమ్మిదో తరగతి చదువుతున్న సదరు బాధిత అమ్మాయిలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హాస్టల్ వద్ద కుక్కలు, ఎలుకలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని విద్యార్థుల తల్లిండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు తమ సమస్యలను మొరపెట్టుకుంటున్నా పట్టించుకున్న పాపన పోలేదని వాపోయారు. 12 మంది విద్యార్థులకు ఎలుకలు కరిచినప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

'స్కూల్​లో, హాస్టల్​లో పరిశుభ్రత లేదు. ఎక్కడ చెత్త అలానే ఉంటుంది. దీని వల్ల పిల్లలకు ఎలుకలు కరిచాయి. 12 మంది విద్యార్థులకు ఎలుకలు కరిచినప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదు'- విద్యార్థిని తండ్రి

పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్లే : పాఠశాల హాస్టల్ చుట్టూ పరిసరాలు కంపు కొడుతుండడంతో దోమలు వస్తున్నాయని, కుక్కలు సంచరిస్తూ తమపై దాడి చేస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిసరాలు పరిశుభ్రం చేయడంతో పాటు కుక్కలు, ఎలుకలు, దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై పాఠశాల ప్రిన్సిపల్​ వరూధిని స్పందించారు. ఎలుకలు సంచరించకుండా ర్యాట్​ ప్యాడ్లు, బోన్లు ఏర్పాటు చేస్తామని, పరిసరా ప్రాంతం అంతా శుభ్రం చేయిస్తామని తెలిపారు. విద్యార్థులను ఆసుపత్రిలో చికిత్స చేయించామని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

'మాకు గత మూడు రోజులు నుంచి ఎలుకలు కరుస్తున్నాయి. ఒకరోజు ముగ్గురికి ఎలుకలు కరిచాయి. దీంతో వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇప్పుడు 12 మందిని కరిచాయి. ఇప్పుడు వాళ్ల తల్లిదండ్రులు స్కూల్​కు వచ్చి వారిని ఆసుపత్రిలో చూపించారు'- పాఠశాల విద్యార్థి

ఆదర్శ పాఠశాలలోని అల్పాహారంలో బల్లి - అస్వస్థతకు గురైన విద్యార్థులు

ఎలుకా ఎలుకా ఉచ్ ఎక్కడికెళ్లావోచ్ - చట్నీలో స్విమ్మింగ్ చేస్తున్నానోచ్ - RAT IN CHUTNEY AT JNTU COLLEGE

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.